తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత నారా లోకేష్…

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత నారా లోకేష్…

*యువ కిశోరం నారా లోకేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు…

“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హర్షధ్వానాలు…

*రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మన యువ కిశోరం…

*నారా లోకేష్ కి శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి…

*చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్…

చిత్తూరు(నేటిధాత్రి:

తెలుగుదేశం పార్టీ నవశకానికి వారధిగా, కోట్లాది మంది కార్యకర్తల ఆశల ఆశాకిరణంగా ఎదిగిన యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయం. వారికి హృదయ పూర్వక ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వారికి శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త జిజెఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్మెన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. తన అసాధారణ పనితీరుతో, చెక్కుచెదరని సంకల్పంతో అటు పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని, ఇటు యువతరాన్ని ఏకతాటిపైకి తెచ్చిన లోకేష్ నియామకం.టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అంకితభావంతో కూడిన బాధ్యత అని నిరూపించిన ఆయన, రాబోయే రోజుల్లో పార్టీని మరిన్ని విజయ తీరాలకు చేర్చడం ఖాయం.చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా
పార్టీ బాధ్యతలను, మంత్రిత్వ శాఖను సమాంతరంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ యువ కిశోరం అందరికీ స్పూర్తిగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని కార్యకర్తలకు భద్రత బరోసా కల్పించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. యువ కిశోరం నారా లోకేష్ కు పార్టీ పై ఉన్న నమ్మకం, కార్యకర్తలపై ఆయన చూపుతున్న ఆదరాభిమానాలకు గుర్తింపు గా ప్రపంచంలో ఏ పార్టీ కి లేని సభ్యత్వం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందంటే అది యువ కిశోరం నారా లోకేష్ వినయ విధేయతలకు నిస్వార్త సేవలకు నిలువెత్తు నిదర్శనం అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు.

కార్యకర్తలకు నారా లోకేష్ పెద్దపీట

తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ యువనేత మంత్రి నారా లోకేష్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. కడప మహానాడు వేదికగా కార్యకార్తె అధినేత అనే నినాదంతో పార్టీనీ పరుగులు పెట్టిస్తున్న యువ కిశోరం నారా లోకేష్. పని చెప్పేవారి కంటే పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని నారా లోకేష్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే తన సరికొత్త ఆలోచనలను అమలు చేస్తూ క్షేత్ర స్థాయిలో కష్టపడిన సాధారణ కార్యకర్తలకు వేదికపై సముచిత స్థానం కల్పించి అందరిని ఆశ్చర్యపరిచారు. సీనియర్ల అనుభవం, జూనియర్ల దూకుడును సమన్వయం చేస్తూ , రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్టీకి విధేయులుగా ఉన్న యువతను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో పార్టీకి సరికొత్త నాయకత్వాన్ని అందించేలా యువ కిశోరం నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని వారికి వారే సాటి వారికి లేరు ఎవరూ పోటీ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు.

రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనివాసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనివాసులు నియామకం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. ఒక బి సి. పల్లా శ్రీనివాసులు కు రెండవసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా గుర్తించడం అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి, బి సి ల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. పల్లా శ్రీనివాసులు కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతను ప్రోశ్చహిస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్ తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దగల గొప్ప సేవకుడు అని వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు
టీడీపీలో కార్యకర్తే అధినేత. సామాన్య కార్యకర్తకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని మరోసారి రుజువైంది. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంపిక కావడం మీ శ్రమ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపట్ల ఉన్న అనురాగానికి గుర్తింపు. మీ నాయకత్వం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలపడుతుందని, ప్రజాసేవలో స్ఫూర్తిని కల్గిస్తుందని ఆశిస్తున్నాను. మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున చిత్తూరు నియోజక వర్గం ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త జిజెఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్మెన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు..

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన కందుకూరి నరేష్..

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన కందుకూరి నరేష్

పరకాల,నేటిధాత్రి

పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్,ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తల సేవలను మంత్రి ప్రశంసించారు.పరకాల ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.రాబోయే అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీకి సిద్ధమవుతోందని,గ్రామస్థాయి నుండి కమిటీల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.పరకాలలో టిడిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నరేష్ తెలిపారు.

