మండల పరిషత్ అధికారిగా భవాని…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T153801.588.wav?_=1

 

 

మండల పరిషత్ అధికారిగా భవాని

మహాదేవపూర్ నవంబర్ 10 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మండల పరిషత్ అధికారిగా భవాని బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారిగా ప్రసాద్ గతంలో విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్ వెళ్లడంతో మహాదేవపూర్ మండల పరిషత్ అధికారిగా భవాని నియామకం చేయగా మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది స్వాగతం పలకడంతో మండల అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఎంపిడివో గా భాద్యతలు స్వీకరించిన

ఎంపిడివో గా భాద్యతలు స్వీకరించిన పసరగొండ రవి .

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పసరగొండ రవి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గతంలో విధులు నిర్వహించిన నరసింహమూర్తి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఎంపీ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవికి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయగా. బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సూపర్డెంట్ ఎండి అబిద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ శారదామని, నూతన బాధ్యతలు చేపట్టిన రవికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శైలజ, పరంజ్యోతి, టైపిస్ట్ గంగాధర్, ఈ పంచాయతీ ఆపరేటర్ రఘువరన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఖాతాలో డబ్బులు జమ..

రైతుల ఖాతాలో డబ్బులు జమ
.. మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T131331.402.wav?_=2

నిజాంపేట, నేటి ధాత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రోజున వారణాసిలో ప్రధాని విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేటలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 6091 మంది లబ్ధిదారులకు నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు మరో 300 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్…

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్

మహాదేవపూర్ ఆగస్టు 01 (నేటి ధాత్రి) *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో శుక్రవారం రోజున క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్, స్కూల్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దూర ప్రాంతాల వారికి హాస్టల్ సదుపాయం ను అందుబాటులో ఉంది కావున వినియోగించుకొని విద్య లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, హాస్టల్ లలో ఆహారవిషయం లో సమయ పాలన పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అన్నారు. హెల్త్ సెంటర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలం లో ఎక్కువ గా ప్రజలు ఎలాంటి సమస్యలకు గురి అవుతారో ముందే గ్రహించి ప్రజలకు అవగాహన తో పాటు అన్ని రకాల వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ కిరణ్, ఎంపీ ఓ ప్రసాద్, గ్రామ కార్యదర్శి కల్పన ఎస్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరిత తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఎరువుల షాపులను తనిఖీ.!

ఎరువుల షాపులను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

రైతులకు ఎరువుల కొరత ఉండదు… ఏ ఓ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు యూరియా మరియు ఇతర ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని వారు సూచించారు, స్టాక్ బోర్డులు, ఇన్వైస్లు, ఓ ఫామ్సు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని వారు సూచించారు, ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఎరువులు నియంత్రణ చట్టం 1985 ప్రకారం, మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారు సూచించారు.

వారు మాట్లాడుతూ కేసముద్రము మండలంలో, ప్రైవేటు ఎరువుల దుకాణాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 323 మెట్రిక్ టన్నులు, డిఏపి 53 మెట్రిక్ టన్నులు ,పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది కావున రైతు సోదరులు ఎటువంటి అధైర్యపడవద్దని వారు సూచించారు, కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి, యూరియా మరియు ఇతర ఎరువులను పొందాలని వారు సూచించారు, వారు మాట్లాడుతూ ప్రస్తుతము పత్తి మరియు మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే అందియాలని వారు సూచించారు , అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతులకు నానో యూరియా మీద అవగాహన కల్పించడం జరిగింది.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్ష సమావేశంలో క్షయ వ్యాధి నివారణలో ఆశలు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు తెమడ బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపవలసిందిగా మరియు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కొరకై ఆరోగ్య మహిళా క్లినిక్ యందు పరీక్షలు చేయించవలసిందిగా సూచిస్తూ, మలేరియా డెంగ్యూ జ్వరాల నివారణ డ్రై డే కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించవలసిందిగా సూచిస్తూ ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్షించినారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్. సంపత్ కుమార్, పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ గార్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం

కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నజిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న బోనాల ,పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉపకేంద్రములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రికార్డులను పరిశీలించి 0-5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత రెండు గంటలు పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో రెండు రోజులపాటు సంబంధిత ఏ.ఎ.న్ఎం మరియు ఆశ వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ, సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా లేనియెడల సి.సి.ఏ. రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహన్ మరియు సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం.

