అయినవోలులో వెటర్నరీ సేవలు లేవా? వైద్యులు రారా…

అయినవోలులో వెటర్నరీ సేవలు లేవా? వైద్యులు రారా ?
– దర్శనమిస్తున్న ఖాళీ గోడలు మూసివేసిన తలుపులు,
– మౌనంగా బాధపడుతున్న పశువులు

నేటి ధాత్రి అయినవోలు:-

 

అయినవోలు మండల కేంద్రంలో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఉన్నా, అందులో వైద్యులు, వైద్య సేవలు మాత్రం కనిపించడం లేదు. గత కొంతకాలంగా ఆసుపత్రి తలుపులు మూసివేసినట్టే కనిపిస్తున్నాయి. పశువులకు అనారోగ్యం కలిగితే రైతులు ఆశగా ఆసుపత్రి వద్దకు తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ వైద్యుడు లేకపోవడం, సిబ్బంది కనిపించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద కీలక పాత్ర పోషిస్తుంది. పాలు, పశువుల పెంపకం, వ్యవసాయ పనుల్లో వాటి ఉపయోగం ఎంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెటర్నరీ సేవలు అందుబాటులో లేకపోవడం రైతులకు పెద్ద నష్టం. చిన్న వ్యాధి పెద్ద సమస్యగా మారి పశువుల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది.
ప్రభుత్వం పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటిస్తూనే, నేలస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆసుపత్రి ఉందిగానీ, వైద్యుడు లేడు. భవనం ఉందిగానీ, సేవలు లేవు. ఇది వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రతిరోజూ పశువులను తీసుకెళ్లి తిరిగి ఖాళీ చేతులతో వస్తున్న రైతుల బాధ ఎవరికి కనిపించదు? అత్యవసర సమయంలో కూడా వైద్యుడు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వెటర్నరీ డాక్టర్‌ను నియమించడం, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం అత్యవసరం. లేదంటే ఈ నిర్లక్ష్యం పశుసంపదపై, రైతుల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని, మూసివేసిన తలుపులు తిరిగి తెరుచుకునేలా చర్యలు తీసుకుంటారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్నది స్థానిక ప్రజల ప్రశ్న.

బోర్నపల్లి -కిష్టంపేట చలివాగులో అక్రమ వసూలు…

బోర్నపల్లి -కిష్టంపేట చలివాగులో అక్రమ వసూలు

అక్రమ టోల్ టాక్స్ రద్దు చేయాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

మండలంలోని బోర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్యలో ఉన్న చలివాగుపై కొంతమంది అక్రమార్కులు టోల్ టాక్స్ పేరిట అక్రమ వసూల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది చలివాగులో రోడ్ నిర్మాణం చేసి అట్టి రోడ్డు పై నుండి ప్రయాణం చేసే వాహనానికి ఒక రేటు వారే నిర్ణయించుకుని, టోల్ టాక్స్ పేరిట డబ్బులు వసూల్ చేస్తున్నారని, ఇదేంటని అడిగిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని,ఇంత దందా జరుగుతున్న సంబందిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ టోల్ టాక్స్ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

నేటిధాత్రి కథనంతో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

నేటిధాత్రి కథనానికి స్పందన..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ అనే శీర్షిక మంగళవారం నేటిధాత్రి లో కథనం ప్రచూరించబడింది. వెంటనే పంచాయతీ పాలకవర్గం స్పందించి బుధవారం డ్రైనేజీలో ఉన్న గడ్డి మొత్తం తొలగించారు. గ్రామంలో ఉన్న ప్రతి డ్రైనేజీ ని పారిశుద్ధం పనులు పకడ్ బందీగా నిర్వహిస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించిన నేటిధాత్రి కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

 శపథం నెరవేరింది.. 4 ఏళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న ఎమ్మెల్యే..

 శపథం నెరవేరింది.. 4 ఏళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న ఎమ్మెల్యే..

 

ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు.

రాజకీయ నాయకులంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోరన్న అభిప్రాయం ప్రజల్లో బాగా ఉంది. అతి కొద్ది మంది మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్లు ఎన్నికల సమయంలో తప్పితే తర్వాత కనిపించను కూడా కనిపించటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కోపర్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర..

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ బుధవారం మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏడాదికి 125 రోజులు పని దినాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, తెర వెనుక మాత్రం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు..

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు

స్పందించిన మాజీ కౌన్సిలర్ బండారు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డు శ్రీ రామ టాకీస్ హై స్కూల్ రోడ్ లో కాలువలో మురికి మట్టి పేరుకపోవడంతో వార్డు ప్రజలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టికి తీసుకపోవడంతో స్పందించిన ఆయన మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి సిబ్బంది బాలరాజు దగ్గరుండి కార్మికులచే మట్టిని జె సి బి తో తీసివేయించారు .ఈ మేరకు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి 15వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు

కోహీర్ 19 లక్షలు కలెక్టర్ వ్యయంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి.

కోహీర్ 19 లక్షలు కలెక్టర్ వ్యయంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండల ప్రధాన రహదారి చాలా రోజులుగా శిథిలావస్థలో ఉంది మరియు చాలా మంది అధికారులు మరియు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ తాత్కాలిక ఉపశమనం తప్ప మరేమీ లభించలేదు. కాలక్రమేణా ఈ రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు మరియు సంఘటనలను చూసిన ఫిర్దోస్ సర్వర్ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ పి. పర్వీనియా ప్రత్యేక ప్రాతినిధ్యం వహించి, జాతీయ రహదారి నుండి కోహీర్ కు వచ్చే రహదారి యొక్క శిథిలావస్థ మరియు రహదారిపై జరుగుతున్న అన్ని సమస్యలు మరియు ప్రమాదాల గురించి ఆయనకు తెలియజేశారు. ఈ సమస్యలను గమనించిన కలెక్టర్, జాతీయ రహదారి నుండి మనీయర్ పల్లి వరకు ఉన్న రహదారి మరమ్మతు కోసం తన మరియు కలెక్టర్ ప్రత్యేక నిధి నుండి రూ. 19 లక్షలు మరియు కోహీర్ నుండి నాగ్ రెడ్డి పల్లి వరకు ఉన్న రహదారి మరమ్మతు కోసం రూ.1.5 లక్షలు విడుదల చేశారు, తద్వారా రోడ్డుపై ప్రమాదాలను నివారించవచ్చు. ఈ పనిని చూసిన ప్రయాణీకులు జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రతినిధులు ఓట్లు అడిగేందుకు ప్రజల ఇంటి వద్దకు వచ్చినట్లే, ప్రజలు వారిని ఎన్నుకున్నప్పుడు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి…

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి

బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version