రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T144229.093.wav?_=1

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ దన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని,ధైర్యంగా నిలబడి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆసరా చేయుత పింఛన్లు పెంపుదల అమలుకై వినతి పత్రం అందజేత…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T142753.254.wav?_=2

 

ఆసరా చేయుత పింఛన్లు పెంపుదల అమలుకై వినతి పత్రం అందజేత

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిదాత్రి:

 

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎమ్మార్పీఎస్, వి హెచ్ ఎస్, సి పి హెచ్ పి ఎస్, ఎం ఎస్పి, ఆధ్వర్యంలో పింఛన్లు పెరుగుదల కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వాప్తంగా ‘ఆసరా చేయూత పెన్షన్లు’ పెంచి అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపినట్లుగా వృద్ధాప్య, వితంతువు పెన్షన్లతో పాటు రూ॥ 2000/- ఉన్న ఆసరా పెన్షన్ రూ॥ 4000/- మరియు రూ॥ 4000/- ఉన్న పెన్షన్ రూ॥ 6000/- డయాలసిస్, కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రూ॥ 15000/- పెంచి ఇవ్వాలని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ మంజూరు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుపుతున్నాను. ఈ విషయమై పెన్షన్దారుల పక్షాన ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్, సీపీ హెచ్ పి ఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
కావున తమరు పై విషయాలను పెద్దమనసుతో పరిశీలించి సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆసరా చేయూత పెన్షన్ పెంచి, తక్షణమే అమలు చేసి, లబ్దిదారులకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శనిగరపు కుమార్ ఇన్చార్జ్ అంబాల పోశాలు కో ఇన్చార్జ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

*అటవీ శాఖ అధికారులను కృతజ్ఞతలు తెలిపిన…

*అటవీ శాఖ అధికారులను కృతజ్ఞతలు తెలిపిన.
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు*

◆:- మహమ్మద్ ఇమ్రాన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

గత వారం రోజుల నుండి జహీరాబాద్ నగరంలో కొన్ని కొండముచ్చులు ప్రజలను కరోడం జరిగింది భయాందోళనకు గురి అయిన గాంధీనగర్ ఏరియా ప్రజలు మరియు రాంనగర్ ఏరియా శాంతినగర్ ఏరియా బాగా రెడ్డిపల్లి ఫరీద్నగర్ కాలనీ హమాలీ కాలనీ శివాలయం ఆదర్శ విద్యాలయం ఈ ఏరియాలో ఈ కొండముచ్చులు కరవడం జరిగింది దాదాపు ఒక పదిమందికి కరిచిన సంగతి అందరికి తెలిసింది ఇది తెలుసుకున్న వెంటనే జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ఫారెస్ట్ అధికారులను సంప్రదించడం జరిగింది ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్

 

 

రావు సార్ వారి తోటి బృందంతో కొండముచ్చుల దాడికి గురైన వారికి ఎక్స్రేషియా ఇవ్వడం జరుగుతుందని వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం జరిగింది మరియు కొండముచ్చులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ను జహీరాబాద్ కు తినిపించి పట్టుకోవడం జరుగుతుంది ఫారెస్ట్ అధికారులకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషిచేసిన అటవీ శాఖ అధికారులకు దీనికి సహకరించిన మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్ల దశరథ్ మొహమ్మద్ ఫసియోద్దీన్ స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు,

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ
-కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..

– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డా బెల్లయ్య నాయక్ అన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17, 1948న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య, వరంగల్ కు చెందిన షేక్ బందగి భాను నాయక్ లకు నివాళులర్పించారు.
తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన నాటి సాయుధ పోరాటంలో ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయక ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని, ఈ శుభదినాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి… ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, గడిచిన పదేళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తమ భాదలు తీరతాయని ఆశించారో అవి నెరవేరలేదన్నారు. ప్రభుత్వ ఆశ, ఆలోచన, ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని, అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని, అమరుల ఆశయాలు ఉండాలని, యువత ఆకాంక్షలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
ఏఎస్పి నరేష్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ,విమోచన దినోత్సవాన్ని సైతం స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా
6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.మంత్రి మంగళవారం మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారని, అమృత్ స్కీం కింద ఆర్కేపి,గద్దెరాగడి ఏరియాలలో 2 వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. రెండు ఏరియాలకు శ్మశాన వాటికలు సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్ లాడెన్,బొద్దుల ప్రేమ్ సాగర్,మేకల శ్రీను, గోపు రాజం,ఎల్పుల సత్యం,భైర మల్లేష్,ఎల్పుల మల్లేష్,బత్తుల శ్రీనివాస్,రామస్వామి, రామ కృష్ణ, బోనగిరి రవీందర్,పందిరి లింగయ్య,సరేష్,లచ్చులు,హరిప్రసాద్, శారద తదితరులు పాల్గొన్నారు.

కక్కించే వరకు పోరాటం ఆగదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-17T165353.065.wav?_=3

 

కక్కించే వరకు పోరాటం ఆగదు”

మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు “పెద్ది సుదర్శన్ రెడ్డి”

 ధాన్యం టెండర్ల కుంభకోణంపై బీఆర్ఎస్ విజయం!

కాంగ్రెస్ తొలి స్కాం బహిర్గతం చేసిన మాజీ ఎమ్మెల్యే “పెద్ది సుదర్శన్ రెడ్డి”

రూ.1100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్.

హైకోర్టులో PIL, కేంద్ర సంస్థలకు 755 పేజీల ఫిర్యాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో GO MS No.15 విడుదల.

కేవలం ₹65.9 కోట్లు జప్తు – పాక్షిక చర్యపై బీఆర్ఎస్ ఆగ్రహం.

“నేటిధాత్రి”,హైదరాబాద్, సెప్టెంబర్ 17:

 

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అవినీతి స్కాం పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితాలిస్తోందని, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ముసుగులో బినామీల చేతి ద్వారా కొనుగోలు చేసి రూ.1100 కోట్ల కుంభకోణం చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది.

“పెద్ది” 20 నెలల పోరాట ఫలితం.
మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా నిరంతర పోరాటం చేస్తూ, ఈ స్కాంపై హైకోర్టులో PIL (34/2024) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ 20 నెలల క్రితమే నోటీసులు ఇచ్చింది.
కానీ ప్రభుత్వం 18 సార్లు వాయిదాలు కోరడం వల్ల కేసులో ఆలస్యం జరిగినట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇది తాము సేకరించిన ఆధారాలు గంభీరంగా ఉన్నాయని, కేసును ఎదుర్కొనలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర సంస్థలకు 755 పేజీల రిపోర్టుతో “పెద్ది” ఫిర్యాదు.
బీఆర్ఎస్ అధ్వర్యంలో ED, CBI, సెంట్రల్ విజిలెన్స్, ACB, రాష్ట్ర విజిలెన్స్ లకు మొత్తం 755 పేజీల ఆధారాలతో కూడిన ఫిర్యాదు సమర్పించిందని చెప్పారు. ఈ స్కాంలో పాల్లెవేళుగు మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు, అధికారుల మధ్య తీవ్ర అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

430 కోట్ల స్కామ్ – కేవలం ₹65.9 కోట్లు జప్తు
ఈ స్కాంలో టెండర్ విలువ కంటే అదనంగా మిల్లర్ల నుంచి టెండర్ ఏజెన్సీలు వసూలు చేసిన మొత్తం రూ.430 కోట్లు. కానీ ప్రభుత్వం జారీ చేసిన GO MS No.15 ప్రకారం కేవలం ₹65.90 కోట్లే జప్తు చేశారు. టెండర్ ఏజెన్సీలైన కేంద్రియ బండార్, LACOF సంస్థల నుంచే జప్తు చేయడం జరిగిందని, హిందూస్తాన్ లిమిటెడ్, మంచుకొండ ఏజెన్సీలపై మాత్రం ఏ చర్యలు లేకపోవడం వెనుక ప్రైవేట్ ప్రమేయమే ఉందని ఆరోపించారు.

