ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి
పీహెచ్సీ ముందు సిఐటీయు ధర్నా
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తమకు పారితోషకం వద్దని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ పిహెచ్సి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక డాక్టర్ సుధీర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమకు ప్రతి నెల వేతనం సక్రమంగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ 20 తారీకు గడుస్తున్నప్పటికీ వేతనం ఇవ్వలేదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట దాటి వేసిందని అందుకనే ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, 30 న హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు వజ్జ సుశీల తెలిపారు. జబ్బ ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నదని కనీస వేతనం అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూనేమ్ సరోజ, ఊకె విజయలక్ష్మి, లక్ష్మీనరసమ్మ కల్తీ వసంత ,వినోద, ఈశ్వరి ఈసం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.