ఉక్కుపిడికిలి…పోరు వాకిలి బిఆర్‌ఎస్‌’’.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల యుద్ధం కేసిఆర్‌.

`తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసిఆర్‌.

`తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసిఆర్‌.

`ఉద్యమానికి కేసిఆర్‌ ఊపిరిపోసి ఇరవైఐదు వసంతాలు!

`కేసిఆర్‌ జై తెలంగాణ గొంతెత్తి జైకొట్టి ఇరవైఐదేళ్లు.

`పిల్లా, జెల్లాకు ఉగ్గు పాలతో నూరిపోసిన నినాదం జై తెలంగాణకు పచ్చీస్‌ సాల్‌.

`ఉడుకు నెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్‌ఎస్‌.

`బక్క పలుచని కేసిఆర్‌ సింహ గర్జనకు పాతికేళ్లు.

`చెక్కు చెదరని తెలంగాణ ఆత్మ గౌరవ విశ్వాసానికి సిల్వర్‌ జూబ్లీ.

`తెలంగాణకు గులాబీ తిలకం దిద్ది ట్వెంటీ ఫైవ్‌ ఇయర్స్‌.

`రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు.

 `సరిగ్గా ఇరవై ఐదేళ్ల నాడు ఎటు చూసినా కరువే.

`ఎవరిని కదిలించినా దుఖమే.

`ఆగమైన బతుకునుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ.

`తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వల్లకాడులై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట జై తెలంగాణ.

`పటపట మంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ.

`ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసిఆర్‌.

`‘‘పుబ్బ’’ లో పుట్టి ‘‘మగ’’ లో మాడిపోతుందన్న వారిని ఎదిరించి నిలిచిన పార్టీ టిఆర్‌ఎస్‌.

`తెలంగాణ సాధించే వరకు పద్నాలుగేళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్‌ఎస్‌.

`పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`మోడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`అన్నమో రామచంద్రా అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ రైతును రాజును చేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ తెచ్చింది ‘‘టిఆర్‌ఎస్‌’’… బంగారు తెలంగాణ చేసింది ‘‘బిఆర్‌ఎస్‌’’.

తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బిఆర్‌ఎస్‌ పార్టీ ఎవరూ ఊహించనటు వంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు, సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్‌ఎస్‌పార్టీ నిర్వహించినన్ని సభలో ఏ పార్టీ నిర్వహించి వుండకపోవచ్చు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్తానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బి ఆర్‌ఎస్‌కే దక్కుతుంది. సభలల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనటు భారీ భహిరంగ సభల నిర్వహణలో బిఆర్‌ఎస్‌దే పై చేయి. అలాంటి భారీ రాజకీయ, ఉద్యమ సభలు దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సభలు నిర్వహించి, వాటినే గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహంచిన భారీ భహిరంగ సభలతో పరేడ్‌ గ్రౌండ్‌ సభలకు కాలం చెల్లినట్లైంది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా, బిఆర్‌ఎస్‌ సభలతో పోల్చుకుంటూ, మీడియా అనేక చర్చా వేధికలు ఇప్పటీకీ ఏర్పాటు చేస్తుంటాయి. సభల్లో బిఆర్‌ఎస్‌ను బీట్‌ చేయడం ఎవరి వల్ల కాదని ఆఖరుకు తీర్పునిస్తుంటాయి. అంతగొప్పగా సభలు నిర్వహించడంలో బిఆర్‌ఎస్‌ నాయకుల వ్యూహం ముందు ఏ పార్టీ సభలైనా బలారూరే అని చెప్పాలి. ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్‌ సభ అంటే పుట్టలు పగలి చీమలు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఎండా, వాన, చలిలను లెక్క చేయకుండా ఉద్యమ సభలను ప్రజలు విజయవంతం చేస్తుండేవారు. కరీంనగర్‌లో నిర్వహించిన సింహ గర్జనతో మొందలైన పెద్ద పెద్ద పెద్ద సభలు అప్పట్లో జిల్లాకొకటి జరగుతూ వుండేది. అప్పట్లో వరంగల్‌లో జరిగిన బిఆర్‌ఎస్‌ గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నదంటే ఆశామాషీ కాదు. వరంగల్‌ సభకు పదిహేను లక్షలమంది హజరైనట్లు లెక్కలున్నాయి. ఆ తర్వాత కూడా అనేక సభలు నిర్వహించి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గాని, అదికారంలో వున్న పదేళ్లలో గాని మళ్లీ అంత పెద్ద సభలు బిఆర్‌ఎస్‌ల నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్దఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసిఆర్‌ చేసిన బస్సుయాత్రకు కూడా ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఆ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించేందుకు వరంగల్‌లో మరో భారీ భహిరంగ సభ నిర్వహించేందు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో బిఆర్‌ఎస్‌సభలకు, ఈ నెల 27న వరంగల్‌లో జరిగే సభకు కొంత వ్యత్యాసముంది. గతంలో ఉద్యమ కోణంతోపాటు,రాజకీయ ఎన్నికల సభలు జరుగుతూ వుండేవి. కాని ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో ఈ సభ కూడా చరిత్రలో నిలిచేలా ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో బిఆర్‌ఎస్‌కున్న రికార్డును బ్రేక్‌ చేయాలని చూస్తున్నారు. వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో సుమారు 1200 ఎకరాలలో బిఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీసభ నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మందిని సమీకరించే పనిలో బిఆర్‌ఎస్‌ శ్రేణులున్నాయి. తెలంగాణలో అధికారంకోల్పోయినా సరే, బిఆర్‌ఎస్‌పై ప్రజలకు ఏ మాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలంటే ఉద్యమ సమయంలో జరిగిన సభలను మించి నిర్వహించాలని చూస్తున్నారు. అందుకోసం బిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటికప్పుడు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లును ఎప్పటికికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు వేగం పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సభతో బిఆర్‌ఎస్‌ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా వుండనున్నది. బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో ఎదురులేదని, తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాడిన్న కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా వుంటున్న కేసిఆర్‌ మొదటి సారి తన గళాన్ని వినిపించే వేదిక కావడంతో తెలంగాణ అంతా ఆ సభలో వుండేలా చూసుకుంటున్నారు. అందుకే 1200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారు.

బిఆర్‌ఎస్‌ అంటే రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. కేసిఆర్‌ ఆలోచనతో మొగ్గ తొడిగిన పార్టీ. ప్రజల ఆవేదనల నుంచి పురుడు పోసుకున్న పార్టీ. ప్రజల ఆక్రందనల నుంచి మొలకెత్తిన పార్టీ. తెలంగాణ గోసలు తీర్చేందుకు ఏర్పాటైన పార్టీ. తెలంగాణ సాధన కోసం జ్వనించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా జ్వలించిన పార్టీ. ఉద్యమమై ఉరకలెత్తిన పార్టీ. పోరు దారిలో తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన పార్టీ. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ. తెలంగాణ అనే నినాదాన్ని ఆకాశాన్ని తాకేలా గర్జించిన పార్టీ. తెలంగాణ అనాలంటే ముందు,వెనుక ఒకటికిపదిసార్లు ఆలోచించేవారు కూడా పిడికిలి బిగించి జై తెలంగాణ అని ఎలిగెత్తేలా చేసిన పార్టీ. గొంతు సవరించుకొని అప్పటి పాలకుల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించిన పార్టీ. సమైక్య పాలకులు గుండెలు అదిరేలా జై తెలంగాణ జపం చేసిన పార్టీ. తెలంగాణను అడ్డుకున్న వారి వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూట ముల్లె సర్ధుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇక ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదులచేత కూడా జై తెలంగాణ అని పించిన పార్టీ. తెలంగాణ నుంచి ఆకలి కేకలతో, బతుకెళ్లదీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్లీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి, అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగుల్లో , వంకల్లో, ఒర్రెల్లో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి, తుమ్మలు మొలిచి ఆనవాలు లేకుండాపోయిన చెరువులను బాగు చేసి, ఊరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆదరవని నిరూపించిన పార్టీ. పదేళ్ల పాటు చెరులన్నీ గంగాళలంలా కళకళలాడేలా చేసిన పార్టీ. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేసిన పార్టీ. పాడి పండలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసిఆర్‌ సృష్టి. తెలంగాణ సాధనలో కేసిఆర్‌ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి, తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తీ కేసిఆర్‌. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘణకీర్తి కేసిఆర్‌. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కిరీటం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరి రాసులను పండిరచేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరధుడు కేసిఆర్‌. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాకపోతే కలలో కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయేవాళ్లం. అందుకే కేసిఆర్‌ అనే మూడక్షరాల పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్న జీవితాలు అర్ధం…పరమార్ధం. పదేళ్లతో తెలంగాణ తల రాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసిఆర్‌ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణను అన్ని రంగాలలో పదేళ్లల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్దిక వేత్త కేసిఆర్‌. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసిఆర్‌. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసిఆర్‌.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి

