సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..
“నేటిధాత్రి” హనుమకొండ. ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలి రావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,అభిమానులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలోని సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
We need to move to the silver jubilee ceremony.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ.. – మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. – అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసింది. – నేడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగలేని పరిస్థితుల్లో ఉన్నారు. – 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు బయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడంలేదు. – స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలి.సమన్వయంతో ఉండాలి. – కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలపాలి. – పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతికార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. – ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదు. – ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..ప్రజలకు అండగా ఉంటాం. – ఈ నెల 27న ఎల్కతుర్తి శివారులో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలి వెళ్దాము. – రేపటి నుండి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాలలోకి వెళ్లి సమావేశాలు నిర్వహించాలి. – ఏ గ్రామం నుండి ఎంతమంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో,కావాల్సిన వాహనాలు ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలి.
We need to move to the silver jubilee ceremony.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు,మండల అదేకాశులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…
సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….
HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు.. విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…
దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు… ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…
ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.
ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు
తృణమూల్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం
వామపక్ష హిందూ ఓటర్ల ఆలోచనలో మార్పు
శ్రీరామనవమి ర్యాలీల ద్వారా హిందువుల ఐక్యతకోసం వ్యూహం
రాష్ట్రవ్యాప్తంగా 20వేల ర్యాలీల నిర్వహణకు నిర్ణయం
ఎప్పటిలాగే అనుమతివ్వని మమతా ప్రభుత్వం
హైదరాబాద్,నేటిధాత్రి:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో ఇటీవల పెరిగిపోతున్న అసహన తీవ్రతను గమనించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె తీవ్ర ఒత్తిడిలో వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జాగృతి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమెలో ఒకవిధమైన ఆందోళన కనిపిస్తోంది. గత ఇరవయ్యేళ్ల పాలనలో ఆమె హిందువుల పండుగులకు ఏనాడు ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వలేదు. ఇందుకు కారణం ముస్లింల ఓట్లు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడతాయి కనుక ఆమె ఈ వర్గంవారిని సంతృప్తిపరచేందుకోసం వారికి అను కూల నిర్ణయాలు తీసుకుంటూ రావడం గమనార్హం. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో ముస్లింల శాతం 27శాతం కాగా ఇప్పుడు దాదాపు 40శాతం వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చీలిపోయే హిందువుల ఓట్లకంటే, ఏకమొత్తంగా పడే ముస్లింల ఓట్లు మమతా బెనర్జీని అధికారంలో నిలుపుతాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందు కెళుతున్న బీజేపీ హిందూ ఓట్లను సుసంఘటితం చేసే యత్నాలు గట్టిగా ప్రారంభించింది. గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని మరీ అడుగులు ముందుకేస్తోంది. గతంలో వచ్చిన 38.5శాతం ఓట్లశాతానికి మరో ఐదు లేదా ఏడుశాతం ఓట్లు అధికంగా సాధించగలిగితే అసెంబ్లీలో పాగా వేయవచ్చన్నది పార్టీ వ్యూహం. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అవధులు లేని స్థాయికి చేరుకున్న అవినీతి, అత్యాచారాలు, హత్యలు, ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన వంటివి హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచేశాయి. ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతోంది.