పాక్షిక చర్యలు – పక్కదారి చర్యలు!
సామాన్యంగా ఏ టెండర్ ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా EMD మొత్తాన్ని పూర్తిగా జప్తు చేయడం ఆనవాయితీగా ఉంటే, ఈ కేసులో మాత్రం పాక్షికంగా జప్తు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా వసూలు చేసిన డబ్బుపై కృతజ్ఞత చూపించినట్లే అవుతుందన్నారు.

కక్కించేవరకు పోరాటం ఆగదు ప్రభుత్వానికి “పెద్ది” హెచ్చరిక
కాంగ్రెస్ పెద్దలు తిన్న ప్రతి రూపాయిని ప్రజల ముందు కక్కించేవరకు పోరాటం ఆగదు. ఇందులో పాలుపంచుకున్న అధికారులపై కూడా చర్యలు తప్పవు. సివిల్ సప్లై వ్యవస్థను ప్రైవేట్ ఎజెన్సీల చేతుల్లోకి అప్పగించిన దారుణాన్ని బహిర్గతం చేస్తామని పెద్ది సుదర్శన్ అన్నారు.

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)

 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం రోజున మహాదేవపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలలో భాగంగా ఎంపీడీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ప్రసాద్, ఏపీవో, సూపర్ ఇండెంట్, శ్రీధర్ బాబు కార్యాలయ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=4

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.

ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.

పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:

జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.

ప్రైవేట్ కళాశాలల్లో పెండింగ్ స్కాలర్‌షిప్ ఫీజులు చెల్లించాలి…

ప్రవేటు కళాశాల లోపెండింగులో ఉన్న ఫీజు రియoబర్స్ స్కాలర్ షీప్ లు చెల్లించాలి సుమన్
వనపర్తి నేటిదాత్రి .

 

 

రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో
పెండింగ్ లో ఉన్న ఫీజు రియ oబర్స్ స్కాలర్ షిప్ లు మంజూరు చేయాల ని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు గంధం సుమన్ మాదిగ అన్నారు ప్రైవేట్ కాలేజీ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వెనుకబడ్డ పేద విద్యార్థులు అన్ని కోర్సులు చదువుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో విద్యాసంస్థల యజమాన్యంతో చర్చలు జరపి విద్యార్థులకు భవిష్యత్తు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T140233.017.wav?_=5

 

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

విశ్రాంతి ఉద్యోగుల సంగం సమావేశం పద్మశాలి భవన్ నందు తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉధ్యోగుల సంఘం జహీరాబాద్ మండల శాఖ ఎన్నికలు ఎకగ్రీవంగా జరిగినవి.అధ్యక్షులుగడ్డం జనార్దన్, ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు, కోశాధికారి శ్రీ బెండి చంద్రశేఖర్, అసోసియేట్ ప్రసిడెంట్ శ్రీ కౌలస్ ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎం. డి. ఆజీం, విజయ లక్ష్మీ, జాయింట్ సేక్రటరి నర్సిములు, అర్గనైజింగ్ సేక్రటరి కౌలస్ రాజేశేఖర్, పబ్లిసిటీ సేక్రటరి మహబూబ్ గౌరి, కార్య వర్గ సభ్యులుగా జి. చంద్రశేఖర్, యాకుబ్ అలి, సైఫోద్దిన్ గౌరీ, ఎ. బాగారెడ్డి, జి. రాందాస్, వి. నర్సిములు జిల్లా కౌన్సిల్ రమేష్ బాబు, పి. దుర్గయ్య, మల్లేష్ం ఎంపిక కాబడినారు. ఎన్నికల అధికారిగా విజయ రావు అబ్జర్వర్ జగదీశ్వర్ రావడం జరిగింది.

