కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు…

కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు

 

తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ల మధ్య 6 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తోంది.

అయితే.. రాకేష్ దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో జులై 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. తనను తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తుంది. అలాగే.. వారి నుంచి తనకు, తన భర్త రాకేష్‌కు ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు…

పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు – యువకులు ముందుకు రావాలని వర్ధన్నపేట పోలీసుల విజ్ఞప్త

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువజన సంఘాలు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని వర్ధన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో వర్ధన్నపేట పోలీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 29, 2025 (బుధవారం) ఉదయం 10 గంటల నుండి పాలకుర్తి బసారత్ ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడనుంది.
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఉప పోలీస్ అధికారి ఎన్. సాయి బాబు మాట్లాడుతూ —
“దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగానికి గౌరవం తెలపడానికి రక్తదానం చేయడం ఒక మహత్తరమైన సేవ. ప్రతి గ్రామంలోని యువజన సంఘాలు, విద్యార్థులు, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. మనం ఇచ్చే ఒక్క సీసా రక్తం ఎవరికో కొత్త జీవం అందించగలదు” అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువజన సంఘాలు, సామాజిక సేవా సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. రక్తదానం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
ఈ రక్తదాన శిబిరం నిర్వహణలో స్థానిక వైద్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. సంప్రదించవలసిన వారి నెంబర
SI ఎన్. సాయి బాబు – 8712685215
PC అజయ్ – 8712552532

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

పాలకుర్తి నేటిధాత్రి

భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పాలకుర్తి తెగువ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకణిక, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలకుర్తి మార్కెట్ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, పాలకుర్తి బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జలగం కుమార్, పాలకుర్తి గ్రామ అధ్యక్షులు కమ్మగాని నాగన్న, మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, వి ఆర్ ఫౌండేషన్ మోలుగురి యాకన్న పన్నీర్ వెంకన్న, మాజీ వార్డ్ నెంబర్ పెనుగొండ రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారగని ఎల్లయ్య, యువ నాయకులు గడ్డం బాబు, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.

వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ

జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు

 

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.

మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.

సామాజిక స్పృహకు అద్దం
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు.
తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు

జర్నలిస్టుల హక్కులకై సమిష్టిగా పోరాడుదాం

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో ప్రభుత్వాల కుట్రలకు బలైపోయిన కలం కార్మికులకు నివాళులర్పిస్తూ కలం కార్మికుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జర్నలిస్టు యోధులు షేక్ బందగీ, ఎన్ కౌంటర్ దశరథ రామ్, గౌరీ లంకేష్, ల ఆశయాలను కొనసాగించాలని కోరారు. కలం కార్మికుల హక్కుల కోసం సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బండిపెల్లి మధు (జర్నలిస్టు సూర్య), ప్రెస్ క్లబ్ కోశాధికారి కొత్తకొండ వాసు (బెస్ట్ వాయిస్ రిపోర్టర్), కార్యవర్గ సభ్యులు కమ్మగాని నాగన్న (పయనించే సూర్యుడు), గజ్జి సంతోష్ కుమార్ ( నేటి దిన పత్రిక సూర్య ), వన్నాల ధనుంజయ (నేటిధాత్రి), అబ్బోజు యాక స్వామి (ఐ న్యూస్), సీనియర్ జర్నలిస్ట్ చిట్యాల మధు (నమస్తే తెలంగాణ) పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version