విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు