టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్…

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్
మెట్ పల్లి సెప్టెంబర్ 23 నేటి దాత్రి

 

మెట్ పల్లి పట్టణం: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కోరుట్ల అసెంబ్లీ నియిజకవర్గ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందించారు. కన్వీనర్ గా సీనియర్ న్యాయవాది ఎం.డి.రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ గా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రెటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా లకు నియామక ఉత్తర్వులు అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం ల సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్వులు పంపినట్లు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్బంగా నియామక ఉత్తర్వులు అందుకున్న న్యాయవాదులు వారి నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఏజిపి అబ్దుల్ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, కార్యదర్శి రాంప్రసాద్, న్యాయవాదులు తెడ్డు ఆనంద్, సురక్ష, కోటగిరి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

సత్యసాయి సేవా సమితి వ్యాస పోటీ…

“సత్య సాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “డిగ్రీ” విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
మెట్ పల్లి ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 10 వ తేదీన “సత్యసాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “వ్యాసరచన” పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.కే.వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ,సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో “భవిష్యత్తు కోసం ప్రస్తుతం మనం ఏమి చేయాలి”( ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ వాట్ వి డు ఇన్ ద ప్రెజెంట్) అన్న శీర్షికపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పోటీలు ఉదయం 11 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ – కళాశాల విద్య కమీషనర్ (సీ సీ ఈ) శ్రీమతి ఏ.దేవసేన మరియు సీసీఈ జాయింట్ డైరెక్టర్ ఆచార్య డీ ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.కళాశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు. మానవ విలువలను పెంచడం కోసమే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ “సత్య సాయి సేవా సమితి” స్పష్టంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. ఇతర సమాచారం కోసం 98493 94561 నెంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కళాశాల కామర్స్ హెచ్.ఓ.డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, దశరథం, బోధనేతర సిబ్బంది లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, లింగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి గోదాములో అగ్నిప్రమాదం…

మెట్ పల్లి ఆగస్టు 14 నేటి ధాత్రి

 

 

వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి మార్కెట్ యార్డు నందు 2000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నాన్-నాబార్డు గోదాము నందు అగ్ని ప్రమాదం జరిగినది. ఇట్టి అగ్ని ప్రమాదం నందు సివిల్ సప్లయిన్ వారి పాత గోనె సంచులు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలిసు శాఖ, రెనెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మరియు వివిధ శాఖలకు సంబందించిన ఉద్యోగులు మరియు కార్మికులు మంటలను అదుపులోకి తేవడానికి సహాయ సహకారాలు అందించారు.
తదుపరి తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి అధ్యక్షులు కూన గోవర్ధన్ పైన తెలిపిన డిపార్ట్ మెంట్ వారు అందించిన సహాయ సహాకారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version