షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న ఎంపీడీవో.

షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న ఎంపీడీవో.

నేటి ధాత్రి మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి రాళ్ల బండి ప్రభాకర చారి షష్టిపూర్తి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మొగుళ్ళపల్లి ఎంపీడీవో సురేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రాళ్ల బండి సరళ ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. డిపెప్ (ప్రాథమిక విద్యాశాఖ)విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా పదవి విరమణ పొందిన రాళ్ల బండి ప్రభాకర్ షష్టిపూర్తి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని మొగుళ్ళపల్లి ఎంపీడీవో సురేందర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మొ ట్లపల్లి సర్పంచ్ నరహరి వెంకట్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాళ్ల బండి శ్రీనివాస్ డాక్టర్ రాళ్ల బండి ప్రశాంత్. (న్యూరో సర్జన్) ప్రజ్ఞన్.డాక్టర్ రాళ్ల బండి ప్రత్యూష (గైనకాలజిస్ట్ )పాలిక ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు.

కొహిర్ మండలానికి కొత్త అసిస్టెంట్ ఇంజినియర్ సంతోష్ కుమార్ కు ఘన సన్మానం

నూతన ఎలక్ట్రికల్ ఏఈ సంతోష్ కుమార్ కు ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినియర్ గా సంతోష్ కుమార్ బుధవారం నాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండల పరిధిలోని రాజినెల్లి గ్రామానికి చెందిన మధుకర్ సబ్ కాంట్రాక్టర్ గ్రామస్తులతో కలిసి మర్యాదపూర్వకంగా పులమల శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఇంతకు ముందు సబ్ ఇంజినియర్ విభాగంలో ఉన్న అబ్దుల్ అజీజ్ ఇంచార్జ్ అసిస్టెంట్ ఇంజినియర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ కుమార్ మునిపల్లి మండల ఏఈ గా బాధ్యతలు స్వీకరిస్తూ కోహిర్ మండల ఏఈ గా బదిలీపై వచ్చారు. మండల రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించి మండల ప్రజల్లో, రైతుల్లో శాశ్వతంగా పేరును సంపాదించుకోవలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో జలీల్ పాష, షేక్ మొయిన్, రాజ్ కుమార్, రాజినెల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version