నూతన ఎలక్ట్రికల్ ఏఈ సంతోష్ కుమార్ కు ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినియర్ గా సంతోష్ కుమార్ బుధవారం నాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండల పరిధిలోని రాజినెల్లి గ్రామానికి చెందిన మధుకర్ సబ్ కాంట్రాక్టర్ గ్రామస్తులతో కలిసి మర్యాదపూర్వకంగా పులమల శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఇంతకు ముందు సబ్ ఇంజినియర్ విభాగంలో ఉన్న అబ్దుల్ అజీజ్ ఇంచార్జ్ అసిస్టెంట్ ఇంజినియర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ కుమార్ మునిపల్లి మండల ఏఈ గా బాధ్యతలు స్వీకరిస్తూ కోహిర్ మండల ఏఈ గా బదిలీపై వచ్చారు. మండల రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించి మండల ప్రజల్లో, రైతుల్లో శాశ్వతంగా పేరును సంపాదించుకోవలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో జలీల్ పాష, షేక్ మొయిన్, రాజ్ కుమార్, రాజినెల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
