*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి…

పలమనేరు(నేటిధాత్రి:

ప్రస్తుత విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతున్నారని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి పేర్కొన్నారు.
గంగవరం మండలంలో ప్రీ ఆన్ ఫ్యూచర్ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలను ప్రారంభించారు.
​ వినూత్నమైన ప్లే-బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ప్రారంభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఆటల ద్వారా సాగే ఈ విద్యా విధానం పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక మరియు మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె వివరించారు. ఈ విధానం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారని, భవిష్యత్తులో వారికి ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆమె కోరారు. అనంతరం ​పాఠశాల నిర్వాహకురాలు మౌనికకు మరియు ఆమె బృందానికి అభినందనలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డి పల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటిధాత్రి:

నిత్య కృషీవలుడు, నవ్యాంధ్ర సాధనలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేక్ కట్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు దూరదృష్టి, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడే తపన అభినందనీయమని, ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలందించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టిటిడి నాయకులు రాజశేఖర్ నాయుడు,
సోమశేఖర్ నాయుడు వాసు నాయుడు, గందమనేని నరేష్, బిజేపి చిన్నగొట్టిగల్లు మండలాధ్యక్షులు దండు కిషోర్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ మత్తుం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత నారా లోకేష్…

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత నారా లోకేష్…

*యువ కిశోరం నారా లోకేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు…

“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హర్షధ్వానాలు…

*రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మన యువ కిశోరం…

*నారా లోకేష్ కి శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి…

*చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్…

చిత్తూరు(నేటిధాత్రి:

తెలుగుదేశం పార్టీ నవశకానికి వారధిగా, కోట్లాది మంది కార్యకర్తల ఆశల ఆశాకిరణంగా ఎదిగిన యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయం. వారికి హృదయ పూర్వక ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వారికి శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త జిజెఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్మెన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. తన అసాధారణ పనితీరుతో, చెక్కుచెదరని సంకల్పంతో అటు పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని, ఇటు యువతరాన్ని ఏకతాటిపైకి తెచ్చిన లోకేష్ నియామకం.టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అంకితభావంతో కూడిన బాధ్యత అని నిరూపించిన ఆయన, రాబోయే రోజుల్లో పార్టీని మరిన్ని విజయ తీరాలకు చేర్చడం ఖాయం.చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా
పార్టీ బాధ్యతలను, మంత్రిత్వ శాఖను సమాంతరంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ యువ కిశోరం అందరికీ స్పూర్తిగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని కార్యకర్తలకు భద్రత బరోసా కల్పించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. యువ కిశోరం నారా లోకేష్ కు పార్టీ పై ఉన్న నమ్మకం, కార్యకర్తలపై ఆయన చూపుతున్న ఆదరాభిమానాలకు గుర్తింపు గా ప్రపంచంలో ఏ పార్టీ కి లేని సభ్యత్వం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందంటే అది యువ కిశోరం నారా లోకేష్ వినయ విధేయతలకు నిస్వార్త సేవలకు నిలువెత్తు నిదర్శనం అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు.

కార్యకర్తలకు నారా లోకేష్ పెద్దపీట

తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ యువనేత మంత్రి నారా లోకేష్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. కడప మహానాడు వేదికగా కార్యకార్తె అధినేత అనే నినాదంతో పార్టీనీ పరుగులు పెట్టిస్తున్న యువ కిశోరం నారా లోకేష్. పని చెప్పేవారి కంటే పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని నారా లోకేష్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే తన సరికొత్త ఆలోచనలను అమలు చేస్తూ క్షేత్ర స్థాయిలో కష్టపడిన సాధారణ కార్యకర్తలకు వేదికపై సముచిత స్థానం కల్పించి అందరిని ఆశ్చర్యపరిచారు. సీనియర్ల అనుభవం, జూనియర్ల దూకుడును సమన్వయం చేస్తూ , రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్టీకి విధేయులుగా ఉన్న యువతను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో పార్టీకి సరికొత్త నాయకత్వాన్ని అందించేలా యువ కిశోరం నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని వారికి వారే సాటి వారికి లేరు ఎవరూ పోటీ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు.

రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనివాసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనివాసులు నియామకం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. ఒక బి సి. పల్లా శ్రీనివాసులు కు రెండవసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా గుర్తించడం అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి, బి సి ల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. పల్లా శ్రీనివాసులు కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతను ప్రోశ్చహిస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్ తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దగల గొప్ప సేవకుడు అని వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు
టీడీపీలో కార్యకర్తే అధినేత. సామాన్య కార్యకర్తకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని మరోసారి రుజువైంది. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంపిక కావడం మీ శ్రమ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపట్ల ఉన్న అనురాగానికి గుర్తింపు. మీ నాయకత్వం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలపడుతుందని, ప్రజాసేవలో స్ఫూర్తిని కల్గిస్తుందని ఆశిస్తున్నాను. మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున చిత్తూరు నియోజక వర్గం ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త జిజెఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్మెన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు..

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

తిరుపతి, నేటిధాత్రి:

చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సిడిసిఏ) కార్యదర్శి సతీష్ యాదవ్ ను తిరుపతి యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశంకు సతీష్ యాదవ్ ను గౌరవంగా ఆహ్వానించారుఈ సందర్భంగా తిరుపతి యాదవ నాయకులు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, పలువురు యాదవ నాయకులతో కలిసి సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version