అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు

అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల రెండు పడక గదుల ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కనిపించే ఉద్దేశంతో చేపట్టిన రెండు పడక గదుల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం మన కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి కార్యాలయ రికార్డులు, దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు 2BHK ఇళ్ల పంపిణీపై కలెక్టర్ సమీక్ష

మంచిర్యాల జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

మంగళవారం బెల్లంపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 2BHK పథకంలో అర్హులైన వారికే ఇండ్లు కేటాయించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రికార్డులు మరియు దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version