“తుడుందెబ్బ” పిలుపు.

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్..

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ను సన్మానం చేసిన మిత్రులు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు న్యాయవాది కిరణ్ బాల్య మిత్రులు వై వెంకటేష్ మెడి కల్ ఏజెన్సీ నిర్వహికులు కె బి శ్రీనివాసులు శెట్టి పంపు కటకం చందు గట్టు రవి సాగర్ కొండూరు ప్రవీణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వై వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆకాంక్షించాలని  కోరారు

మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన మాజీ ZPTC.

మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన మాజీ జడ్పిటిసి…

తంగళ్ళపల్లి నేటిధాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందంకి 50 కిలోల బియ్యం అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య సందర్భంగా మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని నా వంతు సహాయంగా అందజేశానని తెలియజేశారు అలాగే బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కనక లక్ష్మి లక్ష్మారెడ్డికి 2500 శ్రీనివాస్ రెడ్డికి 2500 చొప్పున నిరుపేద కుటుంబాలకు సహాయం అందజేశామని అంత్యక్రియలు చేసుకొని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం కింద 20 వేల రూపాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నె బాలయ్య మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ శ్రీనివాస్ గౌడ్ గుడిసెల తిరుపతి దేవయ్య రామ్ రెడ్డి చంద్రమౌళి సురేష్ మల్లయ్య బాబు కనకయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది

కుల మత విద్వేషాలు రెచ్చగోడుతుంది

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన
జై బాపు జై భీమ్ జై సంవిదన్
అను కార్యక్రమం న్ని కొత్తగూడ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు..మండల కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య విచ్చేసి ముందుగా మండల కేంద్రం లోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహని కి పూలమాల వేసారు అనంతరం జెండా ఎగరేశారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న కార్యక్రమం లో భాగంగా ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధన్
కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు నేడు కొత్తగూడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారత రాజ్యాంగం నీకి అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తుందని రాజ్యాంగం ని నిర్లక్ష్యం చేస్తూ కులాల చిచ్చు మతాలరొచ్చు దేశం లో అలజడులు సృష్టి స్తుంది రాజ్యాంగం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని.. జై బాపు జై భీమ్ జై సంవిధన్ అని అన్నారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ఫా రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, యూత్ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మల్లెపూ రంజిత్, యూత్ మండల ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, వివిధ గ్రామా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకమని క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గల మధసూదన్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేద వారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి రాజేష్, మహిళా నాయకురాలు పుష్ప,నాయకులు పాల్గొన్నారు.

సామాన్యుడు సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు.

‘సామాన్యుడు.. సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు’

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని పద్మావతి కాలనీ లోని గ్రీన్ ఫీల్డ్ లో గల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తి తో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భావితరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం

మరిపెడ  నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన.!

