ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ బై రి రమేష్ ప్రచారం..

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమై గెలుపే లక్ష్యంగాఓట్లు అభ్యర్థిస్తున్నబైరీరమేష్…..

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచి గా పోటీ చేయుచున్న బైరిరమేష్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలందరికీ ఓటుఅభ్యర్థిస్తూ గత ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలో ముందు ఉంచానని గ్రామంలోఅలాగే ఈసారి మీ అమూల్య ప్రజల నీటి కోసం ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయంలో నీటి ట్యాంకర్ తో నీళ్లను సప్లై చేయడం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా అధికారులతో మాట్లాడి 60 లక్షల రూపాయల సుమారు 19.కిలోమీటర్లమైన మేర పైపులైను వేసి ప్రతి ఇంటికి నీరు అవసరం తో ప్రతి ఇంటికి నల్ల బిగించి నీరు అందించడం జరిగిందని మన గ్రామంలో నాలుగు నీటి వాటర్ ట్యాంకులు నింపి ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం జరిగిందని అవసరమైన చోట గ్రామపంచాయతీ నిధులతో1.50.000. నాలుగు చోట్ల కొత్తబోర్లు మోటార్లు వేసినీటి అవసరాల గురించి ప్రజలకు అందుబాటులకు తేవడం జరిగిందని అలాగే గ్రామంలో స్మశాన వాటిక రెండు వాటర్ ట్యాంకర్లు నర్సరీ క్రీడా ప్రాంగణము సిసి రోడ్లు వీధిలైట్లు అత్యవసర చికిత్స కష్ట కాలంలో ప్రజల అందరితో ఉండి వారికి తగినంత సహాయం చేస్తూ ఆపద సమయంలో వెన్నంటి ఉండి ఇలా అనేక సంక్షేమ పథకాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశానని అలాంటిది దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైన ఓటువేసి నన్ను గెలిపిస్తే మన జిల్లాలో ఇందిరమ్మ కాలనీ గ్రామాన్ని మరింతగాఅభివృద్ధి చేసి అగ్రమిగానిలబెడతాననీ హామీ ఇస్తున్నాను గ్రామంలో అలాగేఆడపిల్ల పెళ్లికానుకగా.5000 రూపాయలు ఇస్తానని. మన గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ₹5,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తానని. దురదృష్టశ.శవాస్తుమన గ్రామంలో పేద కుటుంబంలోఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5000.రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని. గ్రామంలో మంచినీటి సౌకర్యం కొరకు శాశ్వతంగా మంచినీటి బోర్లు వేయించి సమస్య పరిష్కరిస్తానని. గ్రామ ప్రజలకు సురక్షితమైన మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తానని. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తానని. గ్రామంలో ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం స్ట్రీట్ లైట్ల ఏర్పాటుచేసి. నిరుద్యోగ ఆడపడుచులకు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి టైలరింగ్.శిక్షణ ఇప్పిస్తానని. విద్యార్థుల కోసం గ్రంథాలయం. మహిళల కోసం మహిళా భవన్. యువతకు యూత్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తానని. ఆడపడుచుల అక్కచెల్లెళ్ల కోసం. బతుకమ్మ ఘాట్ నిర్మిస్తానని. గ్రామంలో బస్తీ దవఖాన మంజూరుకు కృషి చేస్తానని. శారీరక వ్యామముకొరకు గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తానని. రేషన్ షాప్. అంగన్వాడి పాఠశాలలు మంజూరు చేయిస్తానని. గ్రామంలో ఉన్న పాఠశాలను యూపీఎస్.గా ఏడవ తరగతి వరకు చదివే విధంగా కృషి చేస్తానని గ్రామంలో అన్ని వీధులలో .సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని. అలాగే కెసిఆర్ నగర అభివృద్ధికి కృషి చేస్తానని. కోతుల బెడద నుండి సమస్యలు తీర్చుతానని. కాలనీలో మంచినీటికి శాశ్వత పరిష్కారం చేయిస్తానని. తాగడానికి నీరు మినరల్ వాటర్.ప్లాంటుఏర్పాటు చేస్తానని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తానని. కెసిఆర్ కాలనీకి రవాణా సౌకర్యం లో ఇబ్బందులు ఉన్నాయని వాటిని త్వరలోనే సమస్య పరిష్కారమే దిశగా చేసి బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తానని. అంగన్వాడి సెంటర్. ప్రాథమిక పాఠశాల గురించి. సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తానని. కాలనీలో స్ట్రీట్ లైట్లు డ్రైనేజీలు పచ్చదనం పారిశుద్ధ్యం వివిధ అనేక సమస్యలను పరిష్కరిస్తానని నా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నానని. గత ఐదేళ్లలో మీ అందరి సహకారంతో మండలంలోని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని అలాగే అవకాశం ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీగాతీర్చిదిద్దే బాధ్యత నాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచిగా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తద్వారా. ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దలను ఒప్పించి మంత్రులను గాని రాజకీయ నాయకులను గాని ప్రభుత్వ అధికారులను గాని మన గ్రామ సమస్యలు వివరించి మెప్పించి. ఇందిరమ్మ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నానని నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని మీ అందరికీ పేరుపేరునా తెలియజేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి అభిమానులతో సర్పంచ్ గా గెలిపిస్తారని ఆశిస్తూ మీబై రీ రమేష్. ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు…

