అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో రథసారథిగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకు ఎన్నెలేని కృషి చేసి సాధించిన విప్లవకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. గద్దర్ చిత్రపటానికి ముందుగా పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మల్లయ్య మాట్లాడుతూ తన ఆటపాటతో ఉర్రుతలూగించి ఒక విప్లవ జ్యోతిగా నిలిచిన గద్దరని తెలిపారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు ఈయన 1949లో మెదక్ జిల్లాలో జన్మించాడని 2023లో అనారోగ్యంతో మరణించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ వరకు చదివి మధ్యలో బ్యాంకు ఉద్యోగం చేశాడని చెప్పారు . రిక్షా దొక్కేరహీం అన్న రాళ్లు కొట్టే రామన్న అనే పాటతో గాయకుడిగా మారాడని తెలిపారు ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించాడని, 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగిందని అన్నారు. పాటను ఆయుధంగా మలిచిన ప్రజా గాయకుడు అని తెలిపారు. ఆయన మరణంతో తెలంగాణ గొంతుక మూగబోయిందని అన్నారు ఆయన అణగారిన వర్గాల ప్రజలను దళితులను మహిళలను చైతన్య వంతులను చేయచూ ఆటపాటలతో ఉర్రుతలు ఊగించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా జయశంకర్ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ దాసారపు సాంబయ్య చందర్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ స్వాతంత్ర సైనానిగా బద్దం ఎల్లారెడ్డికి నివాళి..

సంకెళ్ళతో ఊరేగించినా,జైల్లో నిర్భందించినా వెనకడు వేయని ధీరుడు,తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సేనాని, ఎంపిగా, ఎమ్మెల్యేగా,రాజ్యసభ సభ్యుడిగా పేదలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నేత బద్దం ఎల్లారెడ్డి-సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్న బద్దం ఎల్లారెడ్డిని సంకెళ్లతో ఊరేగించినా, జైల్లో నిర్బంధించిన మొక్కవోని ధైర్యంతో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా, బుగ్గారం ఇందుర్తి శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా పేద బడుగు బలహీన వర్గాలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నాయకుడు బద్దం ఎల్లారెడ్డి అని సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. బద్దం ఎల్లారెడ్డి నలభై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లతో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబు ను, రజాకార్లను,దేశ్ ముఖ్ లను ఎదిరించడానికి, వెట్టి చాకిరి,బానిసత్వం,దోపిడీకి వ్యతిరేకంగా దున్నే వానికి భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప యోధుడు పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి అని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేస్తున్న సత్యాగ్రహానికి ఆకర్షితుడై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్లాడని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడని, సంకెళ్ళతో బంధించి ఊరేగించారని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, మగ్ధుo మోహియుద్దిన్ లాంటి వారితో కలిసి ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్టు పార్టీ లో కీలకం నేతగా పనిచేశారని, నిజాం నవాబుల అరాచకాలను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, అనాటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై వేలాదిమంది రజాకారులకు,దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలంటే వారికి అండగా ఎల్లారెడ్డి లాంటి నాయకులు ఉండడమేనన్నారు. ఆమహత్తర పోరాటం మూలంగా మూడువేల గ్రామాలు విముక్తి అయ్యాయని, నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారని, పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచడానికి బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన నిలిచాడని, భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి, బుగ్గారం శాసనసభ్యులుగా పని చేశారని, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసి ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి అని,అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను నేటి తరం పునికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నివాళులర్పించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, మచ్చ రమేష్, కొట్టే అంజలి, బోనగిరి మహేందర్, నగర నాయకులు గామినేని సత్యం, కసిబోజుల సంతోష్ చారి,మాడిశెట్టి అరవింద్,బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ
-కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..

– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version