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

shine junior college

అంకుసాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కుంటయ్య ఈరోజు ఆత్మ హత్యాయత్నంచేసుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి కుంటయ్యనుసిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తద్వారా మెరుగైనవైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు దీనిపై తెలిసిన సమాచారం ప్రకారం. తనకు సంబంధించినపది లక్షల భూమిని సదరు కృష్ణారెడ్డి
నా ప్లాట్ ని కబ్జా చేశారని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తిరిగి తనపై కేసులు నమోదు చేశారని బాధితుడూ ఆరోపించాడు దీంతో నా చావుకి కారణం గంగా కృష్ణారెడ్డి అని 10 లక్షల విలువైన భూమిని కబ్జ చేశాడు అంటూ కుంటయ్య స్టేటస్ పెట్టాడు స్టేటస్ చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన.పోలీసులకు సమాచారం అందించడంతో దీంతో సంబంధిత పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఘటన స్థలానికి చేరుకొని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న కుంటయ్యను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థలంకి సంబంధించి పైసలు అడగడానికి వెళితే ఇవ్వడానికి నిరాకరించడంతో. కొన్ని రోజులుగా డబ్బుల పంచాయతీ నడుస్తుందని దీనిపై గతంలో కూడా పోలీస్ స్టేషన్లో పలు సందర్భాల్లో పలువురు మధ్యలో ఫిర్యాదు చేయడం జరిగిందని దీనికి సంబంధించి పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో. మనస్థాపం చెంది. ఈరోజు ఉదయం ఆత్మహత్యానికి పాల్పడినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకి. తరలించారు అని సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. గత సంబంధిత పోలీసు అధికారులు దీనిపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా నిజా నిజాలు తెలియాల్సి ఉన్నది. ఆత్మహత్య చేసుకునేదాకా. అవసరం ఏమొచ్చింది అని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. మిగతా సమాచారం కోసం ఏమి జరిగింది అనే కోణాలపై ఆలోచించిన విషయం ఆసన్నమైనది. ముందుగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుంటయ్య ఆరోగ్యం బాగుపడి బయటకు వస్తేనే పలు విషయాలపై నిజా నిజాలు బయటకు వస్తాయని ఆలోచన దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల కేంద్రంలోని ఎంఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మండలంలోని 57 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మండలంలోని 2663 విద్యార్థుల నిమిత్తం మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ ఝరాసంగం మండలంలోని అన్ని పాఠశాలలకు మొదటి విడత 12,517 పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి రావడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది శివ సి.ర్.పి.రాజు షైక్ షఫీవుద్దీన్ లక్ష్మీ ఉపాధ్యాయులు మెదపల్లి ఎల్గోయి నగేష్ శివ చందర్ పాల్గొన్నారు.

అంగన్వాడి ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి.!

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి

నిజాంపేట్, నేటి ధాత్రి :

 

 

నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో మంగళవారం రోజున జిల్లా వెల్ఫేర్ అధికారి హైమావతి చల్మెడ అంగన్వాడి 4 వ సెంటర్ ను సందర్శించడం జరిగింది. బరువు తక్కువ ఉన్న పిల్లలు(SAM), నామ మాత్రం బరువు తక్కువ ఉన్న పిల్లలు(MAM) పిల్లల బరువులు, ఎత్తు, చూడడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడి టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లల తల్లులు గర్భిణీలు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానికల్ (DEEE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) విభాగంలో (60 సీట్లు) కలవు.
ఇందుకు గాను 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలకల యొక్క కులం మరియు ఆదాయదృవీకరణ పత్రం (not for Orphans), తల్లిదండ్రుల యొక్క మరణ దృవీకరణపత్రము (in case of Orphans), బోనఫైడ్, ట్రాన్సఫర్ సర్టిఫికేట్, స్టడీ కేర్టిఫికేట్ మరియు 10 వ తరగతి మార్కుల మేమో ను సంబందిత ధరఖాస్తు ఫామ్ తో జత పరచవలెను. తేది: 20.05.2025 లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా లో సమర్పించగలరని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

ఆ” అధికారి” ఎందుకు వచ్చినట్లు.!

