ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన తర్వాతే

ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి.

గత సంవత్సరం నిర్వహించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులలో సుదూర ప్రాంతాలకు కేటాయింపు .

ఇప్పుడు బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు ఇస్తే వారికి తీరని అన్యాయం.

ఈ సంవత్సరం బదిలీలు చేపట్టకపోతే వచ్చే సంవత్సరం జనగణన నేపథ్యంలో కూడా చేపట్టడం వీలుకాదు.

పూర్తిస్థాయిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు ఇవ్వాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

బదిలీలు నిర్వహించకుండా ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు చేపడితే గత సంవత్సరం సుదూర ప్రాంతాలకు కేటాయించబడిన వారికి తీరని అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని బదిలీల అనంతరమే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెస్సీవ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

 

సోమవారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు కేటాయించబడ్డారని, ఇప్పుడు ప్రభుత్వం బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు చేపడితే వారికి తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా ప్రమోషన్ పొందే వాళ్లకేమో దగ్గరగా ఉండే అవకాశం ఇవ్వడం, గత సంవత్సరం ప్రమోషన్లు పొందిన వారినేమో సుదూర ప్రాంతాలలో అలాగే ఉంచడం సమంజసం కాదని అన్నారు.

 

 

 

ఈ సంవత్సరం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టకపోతే వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడుతున్న నేపథ్యంలో అప్పుడు కూడా బదిలీలు చేపట్టడం సాధ్యం కాదని అన్నారు. కావున ఉపాధ్యాయులందరికి బదిలీలు నిర్వహించి, ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఖాళీలను డీఎస్సీ నిర్వహించి నింపే అవకాశం ఉంటుందని వివరించారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే కాకుండా నిరుద్యోగుల జీవితాల్లో కూడా వెలుగులో నింపిన వారవుతారని అన్నారు.

 

 

 

అనంతరం మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు మాట్లాడుతూ టిపిటిఎఫ్ మొదటి రోజు సభ్యత్వ నమోదు లో భాగంగా కేసముద్రం స్టేషన్, బ్రహ్మం గారి గుడి తండా, ఉప్పరపల్లి, అర్పనపల్లి, కాంట్రపల్లి, భవాని గడ్డ తండా, వెంకటగిరి,చంద్రు తండా, ఇంటికన్నె,కోరుకొండ పల్లి, మహమూద్ పఠన్, కస్తూర్బాగాంధీ, కేసముద్రం విలేజ్ లలో గల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదుతో పాటు, ఆయా పాఠశాలల్లో ఉండే సమస్యల సేకరణ కూడా గావించామని అన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు వీసం నర్సయ్య, మోహన్ కృష్ణ, ఊట్కూరి ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో సెక్యూరిటీ హెడ్ గార్డ్ గా పదోన్నతి పొంది బదిలీపై కరీంనగర్ వర్క్ షాప్ వెళ్తున్న భోజనపు లక్ష్మణ్ ను ఆర్టీసీ సిబ్బంది ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా
డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీతో పాటు డిపో సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి, సెక్యూరిటీ టీం గోవర్ధన్,దేవేందర్ లక్ష్మణ్ ను శాలువాలు,పుష్ప గుచ్చo తో సన్మానం చేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిపో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి,గ్యారేజ్ సిబ్బంది,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ.

పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ
మల్లాపూర్ ఏప్రిల్ 28

నేటి ధాత్రి

మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వెంకటేష్ గౌడ్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక.!

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

 

01ఎప్రిల్2024 నుండి 31మార్చో2025 వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలములోని ఎంజిఎన్ఆర్ఈజిఎస్ లో జరిగిన పనులపై 14ఎప్రిల్2025 నుండి 24ఎప్రిల్2025 వరకు మండలములోని అన్ని గ్రామాలలో తనికి నిర్వహించి గ్రామ సభలు పూర్తి చేసుకొని గ్రామ సభలలో గుర్తించిన అంశాలపై శుక్రవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమము నిర్వహించి గుర్తించిన అంశాలను చదివి వినిపించడం జరిగింది. ఈకార్యక్రమములో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వేణు మాధవ్, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్ కిరణ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. క్రిష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యస్. రాజేశ్వరి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ విసిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సహాయక ఇంజనీర్ (పి.ఆర్) సుమన్, ఏపివో రాధ, యస్టియం సాయి, యస్.ఆర్.పి.రమేష్, ముత్తయ్య, పంచాయితి కార్యదర్శిలు, ఈ.సిలు, డి.ఆర్.పిలు, టి.ఎలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, మండలంలోని గ్రామాలకు సంబందించిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version