 

 

ముఖ్య అతిధిగా రాష్ట్ర జనరల్ సేక్రటరి సి. చంద్రశేఖర్ మాట్లాడుతు త్వరలో మనకు రావల్సిన డి. ఎ, పిఅర్సి, హేల్త్ కార్దులు ఇప్పించడానికి ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమలో విశ్రాంత ఉధ్యోగులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ…

కలసి ఉంటే కలదు సుఖం రాజి మార్గమే రాజా మార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో నుండి బయటపడాలని జడ్జి తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ క్షమా గుణాన్ని కలిగివుండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరభావంతో మెలగాలని వారు తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ లేబర్ కమీషనర్ వినోద గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు బెంచి మెంబర్లు ఎం.డి. లతీఫ్ అబ్దుల్ కలాం మంగళపల్లి రాజ్ కుమార్ రావుల రమేష్ కనపర్తి కవిత మొయినుద్దీన్ సంధ్య నాగవత్ తిరుమల పోలీసు అధికారులు పి.కుమార్ ఏ.నరేష్ కుమార్ కర్ణాకర్ రావు వెంకటేశ్వర్లు బ్యాంకు ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’

మళ్లన్న నారి శక్తి లోగో ఆవిష్కరణ…

హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ డిమాండ్లు….

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్…

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు..,
కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు…!వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి, తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ ను చేర్చాడు‌. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు.
సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన, కష్టం .. తనను కదిలించిందని, తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ..పని చేసానని కానిస్టేబుల్ అలీమ్ తెలిపారు‌.
ఈ..రోజు ఉదయం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి, అతనిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు..
జిల్లా పోలీస్ బాస్ గా అనేక రకాల పనుల వత్తిడిలో ఉన్నప్పటికీ…, తన సిబ్బంది పనితీరును గుర్తించడం, వారిని ప్రశంసించి, ప్రోత్సహించడమే కాక, స్వయంగా తానే కానిస్టేబుల్ ను సత్కరించి అభినందించడం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పెద్దమనుసు కు ఒక ఉదాహరణ అని అక్కడ ఉన్న రైతులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రశంసించారు‌. ఉన్నతాధికారులు తీసకునే ఇలాంటి నిర్ణయాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనను కలిగిస్తాయని పలువురు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు కృతజ్ఞతలు తెలిపారు‌..
ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

భూసేకరణ వ్యతిరేక ఆందోళన…..

జహీరాబాద్ లో ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి..

సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్.

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చాలీచాలని వేతనాలతో నలిగిపోతున్న మెసెంజర్లు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T125150.136.wav?_=6

 

చాలీచాలని వేతనాలతో నలిగిపోతున్న మెసెంజర్లు

జీవోల ప్రకారం వేతనం పెరగకపోవడంతో నష్టపోతున్నాం

తెలంగాణ రాష్ట్ర ఎం ఆర్ సి మెసెంజర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి… భాను బిక్షపతి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi

 

 

జీవో నెంబర్. 60 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ క్రింద వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెంచిన వేతనాలను విద్యాశాఖ మండల విద్యా వనరుల కేంద్రం ఎం ఆర్ సి / ఎంఈఓ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 467 మంది గత 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మెస్సెంజర్ కమ్ అటెండర్ లకు కూడా వర్తింప చేయాలని,