*పులిగోరు ఆధ్వర్యంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

*పులిగోరు ఆధ్వర్యంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

తిరుపతి(నేటిధాత్రి:

తిరుపతిలో క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బుధవారం గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం వద్దకు విచ్చేస్తున్న నారా లోకేష్ కు పులిగోరు మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో మహిళలు మంగళహారతులు ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు.టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డిని నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడున్న నాయకులను పార్టీ కార్యకర్తలను పలకరించారు.ఈ కార్యక్రమంలో ఆటోనగర్ చల్లా శంకర్ రెడ్డి,టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ రామదాసు ముని రామయ్య, గంగమ్మ గుడి మాజీ పాలకమండలి సభ్యులు గెంజి సుధాకర్ రెడ్డి,శరత్ చౌదరి దుశ్యంతు, శంకర్ రెడ్డి, నారాయణ దేవరాజులు, విజయశంకర్, భారతి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పులిగోరు ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ.
నారా లోకేష్ తిరుపతి పర్యటన నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు..

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్…

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మ‌హిళా పారిశ్రామిక‌వేత్తను త‌యారు చేసే ప్రణాళికలు అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్…

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్

గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.

అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో, ఐటీ మంత్రి నారా లోకేశ్‌, పలువురు మంత్రులు.. ఆయన్ను ఘనంగా స్వాగతించారు. తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఇతర మంత్రులు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందం సందర్శించింది.
ఏపీకి బిల్ గేట్స్ రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్ గేట్స్‌ను స్వాగిస్తూ సీఎం ట్వీట్ చేశారు. ‘వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే #APWelcomesYou హ్యాష్‌ట్యాగ్‌తో ట్యాగ్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీకి బిల్‌ గేట్స్ రావడం ఇది మూడోసారి. మరోవైపు, సచివాలయానికి చేరుకున్న బిల్స్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి…

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్స్ అని టిడిపి వేములవాడ కమిటీ సభ్యులు, టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటి,విద్య శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని,తెలుగుజాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బడుగులు, బలహీనులు, పేదలు, మహిళలు, యువకులు, రైతులు వారి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకుంటూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడువేల ముఫ్ఫైరెండు కిలోమీటర్లు తోంభైఏడు నియోజకవర్గాలు రెండువేల తోంభైనాలుగు గ్రామాలు ఒకటిన్నర కోట్ల మంది గుండె తలుపులను తడుతూ ఆనాడు మంత్రి నారా లోకేష్ యువగళం సాగిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి యువగళం గేమ్ చెంజర్ గా పని చేసిందన్నారు.

నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం శిబిరం

ఏపీఐటి మంత్రి నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో శంకర్ రక్త దానం

వనపర్తి నేటిధాత్రి .

ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వనపర్తి తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ పాల్గొన్నారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు నందమూరి సుహాసిని బక్కనినరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ బండారుయాదగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారని శంకర్ ఒక ప్రకటన లో తెలిపారు

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

*సంక్రాంతి వేడుకల్లో నారావారికుటుంబీలతో కలిసిన
జిల్లా తెలుగు దేశంపార్టీ అధ్యక్షులు
షణ్ముగరెడ్డి..

నారావారిపల్లి(నేటిధాత్రి :

 

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి కలిసి వారి స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. సీఎం చంద్రబాబు తో పాటు, ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి యువనేత లోకేష్ నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణ మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైనవారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులను అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ,ఏం.ఎల్.సి శ్రీకాంత్, యువ నాయకులు వినీల్ ,పార్టీ ప్రధాన కార్యదర్శి సునీలకుమార్ చౌదరి జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు…

మదనపల్లి జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ల హర్షం..

మదనపల్లి జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ల హర్షం

 

ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు మదనపల్లి కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు.

