రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=1

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version