వాటర్ ప్లాంట్ కు భూమి పూజ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ యువనా యకుడు తీన్మార్ జయ్ చేప డుతున్నటువంటి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కోసం వాటర్ ప్లాంట్ గ్రామయువకుల,పెద్దమనుషుల సమక్షంలో భూమిపూజ చేయడం జరిగింది ఊరికి ఉచితంగా సేవచేయడంకోసం వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగు తుంది వాటర్ ప్లాంట్ అయ్యే దాకా గ్రామ ప్రజలు యువకు లు, పెద్దమనుషులు ముఖ్యం గా మహిళలు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.వాటర్ ప్లాంట్ కట్టడం కోసం ఊరి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వారు గ్రామంలో పెద్దవారు అయినా వారు ఎవ్వరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి విరాళం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు పెద్దమనుషులు తీన్మార్ జయ్ సదర్ లాల్ భాస్కర్ కిరణ్ కుమార్ స్వామి వేముల రమేష్ రతన్ గణేష్ అమిత్ సునీల్ కృష్ణ జితేందర్ రాకేష్ లక్ష్మణ్ నవీన్ రవీందర్ రెడ్డి నాయక్ అజయ్ తది తరులు పాల్గొన్నారు.