ఆ” అధికారి” ఎందుకు వచ్చినట్లు.!

టి జి ఎం డి సి నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.

ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.

మంచిర్యాల జిల్లా క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారికి కనబడలేదా.

దేవుని దర్శనంగా అధికారుల సందర్శన, రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతున్న అక్రమాలు.

టీజీఎండిసి చీకటి ఒప్పందమే, ఇసుక క్వారీల అక్రమాలు,
అనేక సాక్షాలు తెరపై.

ఇప్పటికే ఐదు క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

ఇసుక క్వారీల్లో అక్రమాలకు అంతులేకుండా యదేచ్చగా అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక బిసి కాసులు దండుకుంటున్న క్రమంలో, మండలంలోని 5 ఇసుక క్వారీల అక్రమ వ్యవహారం, తెరపైకి వస్తున్న క్రమంలో అధికారుల చర్యలు లేకపోవడం, ఇసుక రీచ్ లో అక్రమాలకు మరింత బలం చేకూర్చింది, ఒకవైపు ఇప్పటికే పలుకుల 8 పలువుల తొమ్మిది, మహాదేవపూర్ పూసుక్ పల్లి,1 పుసుపల్లి పలుకుల సిక్స్, పుసుపల్లి ఒకటి. ఐదు ఇసుక రీచ్ లో దర్జాగా దోపిడీ వ్యవహారాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, టీజీఎండిసి అధికారులు చర్యలకు ఉసేత్తలేదు, ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఇసుక రీచ్ లో దోపిడీ అక్రమ ఇసుక రవాణా చేస్తూ మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దర్జాగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తెరపైకి వచ్చింది, మంచిర్యాల జిల్లా చెన్నూర్ సరిహద్దుకు అనుకొని ఉన్న ఎర్రాయిపేట తీరుతూ నిర్వహించబడి ఇసుక క్వారీ గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, కుంట్లం గ్రామ శివారు నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇది కూడా టీజీఎండిసి నిబంధనలకు విరుద్ధం కాదు, స్థానికులు అడిగితే అధికారులు టీజీఎండిసి విధానాల పాఠాలను చెప్పడం, కాంట్రాక్టర్ సూపర్వైజర్ కు అడిగే పరిస్థితి లేదని, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తరలించడమే కాకుండా దౌర్జన్యాo, బెదిరించే పరిస్థితికి దారితీసింది. తాజాగా మరోవైపు “సెన్సేషనల్” విషయం గుట్టు చప్పుడు కాకుండా రెండు రోజులుగా మండలమంతా గుసగుసలాడింది, అదేమిటంటే ఉన్నత అధికారి సందర్శన, వింటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా కానీ అదే నిజం.

officer

ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు.!

రాష్ట్రవ్యాప్తంగా మహాదేవపూర్ ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక రవాణా, పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం, గత 24 గు రోజుల నుండి, వరుస కథనాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి సిబ్బంది, తమ హద్దులు దాటి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న సాక్షాలు, లోడింగ్ పై అదనపు ఇసుక తరలిస్తున్న లారీలు కాంటాల వ్యవహారం, సాక్షాలతో తెరపైకి తీసుకురావడం తోపాటు మండలంలో ఇసుక రీచుల అక్రమ వసూళ్ల వ్యవహారం, లక్షల రూపాయల సొమ్ము కాంట్రాక్టర్లు జీబులు నింపుకోవడం, వారికి గుమస్తాలుగా టీజీఎండిసి సిబ్బంది సహకరించడం లాంటి విషయాలను సాక్షాలతో తెరపైకి తీసుకురావడంతో పాటు, టీజీఎండిసి అధికారుల నిర్లక్ష్యం, చర్యలకు ససి మీరా అనడం, వరుస కథనాలతో అధికారులు చలనం రాకపోవడం తో కాంట్రాక్టర్లు తమ అక్రమాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం లాంటి విషయాలను, తిరుపతికి తీసుకురావమే, లక్ష్యంగా అడుగులు వేస్తున్న క్రమంలో, శనివారం రోజు ఉన్నత అధికారి గుర్తు చప్పుడు కాకుండా, మండలంలో నిర్వహించబడుతున్న కొన్ని ఇసుక క్వారీల వద్ద సందర్శించడం జరిగిందని తెలుస్తుంది.

