జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం
◆- ఐడీఎస్ఎంటీ బాధితుల నిరసన
◆- మాజీ వైస్ చైర్మన్, మహిళకు అస్వస్థత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:ఐడీఎస్ఎంటీ కాలనీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ల బాధితులు ఇవాళ జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు ఎండీ తంజిం, నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి బైటాయించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. గేటు ముందు నుం చి పక్కకు తప్పుకుని నిరసన తెలపాలని సీఐ సూచించినప్పటికీ వారు అంగీకరించకపోవ డంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా చోటు చేసుకు న్న తోపులాటలో మాజీ వైస్ చైర్మన్ తంజిం, ఓ మహిళ సహా స్పృహ తప్పి పడిపోయింది. తమ ఇళ్లు, స్థలాల ప్రైవేటు వ్యక్తులు లాగేసుకున్న వి షయాన్ని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
