కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ
-కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..

– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version