ఈ వ్యూహంలో భాగంగా వచ్చే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కోటిమందితో రాష్ట్రంలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే పోలీసు లు శాంతిభద్రతల సమస్యను చూపుతూ ఇందుకు అనుమతినివ్వలేదు. ఉదాహరణకు శ్యాంపూర్‌లో రెండు`మూడు లక్షలమంది హిందూ జనాభా వుంటే, ఇక్కడ ర్యాలీలో కేవలం 2000` 2500 మంది మాత్రమే పాల్గనాలని పోలీసులు ఆంక్షలు విధించడం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇటు వంటి మితిమీరిన ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా విధించడంతో విపక్షనేత సుబేందు అధికారిఇప్పుడు ప్రభుత్వంపై నేరుగా విమర్శల దాడిని పెంచారు. రాజ్యాంగంలోని 25`28 అధికరణ లు ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆయన ఎదురుదాడికి ది గారు. ‘సనాతని’లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అణచివేయడం మమతా ప్రభుత్వానికే చెల్లిం దంటూ ఆ యన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామనవమికి కోటి మందితో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్లకోసం ఆమె జిహాదీ మూకలకు మద్దతు పలుకుతూ హిందువులపై దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆ యన విమర్శల మాట ఎట్లావున్నా, రాష్ట్రంలోని హిందువుల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరమైన చైతన్యం వచ్చిందనే చెప్పాలి. హిందువుల ఓట్లు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీల మధ్య చీలిపోయి వుండటం తృణమూల్ కాంగ్రెస్‌కు వరంగా మారింది. ఇదే సమయంలో ముస్లింల ఓట్లు గంపగుత్తగా సాధించడంతోపాటు, తనకు పడే హిందూఓట్లు ఆమె అధికారాన్ని చెక్కుచెదర కుండా కాపాడుతున్నాయి. కానీ ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల ఆలోచనా సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వామపక్షాలు సోదిలోలేకుండా పోయినా, వారికున్న హిందూ ఓటర్లు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తనను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ గత డిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇదే పంథా పశ్చిమ బెంగాల్‌లో కూడా అనుసరించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి తృణమూల్ కాంగ్రెస్‌కు స్నేహపూర్వక మద్దతు ఇచ్చినా, మమత తమను ఎంతమాత్రం ఖాతరు చేయకపోవడం కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడుపడటంలేదు. ఈసారి కాంగ్రెస్ ఓటుబ్యాంకు, తృణమూల్‌కు అనుకూలంగా ఓటు వే యనట్లయితే ఆమేరకు మమతా బెనర్జీకి నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఎంత ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడినా, హిందూ ఓట్లు రాకపోతే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం కష్టం. తాజా పరిణామాల నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తృణమూల్ పుట్టి మునగడం ఖాయం.
ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో వుంచుకొని బీజేపీ నాయకుడు సుబేందు అధికారి ఇప్పుడు నే రుగా సనాతని, హిందూత్వలకు అనుకూలంగా తన ప్రసంగాల వాడిని పెంచారు. ‘జో హమారే సాత్, హమ్ ఉన్‌కే సాత్’, ‘సబ్‌కా సాత్, సబ్‌గా వికాస్’ నినాదాలతో 2024 జులైనుంచి ఆయనతన ప్రసంగ ధోరణినే పూర్తిగా మార్చివేశారు. కొన్ని సందర్భాల్లో ‘కేవలం హిందువులు మాత్రమే హిందూస్తాన్‌ను పరిపాలిస్తారు’ అంటూ నినాదాలిస్తున్నారు. బహుశా ఈ దూకుడుకు ప్రధానకారణం వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకులోని హిందూ ఓటర్లను ఆకర్షించడానికేనని చెప్పక తప్పదు.
నిజం చెప్పాలంటే 2019 పార్లమెంట్ ఎన్నికలనుంచి తృణమూల్ కాంగ్రెస్‌ను సవాలు చేసే స్థా యికి బీజేపీ ఎదిగింది. నాటి ఎన్నికల్లో ఏకంగా 40.7% ఓట్లతో 18 లోక్‌సభ స్థానాల్లో (మొ త్తం 42సీట్లు) గెలుపు సాధించింది. 2014లో పార్టీకి రాష్ట్రంలో కేవలం 17శాతం ఓట్ల మద్దతు మాత్రమే వుండేది. కేవలం రెండు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేంది. ఇక 2016లో అ సెంబ్లీలో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచు కొని తృణమూల్‌కు సవాల్ విసిరింది. అప్పుడు పార్టీకి లభించిన ఓట్లశాతం 38.14%.