officer

వచ్చిన ఆ అధికారి లారీల డ్రైవర్ లను ఏమైనా ప్రశ్నించడం జరిగిందా, కాంటాల వద్ద “రీబూట్” చేసి చూడడం లాంటి జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు, మరి ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు, అంత పెద్ద అధికారి వస్తే ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా, అలాంటిది ఏమీ జరగలేదు, ఆ ఉన్నత అధికారి వచ్చి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఆ అధికారి పర్యటన వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందని మాత్రం చర్చలు జరుగుతున్నాయి.

officer

టి జి ఎం డి సి, నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.

ఇక టీజీఎండిసి నిర్లక్ష్యం మండలంలో నిర్వహించబడుతున్న క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయని పరిస్థితి కొనసాగుతుంటే, మరోవైపు పక్క జిల్లా క్వారీలు కూడా, గోదావరి సరిహద్దుకు ఆనుకొని ఉన్నాము కదా, “ఆ ఇసుక, ఈ ఇసుక” అంతా ఒకటే, అనుకున్నారేమో వారం రోజులుగా గోదావరిలో రోడ్డు నిర్మించి, పెద్ద మొత్తంలో కుంట్లం సరిహద్దు నుండి ఇసుక రవాణా చేస్తుంటే, జిల్లా టీజీఎండిసి మైనింగ్ తో పాటు శనివారం వచ్చిన ఆ ఉన్నత అధికారికి, స్థానిక అధికారులు చూపెట్టారో లేదో, కానీ పాపం పక్క జిల్లా ఎర్రాయిపేట క్వారీ కాంట్రాక్టర్ మాత్రం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మించి, దర్జాగా నేను కూడా టీజిఎండిసి ఇసుక కాంట్రాక్టర్ నే కదా అని కుంట్లం సరిహద్దు ఇసుకను ఎర్రాయిపేట క్వారీ వద్ద రవాణా చేసుకుంటున్నాడు, ఈ వ్యవహారాన్ని చూస్తే శభాష్ టీజీఎండిసి అనాలనిపిస్తుంది ఆట గ్రామస్తులకు, ఎందుకంటే గతంలో పలువుల 8 పేరుతో నిర్వహించబడిన ఇసుక క్వారీ, కేవలం రోడ్డు కొరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు సరిహద్దు గోదావరి ఇసుకను తీస్తుంటే, కాంట్రాక్టర్ టి ఎస్ జి డి సి పి ఓ గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు టీజీఎండిసి రూల్ మారిపోయింది. మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలో అక్రమాలు సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన చర్యలు తీసుకొని టీజీఎండిసి, ఇక పక్క జిల్లా వారు వచ్చి అక్రమంగా దోచుకుంటే ఇలా ఆపుతుంది అని చెప్పుకొస్తున్నారు కులం గ్రామస్తులు.

officer

ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.

ఇక ప్రస్తుతం మండలంలో గుట్టు చప్పుడు కాకుండా ఉన్నత అధికారి పర్యటన కాస్త చర్చగా మారింది, మండలంలో భారీగా అక్రమ వసూళ్లు నిర్వహిస్తున్న ఐదు ఇసుక రీచ్ లో, పూసుకుపల్లి ఒకటి తమ క్వాంటిటీని అక్రమ వసూళ్ల పర్వంతో సమాప్తం చేసుకొని దుకాణం లేపేసింది, కానీ టీజీఎండిసీ, కమిట్మెంట్ తప్ప ఏమీ చేయలేకపోయింది. అలాగే కాలేశ్వరం గ్రామానికి ఆనుకొని నిర్వహించబడుతున్న పుసుపల్లి పలుకుల సిక్స్ కూడా గత రెండు రోజులుగా లోడింగ్ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం పలువుల 8 పలువుల తొమ్మిది మహాదేవపూర్ పూసుకుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లలో తగ్గేదే లేదని మరింత రెట్టింపు ఉత్సాహంతో రోజుకు 80 నుండి 100కు పైచిలుకు లారీల్లో ఇసుక రవాణా చేస్తుంటే, వచ్చిన ఉన్నత అధికారి ఈ క్వారీ ల వద్ద వెళ్లి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు ఉన్నత అధికారి వచ్చిందంటే, కింది స్థాయి అధికారి నుండి కాంట్రాక్టర్ ల వరకు భయం గుప్పిట్లో ఉంటుంది కానీ ఇక్కడ అంత సీన్ లేదు ఆటా, ఎందుకో మరి, దేవుని దర్శనముగా ఉన్నత అధికారులు ఇసుక క్వారీలకు సందర్శిస్తే, ప్రసాదం దొరుకుతుంది, కానీ అక్రమార్కులకు భయం ఎందుకు కలుగుతుంది, కానీ ఆ ముక్తిశ్వరుని పాపం మాత్రం కలుగుతుందని అంటున్నారు ఆ లారీ డ్రైవర్లు ఓనర్లు.

ఇప్పటికే” ఐదు “క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.

గుర్తుచప్పుడు కాకుండా ఉన్నత అధికారి ఇసుక రీచులకు సందర్శించినప్పుడు,మంచిర్యాల జిల్లా కు సంబంధించిన ఎర్రయ్య పేట పేరుతో నిర్వహించబడే క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారి దృష్టికి కిందిస్థాయి అధికారులు ఎందుకు తీసుకపోలేదు, లేకుంటే కావాలని చూసి చూడనట్టుగా వివరించారా ఇలా అనేక అనుమానాలు తెరపైకి రావడం జరుగుతుంది. అక్రమాలపై సాక్షాలతో తెరపైకి వస్తున్న క్రమంలో చర్యలకు బదులు దేవుని దర్శనంగా అధికారుల ఇసుక క్వారీలు సందర్శిస్తే, కాంట్రాక్టర్లు అధికారుల సందర్శనలు లెక్కచేయకుండా రెట్టింపు ఉత్సాహంతో అక్రమ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీల్లో అక్రమాలకు పురుడు పూసింది టీజీఎండిసి,ఏ అని చెప్పడంలో సందేహం లేదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి చీకటి ఒప్పందమే, దర్జాగా అనేక అక్రమాలు అక్రమ వసూలు అయినా అధికారుల నిశ్శబ్దం, ఇదే పెద్ద సాక్ష్యం, 24 రోజుల్లో 14 సంచలన కథనాలు సాక్షాలతో తెరపైకి వచ్చిన ఒక్క క్వారీని కూడా టీజీఎండిసి సీజ్ చేయలేదు, అంటే అక్రమ ఇసుక రవాణాపై, ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇక్కడ అమలవుతుంది. అంతేకాకుండా పక్క జిల్లాలకు కేటాయించిన ఇసుక క్వారీల ల్యాండ్ మార్కులను కూడా, కాంట్రాక్టర్లు వదిలిపెట్టి గోదావరి హద్దు దాటి అక్రమ రోడ్ల నిర్మాణాలు, చేపట్టి గోదావరి అవుతలి వైపు నుండి ఇసుక తరలిస్తుంటే టీజీఎండిసి చర్యలకు బదులు గుట్టు చప్పుడు కాకుండా, ఉన్నత అధికారులను దేవుని దర్శనంగా ఇసుక రీచులకు సందర్శనకు పంపిస్తుంటే అక్రమాలు ప్రభుత్వ సెండ్ పాలసీ విధానం ఎక్కడ అమలు అవుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు మండలంలో ఇసుక క్వారీల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ శ్రీ ,పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.
డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి:

గ్రామాల్లోని అన్ని రకాల పన్నులను ఈ నెల పదిలోపు వంద శాతం వసూళ్లు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశించారు.
దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలం పరిదిలో గల పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పన్నులు,నల్లా పన్నులు వసూల్ చేయాలని అన్నారు. డంపింగ్ యార్డ్ లలో వర్మికాంపోస్ట్ ప్రిపరేషన్ ప్రాపర్ గా చేయాలని పేర్కొన్నారు.ఎండాకాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version