జహీరాబాద్ లో ఆందోళన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.