ఇక తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే 2021 ఎన్నికల్లో 48.02% ఓట్లతో 215 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.73 శాతానికి పడి పోవడంతో పదిలోక్‌సభ సీట్లను కోల్పోయి 12 సీట్లకు పరిమితం కాగా, టీఎంసీ 29 స్థానాల్లో (45.76% ఓట్లు) గెలిచింది.
పై గణాంకాలను పరిశీలిస్తే మరో ఆరు లేక ఏడుశాతం ఓట్లు సంపాదిస్తే బీజేపీకి అధికారాన్ని చేజిక్కించకునే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలోనే ‘సనాతని’ వాదంతో అన్ని పార్టీలకు చెందిన హిందూ ఓటు బ్యాంకులపై బీజేపీ దృష్టిపెట్టింది. వచ్చే శ్రీరామనవమికి కోటిమందితో ర్యాలీ నిర్వహించాలని తలపెట్టడం ఈ వ్యూహంలో భాగమే. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది హిందువులతో 20వేల ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతంలో శ్రీరామనవమి ర్యాలీలపై పుబ్రా మిడ్నాపూర్ జిల్లాలోని ఈగ్రాలో మరియు ఇదే జిల్లాలోని శ్యాంపూర్‌లో దుర్గామాత విగ్రహాల విధ్వంసాలు జరిగిన అంశాలపై ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 8న ఈగ్రాలో, ఏప్రిల్ 7న శ్యాంపూర్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.
`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు
`అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు
`ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు
`ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది
`అధికారులలో అహం పెరుగుతుంది
`అధికారులలో మోనోపలి వస్తుంది
`మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చరు
`జర్నలిస్టులకు నచ్చనంత మాత్రాన మంత్రులను మార్చరు
`నాయకుల మధ్య విభేదాల కోసం తొందరపడొద్దు
`మంత్రులు తమ శాఖల మీద పట్టుకు కొంత సమయం పడుతుంది
`15 నెలల సమయం చాలా చిన్నది
`గతంలో శాఖల మార్పులు జరగిన సందర్భాలున్నాయి
`తక్కువ సమయంలో మార్చిన దాఖలాలు లేవు
`ఇప్పుడిప్పుడే పాలన పరుగందుకుంటోంది
`శాఖలు మార్చితే మంత్రులు మళ్ళీ పూర్తిగా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది
`ఆ శాఖల మీద పట్టుకు కుస్తీలు పట్టాల్సి వస్తుంది
`ఇంతలో పుణ్య కాలం గడిచిపోతుంది
`పొరపాటున కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
`ఎన్నికలకు ఏడాదిన్నర ముందే మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది
`నిజం చెప్పాలంటే పరిపాలన సరిగ్గా చేసేది ఓ రెండు సంవత్సరాలు మాత్రమే
`ఇలాంటి సందర్భంలో మంత్రుల శాఖలు మార్చితే కథ మొదటికి వస్తుంది
`ప్రజలకు మంత్రులు దూరమయ్యే పరిస్థితి ఎదురౌతుంది
`మంత్రులు ఎప్పటికప్పుడు పని తీరు చూసుకోవాలి
`నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి
`జిల్లాల ప్రగతిపై సమీక్షలు జరపాలి
`పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండాలి
`ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి
`ఇన్ని పనుల మధ్య శాఖలు మారితే అన్నింటికీ అంతరాయమే
`ప్రజా సమస్యలు గాలికి వదిలేయడమే!
