మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా…

మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా

నడికూడ,నేటిధాత్రి:

 

స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు.తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క సతీష్ తండ్రి సల్మాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1996-1997 సెవెంత్ పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతనికి రూ.10 వేలు అందజేశారు.భవిష్యత్ లోనూ తోటి స్నేహితుల ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.సతీష్ స్నేహితులను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు కౌకొండ గ్రామస్తులు అభినందించారు.సహాయం అందజేసిన వారిలో ముక్కెర రాజు,ముక్కెర చిరంజీవి, ఎండి సాధిక్ పాషా,మేకల సతీష్,పేర్వాల బాలకృష్ణ, మేకల రాజేందర్,బొల్లె ఓంకార్,పసుల నర్సింగం, ఎండి గిడ్డు,జన్నారపు వేణు, మేకల కుమారస్వామి,మేకల ఓంకార్,జన్నారపు చంద్రమౌళి,సుమలత, శారద,జ్యోతి,తదితరులు ఉన్నారు.

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్…

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆదివారం ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ దసరా పండుగ సందర్భంగా సరుకులు కొనుగోలు చేయడానికి జహీరాబాద్కు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో కొల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న సంగమేశ్వర్ తన వద్ద ఉన్న సరుకులు చూసుకుంటే సుమారు రూ. 8 వేల రూపాయలు ఎక్కడో పోయాయని గుర్తించారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ రాజ్కుమార్ సోమవారం ఉదయం తన ఆటోను పరిశీలిస్తే రూ.8 వేల రూపాయలు లభించాయి. వెంటనే ఆయన ఆ డబ్బును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు ఆ డబ్బులు ఝరాసంగం గ్రామానికి చెందిన గుర్తించి, ఆయనకు తిరిగి అందజేశారు.
ఎస్సై క్రాంతి కుమార్, గ్రామస్తులు రాజ్కుమార్ ఘనంగా సన్మానించి అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version