విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్ గురువారం జగిత్యాల లో జరిగిన ఇట్టి టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి బబ్బిలి అక్షయ్’గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గౌరవ కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.