హైదరాబాద్,నేటిధాత్రి:
కొత్త మంత్రులు త్వరలో కొలువు తీరనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. రేపో, మాపో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుకూడా వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా త్వరలో, త్వరలో అనే వార్తలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇటీవల కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనంటూ కొత్త వార్తలు షికార్లుకొడుతున్నాయి. వాటికితోడు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు వుండే అవకాశమందుంటూ కూడా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజమందో లేదో? తెలియిదు? కాని మీడియా అత్యుత్సాహం మాత్రం ఎక్కువగా వుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో మంత్రులను తొలగించడం సాధ్యమౌతుందా? రెండోసారి మంత్రి వర్గ విస్తరణే ఇంత కాలం పట్టింది. ఒక వేళ ఇద్దరో, ముగ్గురినో మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఏర్పడే రాజకీయ అనిశ్చితి ఎలా వుంటుందనేది ఏ మాత్రం అవగాహన లేని మీడియా సంస్ధలు తమ ఇష్టాను రీతిన వార్తలు రాసేస్తున్నాయి. వాటిని ప్రజలు కూడా నిజమే అనుకునేలా మసాలలు దట్టించి వార్తలు వండి వారుస్తున్నారు. నిజానికి అందులో ఏ మాత్రం నిజం లేదు. మంత్రులను మార్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఎవరైనా మంత్రులకు వున్న అదనపు శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం వుంటుంది. కాని ఏకంగా ఇప్పటి వరకు చూస్తున్న శాఖలను మార్చి, కొత్త శాఖలను పాత మంత్రులకు అప్పగించే పరిస్ధితులు లేవు. వుండవు. ఒక వేళ పొరపాటున మంత్రుల శాఖలు మారితే అసంతృప్తి చెలరేగే అవకాశం వుంటుంది. నాయకులను బట్టి ప్రాధాన్యత శాఖలను అప్పగించడం పరిపాటి. అవే శాఖలను అటూ, ఇటూ మంత్రులకు మార్చితే పాలనా పరంగా నష్టం ఏర్పడే పరిస్దితులు ఎదురౌతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన కేవలం 15 నెలలు మాత్రమే అవుతుంది. మధ్యలో పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో కొంత సమయం వృదా అయ్యింది. ఈ కొద్ది సమయంలోనే ఆయా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రులను మార్చడం వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత బలం చేకూర్చినట్లౌతుంది. ఉద్యోగ వర్గాల తిరుగుబాటుకు కూడా కారణమౌతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి, మంత్రులకు అధికారులు ఇచ్చే సూచనలు, అందించే నివేదికలు సరైనవేనా..కాదా? అన్నది మంత్రులు పూర్తి స్దాయిలో తేల్చుకోలేని సందర్భాలే వున్నాయి. అలాంటి సమయంలో ఏకంగా మంత్రుల శాఖలు మార్చితే, మంత్రులు మొదటి నుంచి నేర్చుకోవాల్సి వుంటుంది. అప్పుడు పాలన గాడి తప్పుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నారు. సన్నబియ్యం రేషన్ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. బిసి రుణాలు ఇచ్చేందుకు నోటిఫికెషన్ విడుదల చేశారు. రికార్డు పద్దు ప్రవేశ పెట్టారు. వీటన్నింటికీ దృష్టిలో పెట్టుకొని మంత్రులు ఒక ప్రణాళికతో ముందకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే సన్నాహలు చేసుకుంటున్నారు. తమ శాఖలపై పూర్తి స్దాయి పట్టు సాదిస్తున్నారు. ఈ తరుణంలో ఒక వేళ మంత్రుల శాఖలు మారితే మళ్లీ పాలన మొదటికొస్తుంది. పాలన గాడితప్పుతుంది. మంత్రులనే మార్చితే సామాజిక వర్గాలలో అలజడి రేగుతుంది. రాజకీయం మరో వైపు దారి తీసుకుంటుంది. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త తలనొప్పి నెత్తిన పెట్టుకున్నట్లౌవుంది. సలహాలు ఇచ్చే వారు ఇస్తారు. కాని వాటిని ఎలా స్వీకరించాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియందికాదు. కాని కొన్ని సార్లు పదే పదే కొంత మంది చెప్పే సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాని మొదటికే మోసం వస్తుంది. గతంలో ఎన్టీఆర్ ఇలాగే చేశారు. దాంతో ఆయన పదవీ గండం తెచ్చుకున్నారు. ప్రాంతీయ పార్టీలో నిజానికి అలాంటి తిరుగుబాటు జరిగే అవకాశాలు వుండవు. కాని అదికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ అలాంటి ప్రయోగం చేశారు. ఫలితం అనుభవించారు. ఆనాడు లక్ష్మిపార్వతితోపాటు, కొంత మంది మంత్రులు చెప్పిన చెప్పుడు మాటలు ఎన్టీఆర్ వినడం వల్లనే ఆయనకు ఆ పరిస్ధితి వచ్చిందన్న సంగతి తెలియంది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్.రాజశేఖరరెడ్డిలు మంత్రుల శాఖలు మార్చిన సందర్భం వుంది. కాని ఇలా అర్ధాంతరంగా మార్చలేదు. అదును చూసి, పరిస్దితులను అవగాహన కల్పించుకొని చేశారు. పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. మంత్రులుగా పనిచేసిన వారు అప్పట్లో ఎంతో కొంత అనుభవం వున్నవారు. అప్పటికే మంత్రిత్వ శాఖల్లో పట్టు వున్న వారు కావడం వల్ల శాఖలు మార్చినా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదు. కాని ఎన్టీఆర్ లాంటి నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం క్యాబినేట్ మార్చేదాక వెళ్లింది. ఆయన పదవికే గండం వచ్చింది. ఒక్కసారి మంత్రిగా ప్రమాణం చేసిన ప్రతి నాయకుడు తనకిచ్చిన శాఖను సమర్ధవంతంగా పోషించిన నేతగా గుర్తింపు తెచ్చుకోవాలనకుంటారు. మంత్రిగా మంచి పేరు సంపాదించాలని చూస్తారు. కాని కొన్ని సార్లు అవరోదాలు ఎదురుకావొచ్చు. వాటిని అధిమించాలంటే కొంత సమయం పడుతుంది. పైగా మంత్రి అంటే రాజకీయాలకు అతీతులు కాదు. రాజకీయం చేస్తూనే మంత్రిగా కర్తవ్యం నిర్వర్తించాల్సివుంటుంది. ఆ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొవాల్సివుంటుంది. మంత్రుల ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో తీసుకుంటారు. కాని ఉన్నతాధికారులు రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చెబుతుంటారు. ఇక్కడే మంత్రుల పనితీరు ఆదారపడి వుంటుంది. సహజంగా మంత్రులు ఏ పనిచేయాలనుకున్నా అధికారులు ఆర్దిక పరిస్ధితులు సహకరించకపోవచ్చు. అనే సూచనలే చేస్తారు. అది వాళ్ల తప్పు కాదు. రాష్ట్రాన్ని అప్పుల వైపు నడవాలని ఏ ఉన్నతాధికారి అనుకోరు. కాని అదే ఉన్నతాదికారులు పనులు చేయడంలో కూడా కొంత మంది తీవ్ర జాప్యం చేస్తుంటారు. కొత్తగా మంత్రులైన వారిని తప్పుదోవ కూడా పట్టిస్తుంటారు. సరైన సమాచారం సకాలం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అధికారుల మీద మంత్రులు కేకలేయడం తప్ప మరేం చేయలేరు. వారిని మార్చుకునే అవకాశం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఉన్నతాదికారుల సంఖ్య చాలా తక్కువగా వుంటంది. అటు నుంచి, ఇటు నుంచి అటు మార్చుకోవడం తప్ప వారిని పక్కన పెట్టే అవకాశం వుండదు. గత ప్రభుత్వ హాయాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న అదికారులే ఇప్పుడూ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి అదికారుల మూలంగా కొంత మంది మంత్రుల పని తీరుపై ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాదిస్తూ, సంస్కరణలు చేసేందుకు సిద్దమౌతున్నారు. ఈ సమయంలో మంత్రుల శాఖలు మార్చితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదికారలు చేతుల్లో మంత్రులు కీలుబొమ్మలౌతారు. అదికారులు ఏది చెప్పిందే నిజమని నమ్మే పరిస్ధితి వస్తుంది. అదికారుల్లో మోనోపలి మొదలౌతుంది. మంత్రి పనితీరు సరిగ్గా లేదంటూ ఆ శాఖ అధికారులే లీకులిచ్చి వార్తలు రాయించే పరిస్దితి వస్తుంది. గతంలో ఇలాంటివి అనేకం జరిగిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఒకశాఖలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే మంత్రులను పక్కన పెడతారు. కాని మీడియా వార్తలను ఆదారం చేసుకొని మంత్రుల మార్పు సరైంది కాదు. ఒక వేళ అదే జరిగితే మంత్రుల శాఖలు మారిన మరు క్షణం నుంచి మళ్లీ మంత్రుల మీద కొత్త వార్తలు మొదలౌతాయి. ప్రతిపక్షాలకు ఆయుదాలౌతాయి. కోరికోరి ప్రభుత్వమే ప్రతిపక్షాల ముందు చులకనయ్యే పరిసి ్దతి ఎదురౌతుంది. నిజం నిష్టూరంగానే వుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూడా ఒక సందర్భంలో నాకు మంత్రుల సహకారం సరిగ్గా లేదంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను దారికి తెచ్చుకోవడం కోసమని శాఖలను మార్చితే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప మరొకటి వుండదు. ఏది ఏమైనా మంత్రుల శాఖల మార్పుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సమస్యలు సృష్టించుకోవద్దు.