 మదనపల్లె జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ పచ్చిపాల తులసి, మరో ఇద్దరు టీడీపీ మద్దతుదారులైన కౌన్సిలర్లు మార్పూరి నాగార్జునవాబు, ఎస్. కరీముల్లాలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు జిల్లా సాధనకు పోరాటాలు చేసిన ఉద్యమ వీరులకు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రకటనతో కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆ ముగ్గురు కౌన్సిలర్లు ప్రకటించారు. అయితే మున్సిపల్ చైర్‌పర్సన్ వి. మనూజ సహా వైసీపీ కౌన్సిలర్లు ఎవరూ వీరి ప్రకటనకు మద్దతు పలకపోగా, సమావేశం ప్రారంభమై చైర్‌పర్సన్ ప్రసంగం చేయకనే జిల్లా అంశం ఎందుకని లేవనెత్తారని ప్రశ్నించారు.అంతలో మరో కౌన్సిలర్ బి.ఏ. ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ.. ఇక్కడి కౌన్సిల్లో టీడీపీ కౌన్సిలర్ ఉన్నది ఒకరేనని, మిగిలిన ఇద్దరు వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతుగా నిలవడాన్ని తప్పుపట్టారు. ముగ్గురు చెప్పే అంశాలను తాము ఎలా ఒప్పుకుంటామని మెజారిటీ తామే ఉన్నామనే ధోరణి ప్రదర్శించడంతో కౌన్సిల్లో కొంతసేపు గందర గోళం నెలకొంది. దీంతో ఆ ముగ్గురు కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వచ్చేయగా, వైసీపీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు అజెండాలోని రెండు అంశాలను వాయిదా వేయాలని కోరారు. అప్పటికే అన్ని అంశాలు ఆమోదించేశామని, సమావేశం ముగిసిందని వైసీపీ కౌన్సిలర్లంతా బయటకు వచ్చేశారు. ఆ అంశాలను అవసరాన్ని బట్టి తానే ర్యాటిఫై చేశారని చైర్ పర్సన్ చెప్పడంతో కౌన్సిలర్ ప్రసాద్ బాబు కూడా అంగీకరించినట్లయింది.రెండు సమావేశాలు చేపట్టి, వాటిపై చర్చ జరగకుండానే కేవలం అయిదు నిమిషాల్లో ఆమోదం, అంతా అయిపోయిందని, ఎలా ప్రకటిస్తారని స్వపక్షంలోనే వివక్ష కౌన్సిలర్ కరీముల్లా వాపోయారు. ఇలా ఇంకా ఎన్నాళ్లు? ఇలా చేస్తారు.? ఇదేనా? ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. మెజార్టీ మీదే ఉందని, ఇంతకాలం ఇలానే చేశారు? అభివృద్దే లేకుండా చేశారని, ఇక వార్డుల్లోకి పోతే జనాలే చెబుతారంటూ నిట్టూరుస్తూ బయటకు వచ్చేశారు. అనంతరం చర్చ లేకుండా ఆమోదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని, ఆ అంశాలను రీషెడ్యూల్ చేయాలని, లేకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని కరీముల్లా, మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు సూచించారు. ఇదిలా ఉండగా, స్వపక్షంలోనే విపక్షంగా ఏడాది కాలంగా అభ్యంతరాలు, ఆటంకాలతో కొన్ని వాయిదా పడుతూ, మరి కొన్ని రద్దయిన వాటితో కలిపి సాధారణ, ఆత్యవసర అజెండాల్లోని 55 అంశాలూ ఆమోదం అనే పదంతో పూర్తయ్యాయి. దీంతో ఆటు మున్సిపల్ అధికారులు, ఆటు కాంట్రాక్టర్లు ఊపీరి పీల్చుకున్నట్లయింది.

గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు…

*గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు.

*మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్16

 

గూగుల్ రాకతో ఎఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతొందని దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు చేకూరనున్నాయని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని వివరిస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిశాఖపట్నంలో ఒక గిగావాట్ (
జి డెబ్యూ) హైపర్స్కల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు,
కూటమి ప్రభుత్వం చొరవతో, వైజాగ్లో ఏర్పడుతున్న ఏఐ సిటీకి దాదాపు 10 బిలియన్ లు పెట్టుబడి పెట్టనుందన్నారు,
ఆసియాలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా విశాఖపట్నంలో ఈ సెంటర్ నిలవనుందన్నారు,
రాష్ట్రం ఒక స్వర్గధామంగా మారుతోంది. వైజాగ్ లో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని డిజిటల్ పవర్ హౌస్ మార్చే దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం,ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టించనుందని వివరించారు,
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు,
మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందనిసీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖకు వచ్చేసిందన్నారు,
దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం కానుందన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version