కలసి ఉంటే కలదు సుఖం రాజి మార్గమే రాజా మార్గం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో నుండి బయటపడాలని జడ్జి తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ క్షమా గుణాన్ని కలిగివుండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరభావంతో మెలగాలని వారు తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ లేబర్ కమీషనర్ వినోద గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు బెంచి మెంబర్లు ఎం.డి. లతీఫ్ అబ్దుల్ కలాం మంగళపల్లి రాజ్ కుమార్ రావుల రమేష్ కనపర్తి కవిత మొయినుద్దీన్ సంధ్య నాగవత్ తిరుమల పోలీసు అధికారులు పి.కుమార్ ఏ.నరేష్ కుమార్ కర్ణాకర్ రావు వెంకటేశ్వర్లు బ్యాంకు ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’