నాటి నుండి నేటి వరకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన (రేషన్ బియ్యం) సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
Congress
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం సన్న బియ్యం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, లక్నేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిలొని అశోక్, నర్సంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్,నర్సంపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జి రాజు, లక్నేపల్లి యూత్ అధ్యక్షుడు గొడిశాల సురేష్, మండలం యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సూదుల మహేందర్, చెన్నారావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు సిద్దేన రమేష్,తప్పేట రమేష్గ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, బైరి మురళి,మ్తెదం రాకేష్,కమతం వీరభద్రయ్య ,ఒర్రంకి వేణు ,కత్తి వేణు, కోల విజేందర్, కళ్ళం సంపత్ , గాదం రాజ్ కుమార్, నాన్న బోయిన రాజు, రాజులపాటి సూరయ్య ,కత్తి చిన్న కట్టయ్య, రాజులపాటిరాజు, మునిగాల రాజేందర్ ,సూత్రం కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తిరుమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి అధ్యక్షతన.. ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . తిరుమలాపురం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ,పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళలకు నిరుద్యోగులకు ,రైతులకు ,కూలీలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్ రేవంత్ రెడ్డి కి దక్కింది , అలాగేభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* గెలిచి 15 నెలలు గడిచిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడు.. రోజుకు 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు….. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి పేదలను అదుకునే దిశగా కృషి చేస్తున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి గ్రామ సీనియర్ నాయకులు గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, బొంపల్లి కిషన్ ,కంచర్ల కిట్టయ్య, కొర్రి రాజు ఎళగొండ శ్రీకాంత్, కలవేణి ప్రవీణ్,చెన్న నిశాంత్, నాగిరెడ్డి శంకర్, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, గద్దల తిరుపతి, నీలేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఏనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గోగ్గెలా లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు
గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…
సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.
SI Kashinath Yadav
ఈకార్యక్రమంలో డిఎస్పీ రాంమోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఎస్పీ పరితోష్ పంకజ్ కు రికార్డులను వివరించారు.ఒకే రోజు మూడు పోలీసు స్టేషన్ లను సందర్శించి ఎస్పీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జహిరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ రూరల్,కోహీర్ పోలీస్ స్టేషన్ లను సూడిగాలి పర్యాటనతో సందర్శించి, రికార్డు లనుతనిఖీ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషమైనదని ఇది పేద ప్రజలకు పెద్దవరం అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు. దొడ్డుబియ్యం తినలేని ఆబియ్యాన్ని ఎనిమిది రూపాయల కిలో చొప్పున పక్కదారి పడుతున్నాయని గమనించిన ప్రజా ప్రభుత్వం రైతుల వద్ద నుండి సన్న ధాన్యాన్ని కొని క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రజానీకానికి సన్న బియ్యం ఇవ్వడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాలను గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభాకర్ ప్రజలను కోరారు.