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర….

పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు .

వర్దన్నపేట( నేటిదాత్రి ):

 

 

రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు శ్రీ.రాహూల్ గాంధీ , జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పాదయాత్ర లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తో మరియు ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ * రాయల నాగేశ్వర రావు* మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ * గారు స్టేట్ కో- ఆర్డినేటర్ *శ్రీ పులి అనిల్ * పాల్గొన్నారు.తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 2 కిలోమీటర్ల ప్రజలకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.*ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ.భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు.

రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు

గ్రామ అభివృద్ధికి పెద్దపీట

గ్రామ అభివృద్ధి కమిటీ- గట్లకానిపర్తి

 

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు చేస్తున్న గ్రామ అభివృద్ధికి పెద్దపీట.

ముళ్ల పొదలు/చెట్ల పొదలు తొలగింపు

శాయంపేట మండలం గట్ల కానిపర్తి నుండి నర్సిరావు పల్లె వెళ్లే రోడ్డు పైకి ఇరువైపులా ఉన్న ముళ్లపదలను/చెట్ల కొమ్మలను స్వచ్ఛందంగా తొలగించడం ద్వారా వాహనదారులకు డ్రైవర్ ముఖ్యంగా పల్లె వెలుగు బస్సు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అక్టోబర్ 2 2014 ప్రజలందరూ శ్రమదానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రమదానం గ్రామ ప్రజలు చేయడం అభినందన నియ మని కమిటీ పేర్కొన్నారు.

Development

ప్రధాన కూడలిలో డ్రైనేజీలు మరమ్మత్తులు

గట్లకానిపర్తి గ్రామంలో కీర్తిశేషులు నల్లెల్ల మహేందర్ ఇంటి దగ్గర లోని మూల మలుపు వద్ద డ్రైనేజీ ఒక చివర శిథిలమై ఉన్నదానిని వెళుతుంటే ప్రజలకు ఆసౌకర్యంగా ఉన్నదని గుర్తించి ప్రజాక్షేమం దుష్ట ముఖ్యంగా టు వీలర్, వాహనదారులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరగకుండా పారిశుద్ధ కార్యక్రమం ఇట్టి పనిని 13 జనవరి 2025 రోజున ఇట్టి పనిని సందర్భంగా పూర్తి చేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు వచ్చిన దాతలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.

Development

 

వైకుంఠధామానికి విద్యుత్ సౌకర్యం తీసుకురావడం

గట్లకానిపర్తి గ్రామంలో ఉన్న వైకుంఠధామానికి దగ్గర స్నానం చేయడానికి వీలుగా గ్రామ ప్రజలు కొరకు విద్యు త్తును వాడుకునే సౌకర్యం కల్పించడం కోసం దాదాపు ఖర్చు అవుతుందని అంచనా వేసి దాతలు వస్తువులు రూపకంలో మాత్రమే సహకారం అందించాలని కోరారు.తప్పెట్ల పున్నం రాజ్ మాతృభూమి పై ఉన్న మమకారం కోసం తన తండ్రి గారైన తప్పెట్ల భద్రయ్య మీద ఉన్న ప్రేమతో వారి జ్ఞాపకార్థం మన గ్రామ ప్రజల సౌకర్యార్థం సామాజిక సేవ గ్రామ ప్రజల సౌకర్యం ముఖ్యంగా మన ఇంట ఆడబిడ్డల మహిళల ఆత్మగౌధం నిలబడ్డ దానికి సామాజిక సేవా కార్యక్రమంలో దాతగా ముందుకు రావడం జరిగింది దాతలు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.

గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు

గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయడం గ్రంథాల యం కొరకు వస్తువులు పుస్తకాలు డబ్బాలు ఇవ్వడా నికి ముందుకు వచ్చిన దాతలు అభినందనీయం కనుక గ్రామంలో 2 అక్టోబర్ 2024 నుండి 21 ఫిబ్రవరి 2025 వరకు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు న్యూటoకి ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్, భాస్కర్ సహకారం, బొమ్మ కంటి కుమారస్వామి గ్రంథాలయం కొరకు సీలింగ్ ఫ్యాన్స్, బొమ్మ కంటి రాజు రెండు సీలింగ్ ఫ్యాన్స్, పెద్దపల్లి సురేందర్ మహనీయుని కోడలపై అతికించడం, కక్కర్ల భారత్ గౌడ్ సైన్ బోర్డులు ఇస్తానని హామీ, క్రాంతి కుమార్ రంగులు సున్నాలు అయ్యే ఖర్చుకు హామీ,గ్రంథాలయానికి డబ్బులు మరియు దాతలు బొమ్మ కంటి బుచ్చయ్య పెయింటింగ్ ఎలక్ట్రిషన్ వగైరా అయ్యే ఖర్చు చేయడం, బాధ్యత రాజ్యాంగం పుస్తకం బహుకరించిన బొమ్మకంటి శ్యాంసుందర్, గడ్డం వెంకటేశ్వర్లు, కేశవమూర్తి (వరంగల్ వాయిస్ ఎడిటర్) 5000 రూపాయల ఆర్థిక సాయం మరియు 5 వేల రూపాయల విలువగల పుస్తకములు అందజేస్తానని తెలియజేయడం జరిగింది.. ఎండవల్లి స్నేహిత రెడ్డి సాఫ్ట్వేర్ ఆమె అందిస్తానని తెలిపారు బొమ్మ కంటి వెంకటేష్ పుస్తకాల నిమిత్తం 8 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. గ్రంధాలయ నిర్వాహన కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి గ్రామ అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా రేకులు ఐరన్ పైపులు సిమెంటు సిమెంటు ఇటుకలు కంకర డస్ట్ తలుపులు కిటికీలు ఎలక్ట్రిక్ సహాయం వంటివి అవసరం గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగస్తులు విద్యావంతులు వృత్తిని పనులు యువకులు వ్యాపారస్తులు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్లు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జండా ఏర్పాటుకు సహకరించాలని గట్ల కనపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రజలను వేడుకున్నారు.

విజన్ డాక్యుమెంట్ గట్ల కనపర్తి

సమాజ సేవ చేయాలనే దృడ సంకల్పం, పట్టుదల నిజాయితీ ఆత్మవిశ్వాసం చర్యలకు పారదర్శకత సమిష్టి తత్వం తగ్గింపు తత్వం నిరాడంబరం మానవీయత వంటి ప్రధాన అంశాలలో లక్ష్యం వైపు సాగడం

చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా గ్రంథాలయం ఏర్పాటు

సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక దగ్గర స్నానం కోసం షవర్లు ఏర్పాటు చేయడం

గ్రామానికి కైలాసరథం వచ్చేందుకు కృషి

గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం

గంగదేవిపల్లి మొలకనూర్ లాంటి ప్రేరణతో అభివృద్ధి పనులను, మహిళలు అభివృద్ధి పనులకు ఆలోచించి స్వయం ఉపాధి పథకాల వైపు ప్రోత్సహించడం

యువత చదువుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడం కోసం

గ్రామ విడతల వారీగా హెల్త్ క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం

గ్రామానికి పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తీసుకొచ్చిన వారిని గౌరవించడం, సన్మానించడం

ప్రజల్లో మానవత్వ విలువలు పెంపొందించే విధంగా కృషి చేయడం

*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది

ఉపాధ్యాయులను సన్మానించడం

Development

 

