ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DM&HO) డాక్టర్ మధుసూదన్ గారు ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆస్పత్రి హాజరు పట్టికను పరిశీలించినారు. ఆసుపత్రి ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలియజేసినారు. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేసినారు. అదేవిధంగా ఆస్పత్రిలో లేబర్ రూమ్ ,ఆయుష్ రూమ్, యోగ రూమ్ ములను పరిశీలించినారు .
తర్వాత మొగుళ్లపల్లి ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించినారు. వాక్సినేషన్ టిబి నోటిఫికేషన్ , సీజన్ వ్యాధుల గూర్చి మరియు ఎన్ సి డి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లి మండలంలో ఉచిత వైద్య శిబిరాలు

ఉచిత వైద్య శిబిరం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ములకలపల్లి, రంగాపూర్ ,ఇప్పలపల్లి గ్రామాలలో మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లిలో డాక్టర్ సరళ ,రంగాపూర్ లో డాక్టర్ వాణి క్యాంపు నిర్వహించినారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,కాచి చల్లార్చిన నీరు తాగాలని ,వేడివేడి ఆహార పదార్థాలు తినాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని, దోమలు కుట్టడం వల్ల మలేరియా ,చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,జ్వరాలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని తెలిపారు ములకలపల్లి లో 71 మందికి రంగాపూర్ లో 66, ఇప్పలపల్లిలో 56, మందికి వైద్య పరీక్షలు చేసి 5 రక్తనాళాలు తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ కార్యక్రమంలో కమిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,ఏఎన్ఎమ్స్ శ్రీలత ,భారతి, సువర్ణ ,సబిదా ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version