దుగ్గొండి మండలంలోని రేకంపెల్లి బాధిత కుటుంబానికి రూ.54 వేల 500 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిది పథకం చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు,దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు సారధ్యంలో దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు ఆధ్వర్యంలో రేకంపల్లి గ్రామానికి చెందిన మంద పాల్సన్ రూ.54500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాదారపు కన్నయ్య, పొన్నం జనార్దన్, ప్రతాప్, రవి, కోటి, ప్రశాంత్, చిరంజీవి, మలాల్ రావు,సుమంత్, రవి, రాజేందర్, బిక్షపతి, కిట్టి రవి, కుమారస్వామి, భగవాన్, రమల్లయ్య,రజినీకాంత్, విజయ్, సునీల్,బిక్షపతి,ప్రవీణ్, రగు అనిల్,మాహబ్, చిన్న జనార్ధన్, రాజేష్,కుమారస్వామి, పవన్, సాంబయ్య, రాజిరెడ్డి,అశోక్, నాగులు, రాజకుమార్,చంటి, భాస్కర్, కోర్నెల్, విజయ్,శరత్ తదితరులు పాల్గొన్నారు.
బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ డిమాండ్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బొమ్మ సురేందర్ గౌడ్ అధ్యక్షత వహించగా సమావేశానికి విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి హాజరవడం జరిగింది బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతి పైన ఏడుగురు యువకులు అత్యాచారం చేయడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఇందులో భాగంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ ది హత్యగా మేము అనుమానిస్తున్నా ము వెంటనే ఆయన యొక్క పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతంగా ప్రజల ముందు పెట్టాలి లేదంటే స్త్రీల పైన జరిగే మానభంగాలు రాష్ట్రంలో జరిగే అటువంటి హత్యలు కు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసిందిగా కోరుచున్నాము రాబోవు రోజులలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పొన్నం బిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకారం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్
జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనారోగ్యంతో హైదరాబాదులోని బ్రీనోవా ట్రాన్స్లేషన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాస్పటల్ వెళ్లి నల్లాల ఓదెలు నీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని చేకూర్చారు.
సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం
పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ 23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు
నర్సంపేట,నేటిధాత్రి:
రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నదని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని 23 వ వార్డులో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వార్డు ఇంచార్జ్ మాదాసి రవి కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, 16వ వార్డ్ ఇంచార్జ్ భాణాల శ్రీనివాస్ బైరగొని రవి, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, కోమటి సరోజన, సంగెపు తేజ, పెద్దపెల్లి కేదారి, వేముల జంపయ్య, సృజన, ప్రభుదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
21,22 వ వార్డులలో సన్నబియ్యం పంపిణీ..
Congress
ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్
నర్సంపేట పట్టణంలోని 21, 22,వ డివిజన్లో 8 నెంబర్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా భాగస్వాములై చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, బాణాల శ్రీనివాసు, దండెం రతన్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, పట్టా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి పటేల్, 22వ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి వాజిద్, స్వచ్ఛంద సంస్థల నాయకులు బెజ్జంకి ప్రభాకర్, డీలర్ శశిరేఖ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
@. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం
@ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమని పలు గ్రామాలలో ని రేషన్ షాప్ ల వద్ద రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈరోజు నెక్కొండలో మండల వ్యాప్తంగా నెక్కొండ, దిక్షకుంట, చంద్రుగొండ, అలంకానిపేట, అప్పలరావుపేట, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ కార్యక్రమంలో నెక్కొండ తాసిల్దార్ రాజకుమార్, డిప్యూటీ తాసిల్దార్ పల్ల కొండ రవి కుమార్, నెక్కొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, ఈదునూరి సాయి కృష్ణ, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగర్ ప్రశాంత్, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను, పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు, రేషన్ వినియోగదారులు, ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించడం జరిగినది.