ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం
హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల నియామకం
నేటిధాత్రి”,హనుమకొండ:
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం హనుమకొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ విధి విధానాలను తెలియజేశారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా రాజీలేని పోరాటాలు చేస్తూ అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలు తమ సంస్థలో ప్రధాన అంశాలని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది మాదాసు మొగిలయ్యతో కలిసి ఈ సందర్భంగా ఇటీవల రద్దు చేసిన గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా నూతన కమిటీలను, పలు నియామకాలను ప్రకటించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులుగా: ఉచత శ్రీకాంత్, విసంపెల్లి నగేష్, భానోత్ జవహర్లాల్ నెహ్రూ నాయక్
ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా: ఆవునూరి కిషోర్
గ్రేటర్ వరంగల్ కమిటీ
గ్రేటర్ అధ్యక్షులుగా: కోమండ్ల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శిగా: గూడూరు నరేందర్
హనుమకొండ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: డాక్టర్ బండి సదానందం
ఉపాధ్యక్షులుగా: పడాల మురళీకృష్ణ
ప్రధాన కార్యదర్శిగా: పల్లెవేని మహేష్
వరంగల్ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: మేరుగు రాంబాబు
ఉపాధ్యక్షులుగా: గుజ్జ సురేందర్
ప్రధాన కార్యదర్శిగా: సంగెం రమేష్
అధికార ప్రతినిధిగా: నర్మేట యాదగిరి
తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాక శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.