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి) ( ఎంఈఓ కార్యాలయాల్లో మెసెంజర్స్ పని చేస్తున్నామని. వారికి ప్రభుత్వం వేతనాలు ఈ (కింది విధంగా చెల్లిస్తూ వస్తుందని. కాలక్రమంలో వారి వేతనాల పెంపు ప్రభుత్వం నిర్ణయించినట్లు జరగకుండా విధ్యాశాఖాదికారులు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని. కావున ఒకసారి ఈ (కింది విషయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ ఎం ఎస్ నెంబర్ 3 12/01/2011 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఆఫీస్ సబార్టినేట్ / మెసెంజర్ లకు వేతనం రూ.6700/- గా రావాలి కానీ ప్రభుత్వం కేవలం 2500/- మాత్రమే నామమాత్రంగానే ఇచ్చి.
దీని తర్వాత సర్వ శిక్షా అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఆర్ సి నెంబర్1259/2011 (పకారం వేతనాలు రూ. 4500 గా మాత్రమే పెంచారని.
మరుసటి సంవత్సరం ఆర్ సి నెంబర్. 6244/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 9/2012, 22/09/2012 లో రూ 4500 నుండి రూ 6000 గా మాత్రమే పెంచారని, ఇక్కడా మెసెంజర్ లకు వేతనాల పెంపు సరిగా జరగలేదని, అనేక విజ్ఞాపనల అనంతరం ఆర్ సి 660/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 2/2013,: 05/02/2014 లో రూ 6000 నుండి 7500 గా మాత్రమే పెంచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ జీవో ఎంఎస్ నెంబర్.14, ది: 19/02/2016 ఆఫీస్ సబార్టినేట్లకు వేతనం రూ. 12000/- గా ప్రభుత్వం
నిర్ణయించింది మునుపటి వరకు అన్ని దశల్లో వేతనాల పెంపు ఒకే విధంగా జరిగినా, జీవో ఎంఎస్ నెంబర్. 14 లో మాత్రం మెసెంజర్లకు వేతనాలు రూ. 12000/- ఉండాల్సింది పోయి కేవలం 7500/- నుండి 8000/- మాత్రమే పెంచి తీవ్ర అన్యాయానికి గురి అయ్యామని. ఇక్కడ వేతనాల పెంపు అందరికి ఒకేలా జరగలేదని. దీన్ని మెసెంజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎందరో అధికారులకు మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోలేదని. దాదాపు నెలకు రూ. 4000/- జీతాన్ని మెసెంజర్లు నష్ట పోయారు. తర్వాత జి ఓ. ఆర్ టి, నెంబర్ 144,.31/08/2017లో 8000/- నుండి రూ. 8500/- మాత్రమే పెంచారు.
మరలా కొత్త వేతనాల సవరణ ఉత్తర్వుల ప్రకారం జీవో ఎంఎస్ 60 తేదీ: 11/02/2021 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ జీవో. విడుదల చేసింది ఇక్కడా ఆఫీస్ సబార్టినేట్ల వేతనాలు 30% పెంచుతూ రూ. 15600/- గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం మెసెంజర్ల వేతనాలు రూ.8500/- ల నుండి రూ. 11050/- గా మాత్రమే పెంచుతూ తీవ్ర అన్యాయానికి గురి చేశారని. ఈ జి ఓ. లో పేర్కొన్న విధంగా అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు సక్రమంగా పెంచారు. కానీ మెసెంజర్లకు మాత్రం వేతనాలు సరిగా పెంచలేదని. దాదాపు నెలకు 4000/-రూ. వేతనం నష్ట పోతున్నారని. ఇట్టి నష్టాన్ని నివారించాలని కోరుతూ ఎందరి చుట్టూ తిరిగిన ఫలితం కనబడటం లేదని. భవిష్యత్ లో కూడా వేతనాల పెంపులో అన్యాయం జరిగేలా ఉందని. కావున ఇట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు.
గత నాలుగు సంవత్సరాల నుండి పెరిగిన వేతనం అమలు కాక నష్ట నష్టపోయాం, పెరిగిన నితావసరాల ధరలకు అనుగుణంగా మాకు జీవో ఎంఎస్.60, తేదీ. 11/06/2021 నుండి పెరిగిన వేతనం అమలు చేయాలని. మండల విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మలు అయిన మండల విద్యా వనరుల కేంద్రం ఎం.ఆర్.సి లో పనిచేస్తున్న మెసెంజర్లు స్వీపర్లుగా,అటెండర్లుగా అవసరమైతే నైట్ వాచ్మెన్లుగా కూడా బాధ్యతలు నిర్వహించవలసి వస్తున్నదని. చాలీచాలని వేతనంతో బతుకీడుస్తున్న మాకు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ. 15,600/- లుగా పెంచినట్లయితే మా జీవితాలు బాగుపడతాయని. 15 సంవత్సరాలుగా జీవోల ప్రకారం గౌరవ వేతనం పెరగకపోవడం వలన నష్టపోతున్నామని ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇట్టి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నామని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version