దేశ భవిష్యత్తు తరగతిగది గో డల మధ్య నిర్మితమై ఉన్నది బావి భారత పౌరులను తయా రు చేయడంలో అనేకులను ప్రయోజకులను తయారు చేయడంలో గురువులది కీలక పాత్ర. వారి కృషి మరువలేనిది గురువులను గౌరవించి సన్మానం చేయటం ఆలోచన రావడం కారణం విద్యనే జ్ఞానానికి మూల స్తంభాలైన గురువులను రాబోయే రోజులలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడo జరుగు తుంది ఉపాధ్యాయ వృత్తి అనేది ఉన్నతమైనది దేశానికి మంచి పౌరులను అందించేదే కేవలం ఉపాధ్యాయులే. మన గ్రామంలో బోధించిన ఉపాధ్యా యుని, ఉపాధ్యాయులను గౌరవించడం కోసం గురువుల కు సన్మానం అనే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడం జరిగింది. గ్రామంలో పాఠశాలలు స్థాపించినప్పటి నుండి 60 సంవత్సరాల కాలం నేటి వర కు ప్రాథమిక పాఠశాలలో ఉన్న త పాఠశాలలో బోధించే పదవి విరమణ పొందిన ఉపాధ్యా యిని, ఉపాధ్యాయులను గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలు సమక్షంలో మెమొరంటోను, బహుకరించి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానిం చడానికి నిర్ణయిం చడం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం 60 సంవత్సరాల కాలం నుండి 200 మందికి పైగా గురువులు గట్ల కనపర్తి గ్రామంలో విధులు నిర్వర్తించి ఉంటారు మరికొందరు బోధించే వృత్తిలో కొనసాగు తున్నారు. రాబోయే రోజుల్లో మన గ్రామంలో ఏర్పాటు చేయబడి గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి గురువులను అందరిని ఒకే వేదిక మీద ఘనంగా సన్మానిద్దాం,

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

తంగళ్ళపల్లి  నేటిదాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో భాగంగా బద్దెనపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి చౌరస్తా నుండి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని.

ఏఐసీసీ టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించన అప్పటినుండి దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎస్టి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని .

దేశం గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని దేశం గురించి ప్రాణాలు అర్పించారని అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని అస్య హాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని.

రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పుడున్న.

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని.

 

ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల ను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మహిళ నాయకులు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి

వన్య ప్రాణులకు విద్యార్థులకు రక్షణ కరువు

బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్న వెంటనే హెచ్సీయూ భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేస్తున్నాం 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ కూతాటి రమేష్ బిఆర్ ఎస్ యూత్ జిల్లా నాయ కులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి బిఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికిల్ల వెంకట్ తట్ల సాయి ధైనంపల్లి రాజేష్ శశి మెండు నితిన్ తదితరులు పాల్గొన్నారు

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల..

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఆదివారం సీతారా ముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కల్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి అడ్వకేట్ లెక్కల జలం ధర్ రెడ్డి బుధవారంఆవిష్కరిం చినారు.ఆదివారం ఉదయం 10:30 గంటలకు తలంబ్రాల ను తీసుకురావడం 11 గంటలకు కంది శ్రీనివాస్ రెడ్డి చే ధార్మిక ఉపన్యాసం మధ్యాహ్నం 12.05 నిమిషా లకు సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణ అనంతరం లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగల రని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నీల సమ్మిరెడ్డి నీల రంగారెడ్డి గిద్దమారి సురేష్ కోమటి గణేష్ గొట్టిముక్కుల సుమన్ బత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న.

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ జహీరాబాద్ పట్టణంలో బుధవారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,జై బాపు జై భీం జై సంవిధాన్ జహీరాబాద్ ఇంచార్జ్ ధనలక్ష్మి. ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా మరియు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండలాల నాయకులు మరియు మాజీ యం.పి.పిలు,మహిళా కాంగ్రెస్ నాయకులు,మాజీ జెడ్పీటీసీ లు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం.!

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం ! !

• హజ్రత్ ముల్తానీ బాబా దర్గా

• పాలరాతిలో ధగధగ మెరుస్తున్న

ముల్తానీ బాబా దర్గా పరిసరాలు

కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను

దర్శించుకొని ప్రత్యేక ప్రార్ధనలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మెటలకుంట చౌరస్తా సమీపంలోని జహీరాబాద్- బీదర్ ప్రధాన రోడ్డుపై అద్భు తంగా నిర్మించిన ముల్తానీ బాబా దర్గ

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో అద్భుతంగా కట్టిన తాజ మహాల్ మాదిరిగానే సంగా రెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మెటలకుంట గ్రామ చౌరస్తా సమీపంలోని ముల్తానీబాబా దర్గాను అదే తరహాలో తీర్చిదిద్దారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీ రాబాద్-బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో నిర్మించిన హజ్రత్ ముల్తానీబాబా దర్గాను చూపరులకు ఎంతగానో ఆకట్టుకుం టుంది. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహన చోదకులు తాజ్మహాల్ మాదిరిగా ఉన్న ముల్లానీ బాబా దర్గా వద్ద కాసేపు ఆగి దూడాల్సిందే. అద్బు తంగా నిర్మించిన దర్గా పరిసరాలో ప్రజలు, వాహనచోదకులు తిరుగుతూ సెల్ఫీలతో కాలక్షేపం చేస్తుంటారు. దశాబ్దానికి పైగానే తాజమహల్ తరహాలో ముల్తానీ బాబా దర్గాను రెండు న్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దర్గా పరిసరాలను గోడలను కట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప జిల్లాల నుంచి సున్నపు రాయిని తెప్పించి బట్టి ల్లో కాల్చి ప్రత్యేక
రాయితో నూర్పిడి చేసి వినియోగించారు. దర్గాతో పరిసరాల్లో గోడల నిర్మాణంలో ఎక్కడ సిమెంట్, ఇసుక వారకపోవడం గమన్నారం, జైపూర్ నుంచి ప్రత్యేక పాలరాతిని తెప్పించి దర్గాను దగదగ మెరిసేలా అద్భుతంగా తీర్చిద్దారు. జహీరాబా ద్-బీదర్ ప్రధాన రోడ్డు రహదారిపై ఉన్న ముఖ ద్వారంతో పాటు దర్గా చుట్టూ గుమ్మటం వంటి ఆకారంలో నిర్మించిన గదులు దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వినియోగిస్తుంటారు. ప్రతి నెల ఇక్కడ జరిగే వేడుకలకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు వచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్శించుకుంటారు. దర్గాకు నాలుగువైపులా నాలుగు ద్వారాలతో నిర్మించిన అపురూప కట్టడం పక్కనే 150 అడుగుల ఎత్తులో నిర్మించిన ఏక్ మినార్ భారీ స్తూపం చూప రులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏరిఏమైనప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోని తాజీమహాత్ను చూసేందుకు వెళ్ల కపోయిన ముల్లా నీ బాబా దర్గాను చూసిన వారంత తాజ్మ హాల్ను దూశామనే ఫిలింగ్తో ప్రజలు, వాహనచోదకులు సెల్సీలను దిగుతూ వెళ్లిపోతున్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బజార్ సిద్ధ గౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్,బాల గౌడ్,బజార్ కొండగౌడ్, రంజిత్ గౌడ్,వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్,చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పేకాట రాయుళ్ల అరెస్ట్..

పేకాట రాయుళ్ల అరెస్ట్.

42,780 రూపాయలతో పాటు నాలుగు సెల్లు ఫోన్లు స్వాధీనం

నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అలంకానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు పేకాటరాయిడ్లను అరెస్టు చేసినట్టు నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలంలోని అలంకాని పేట గ్రామంలో ఆర్చి పక్కన నిత్యం పేకాట నిర్వహిస్తున్నట్టుగా పక్క సమాచారంతో నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట ఆడుతున్న స్థలానికి చేరుకొని అక్కడ పేకాట ఆడుతున్న మంగిశెట్టి శ్రీను, మాస్ కుమార స్వామి, ఎడ్ల లక్ష్మీనారాయణ, గాజుల జనార్ధన్ నలుగురి వ్యక్తులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 42,780 రూపాయలతో పాటు 52 పేక ముక్కలు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version