ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం…

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం.

చిట్యాల,నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వెలుగు మహిళా సమైక్య ఏపిఎం ఇన్చార్జి గా గుర్రపు రాజేందర్ బాధ్యతలు చేపట్టినందున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజేందర్ వెలుగు మహిళ సమైక్య లో సీసీగా పనిచేస్తూ ఇన్చార్జి ఏపిఎం గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అంబేద్కర్ యువజన సంఘం తరపున రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సక్రమంగా నిర్వహించాలని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు పుల్యాల సురేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు అంబేద్కర్ వాదులు పుల్ల ప్రభాకర్ జీడి సురేష్ భాస్కర్ మైదం మహేష్ గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు….

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ దంపతులు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కిందపడి గాయాలు కాగా వారిని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ కన్వినర్ అరకొండ రాజయ్యలు పరామర్శించి వారికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబాల రమేష్, మాజీ సర్పంచ్ నేరెళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version