చిలుకమారి శ్రీనివాస్ కు ఘన సన్మానం. పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాదుని సత్యనారాయణ.
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
మొగుళ్లపల్లి గ్రామపంచాయతీ ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలుపొందిన శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారిని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాధుని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ శ్రీనివాస్ గారు వార్డ్ నెంబర్ గా గెలుపొందడం ఆనందదాయకమని మొగుళ్ళపల్లి సమగ్ర అభివృద్ధి కోసం పాలకమండలి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడితే 200 రూపాయల కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు కూలిగిట్టుబాటు అయ్యే విధంగా పనికల్పించాలని ప్రతినెల చేనేత బంధు పథకం కింద ₹2,000 నేత కార్మికునికి కండెల చుట్టే వారికి 500 రూపాయలు గత ప్రభుత్వంఅందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని మరియు 50 నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరారు
