ప్రాణదాత సలాం నీకు…..!
శ్రీకాంత్ అవయవదానం మహోన్నతమైనది. కుమారుడి అవయవాలు దానం చేసిన. భార్య సారిక. తల్లిదండ్రులు. నాగమణి శివరాజ్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాయికోడ్ మండలం, కుసునూర్ గ్రామ వాస్తవ్యులు మద్నూర్ రాచప్ప గారి మనుమడు తనయుడు శివరాజ్ నాగమణి గార్ల దంపతుల పెద్ద కొడుకు కీ.శే.శ్రీ. శ్రీకాంత్ హైద్రాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగం చేసేవాడు. దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల గ్రామ జన్మస్థలంకు వచ్చారు. దసరా పండుగ ముంగించుకొని, అతడు ఈనేల 5న 38A హైద్రాబాద్ వెళ్ళుతుండగా శివంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తు తాను నడుపుతున్న ద్విచక్ర వాహనానికి వెనకాల నుంచి వస్తున్న
ద్విచక్ర వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టడంతో, ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయలు కావడంతో, హుటాహుటిన హైద్రాబాద్ ప్రైవేట్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో, జాయిన్ చేశారు.
తొమ్మిది రోజులు ఐసీయులో అబ్జర్వేషన్ ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. తొమ్మిది రోజులు కూడా డాక్టర్లు ఎంతో శ్రమించి ట్రీట్మెంట్ చేసిన శరీరంలో ఎలాంటి చలనం మార్పు రాకపోవడంతో, సోమవారం కిమ్స్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు అందించిన ప్రయోజనం ఉండదని వైద్యులు. భార్య సారికకు మరియు
తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి గార్లకు తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు, శ్రీకాంత్ అవయవాలు అన్ని పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు మరియు భార్య అంగీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతో మందికి పునర్జన్మనిస్తోంది. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం గ్రీన్ చానెల్ మార్గంలో తరలించి ఆరుగురుకి అమర్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇలా అరుగురు జీవితాల్లో వెలుగు నింపిన. భార్య సారిక, తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి ఆదర్శంగా నిలిచారు. మా కుమారుడి ప్రాణాన్ని కోల్పోయిన ఆరుగురికి ఊపిరి పోశాడని, భార్య సారిక, మరియు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు తమకు దూరమవడంతో, వారు గుండెలవిసేలా రోదించారు. కుసునూర్ గ్రామం, చేవెళ్ల గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీకాంత్ మరణ వార్తతో గ్రామంలో. విషాద ఛాయలు అలుముకున్నాయి.