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు

• గెలుపే లక్ష్యంగా ప్రచారం
* అన్ని వర్గాల పూర్తి మద్దతు నాకే ఉంది
* విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం
* పదవి లేకున్నా గ్రామానికి అనేక సేవలు

చేవెళ్ల, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామాల్లో చూసిన ఎన్నికల హడావిడి వాతావరణమే దర్శనమిస్తుంది. షాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా గడపగడపకు ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోతుగల్ పంచాయతీలో పంచాయతీ అనుబంధ గ్రామం చిన్న, పెద్ద తండాలు కలుపుకొని సుమారు 12వందల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పామేనా నర్సిములు ముందంజలో కనిపిస్తున్నారు. బొట్టుపెట్టి ఓటు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచిగా అవకాశం ఇచ్చి అభివృద్ధికి ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచిగా గెలిచినా వెంటనే గ్రామంలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు చేపడతానని తెలిపారు.బీటీ రోడ్లు వేయిస్తానని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థిలో నీటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అదిగమించడానికి పోతుగల్ గ్రామంలోని ప్రతి వార్డు లో బోరు వేసి, మిని ట్యాంక్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హామీ ఇచ్చారు.గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్థానని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఫిల్టర్ వాటర్ సెంటర్ ను ఏర్పాటు చేసి గ్రామప్రజలకు ఉచితంగా ఫిల్టర్ నీళ్లను అందిస్తానని తెలిపారు. గ్రామంలో మృతిచెందిన కుటుంబానికి 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా, గ్రామ అభివృద్ధికి అన్నివిదాల కృషి చేస్తానని తెలిపారు. గ్రామప్రజలకు ఓటర్లకు కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ,విమోచన దినోత్సవాన్ని సైతం స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా
6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.మంత్రి మంగళవారం మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారని, అమృత్ స్కీం కింద ఆర్కేపి,గద్దెరాగడి ఏరియాలలో 2 వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. రెండు ఏరియాలకు శ్మశాన వాటికలు సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్ లాడెన్,బొద్దుల ప్రేమ్ సాగర్,మేకల శ్రీను, గోపు రాజం,ఎల్పుల సత్యం,భైర మల్లేష్,ఎల్పుల మల్లేష్,బత్తుల శ్రీనివాస్,రామస్వామి, రామ కృష్ణ, బోనగిరి రవీందర్,పందిరి లింగయ్య,సరేష్,లచ్చులు,హరిప్రసాద్, శారద తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version