ఈ సందర్శనలో భాగంగా రాజీవ్ యువ వికాసము పథకంలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించినచో వాటిని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి చేసి ఆన్లైన్ చేయవలసినదిగా,ఇప్పటికే ఆన్లైన్ చేసినచో ఆ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు.కార్యలయమునకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు చేసి తదుపరి కార్యాచరణకు సిద్ధముగా ఉంచవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంఈఓ శ్రీపతి బాబురావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ మనువాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ బిజెపి నరేంద్ర మోడీ అడుగులకు, మడుగులకు ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని వారి ప్రయోగశాలలో ఒక వస్తువుగా వాడుకుంటున్నారు.అనే నగ్న సత్యాన్ని తెలిసి కూడా వారి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా ఆ బిల్లును ఆమోదించేలా చేయడం దళితుల ఐక్యతను దెబ్బ తీయడమే అని అన్నారు. ముఖ్యంగా మాల ఉపకులాలకు అన్యాయం చేయడమేనని,ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం బీజేపీ రాజకీయంగా కుట్ర చేసిందని రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేయడం లేదని మనువాదాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదని దళితుల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలు చేయకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో ముందుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం గా ప్రశ్నిస్తున్నాము.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బిజెపికి మరియు మాదిగ సోదరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఇది కేవలం ఓట్ల రాజకీయ కోసం మాత్రమే ఇకనైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్గీకరణ ఆమోద బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్
కరీంనగర్, నేటిధాత్రి:
లంబాడా జేఏసీ చైర్మన్ భూక్య తిరుపతి నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీరు వేలం వేస్తున్నది హెచ్సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆభూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదేందుకో ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బంజారా జేఏసీ చైర్మన్ భూక్యా తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కు విచ్చేసిన డాక్టర్ వై .ప్రవీణ్ సర్వమత సమానమైన మన భారతదేశంలో 1949 నాటి నుంచే ఆనవాయితీగా దళిత ముస్లిం క్రైస్తవ లు కలిసి భోజనం చేయడం అన్నదికాలంగా జరుగుతుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిజీవకోన మజీద్ ఏ మహమ్మదీయ లో దళిత ముస్లిం ఇఫ్తార్ విందు కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్, భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధర శేఖర్, బీసీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు బోకం రమేష్ ,ఏంజెఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ఈ మహమ్మద్ అలీ తిరుపతి ఈద్గా వైస్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హజ్రత్ మొహమ్మద్ మొహాని 1949లో మొట్టమొదట దళిత ముస్లిం ఇఫ్తార్ విందు ప్రారంభించారు ,వారినీ అనుసరిస్తూ తిరుపతిలోని జీవకోనలో మసీద్ ఏ మహమ్మదీయులో ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో దళిత ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ,దీని ముఖ్య ఉద్దేశం కులం మతం జాతి వివక్ష లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు సోదర భావంతో సమానత్వంతో మెలగాలని కులాలు కూడు పెట్టవని మతాలు మానవత్వం చూపవని కులాన్ని మతాన్ని ఏ విధంగా అయితే మనం మందిరానికి మసీదుకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేస్తామో అదేవిధంగా కులాన్ని మతాన్ని మన ఇంటి వరకు వదిలేసి సమాజంలో మనమంతా మానవత్వంతో మెలగాలని తద్వారా మన దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటాలని ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం సర్వమత సమానత్వమైన భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మెలగాలని దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమంలో మసీద్ ఏ మహమ్మదీయ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.అనంతరం తిరుపతి ముస్లిం ఈద్గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన జీవకోనకు చెందిన ఈ మహమ్మద్ అలీ ని ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ దళిత సాహిత్య అకాడమీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ధనశేఖర్ ఏ ఎం జేఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ముస్లిం సహోదరులు దుస్సాలవాతో సన్మానించడం జరిగిందని హిందుస్తానీ ఆల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ఏ,యం జే ఏసి) జాతీయ అధ్యక్షులు రఫీ ఆ ప్రకటనలో తెలిపారు .
చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.