కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ…

కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ

 

కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ విలువ సుమారు రూ. 90,000 కోట్లు ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అట్లాంటా, జనవరి 18: ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ కంపెనీ కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)ను పబ్లిక్‌గా లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ IPO ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.9,027 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.90,000 కోట్లు) ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.ఈ IPO 2026 వేసవిలో(సమ్మర్) లాంచ్ చేయాలని ప్రణాళిక. అయితే.. గతేడాదిలా వర్షాల వల్ల పీక్ సమ్మర్ డిమాండ్ తీవ్రంగా పడిపోతే, దీనిని 2027కి వాయిదా వేయవచ్చని సమాచారం. కోటక్ మహీంద్రా క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, సిటీ బ్యాంక్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఈ ప్రక్రియకు నియమించారు.HCCB భారతదేశంలో కోకా-కోలా, థమ్స్‌అప్, స్ప్రైట్, మాజా, కిన్లీ, దసాని, జార్జియా కాఫీ, ష్వెప్స్ వంటి బ్రాండ్లను తయారు చేసి, పంపిణీ చేస్తుంది. దేశంలోని రూ.60,000 కోట్ల సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. HCCB 15 ప్లాంట్లతో పనిచేస్తోంది. మిగిలిన ఆపరేషన్లు ఇతర ఇండిపెండెంట్ బాట్లర్ల ద్వారా జరుగుతాయి.
గత సంవత్సరం కోకా-కోలా తన గ్లోబల్ అసెట్-లైట్ వ్యూహంలో భాగంగా HCCB పేరెంట్ ఎంటీటీలో 40 శాతం వాటాను జుబిలెంట్ గ్రూప్(Jubilant Bhartia)కు రూ. 12,500 కోట్లకు అమ్మింది. ఈ IPO కూడా అదే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. బాట్లింగ్ ఆపరేషన్ల నుంచి దూరమై.. బ్రాండ్ బిల్డింగ్, ఇన్నోవేషన్, డిజిటైజేషన్‌పై దృష్టి పెట్టడం దీని లక్ష్యంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫైనాన్షియల్ ఇయర్(FY)25లో HCCB రెవెన్యూ రూ.12,751 కోట్లు (9 శాతం తగ్గుదల) నమోదైంది. ఇది ప్లాంట్లను ఫ్రాంచైజీ బాట్లర్లకు అమ్మడం వల్ల వచ్చిన ప్రభావమని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా అన్‌సీజనల్ రెయిన్స్ వల్ల కూడా సాఫ్ట్ డ్రింక్స్ సేల్స్ ప్రభావితమయ్యాయి.

ఇక.. ఈ IPO భారతదేశంలో MNCల బిగ్ లిస్టింగ్‌ల ట్రెండ్‌లో భాగమవుతుంది. ఇంతకుముందు హుందాయ్ Hyundai($3.3 బిలియన్), ఎల్‌జీ LG($1.3 బిలియన్) తర్వాత మరో మెగా డీల్‌గా నిలవనుంది. ఈ ఐపీఓ విజయవంతమైతే.. భారత FMCG మార్కెట్‌లో కోకా-కోలా బలాన్ని మరింత పెంచుతుంది.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ అవకాశంగా మారనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

 

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఊరువాడల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి.. సినీ హీరోగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులర్పించారు.

గుంటూరు జిల్లా..

జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, స్థానిక ఎమ్మెల్యే నసీర్, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణతో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భీమవరం..

జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీఐఐసీ ఛైర్మన్, టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలకలూరిపేటలోలో..

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావూ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కరిముల్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలు.. ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ జన్మదినం రోజున ముగియనున్నాయి.

విశాఖపట్నం..

స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదు, దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు జరగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆయన స్థాపించిన టీడీపీలో తాను ఎంపీగా సేవలందించడం గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు నగరంలోని బీచ్ రోడ్‌లో ఎన్టీఆర్ విగ్రహనికి విశాఖ ఎంపీ శ్రీ భరత్‌తోపాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, జిల్లా అధ్యక్షుడు పట్టాభితోపాటు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

గంటా శ్రీనివాసరావు..

చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలే దేవాలయం అన్న సిద్ధాంతంతో ముందుకు వెళ్లారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ముందుకు వెళుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతోపాటు సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లా..

నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

కర్నూలు జిల్లా..

పత్తికొండ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, టీడీపీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా..

బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించిన భగీరథుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో పురోగతితోపాటు పరిశ్రమ ఏర్పాటుతో ఏపీ.. దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతుందన్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, కొండపల్లిలో.. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘనంగా నిర్వహించారు.

శ్రీ సత్యసాయి జిల్లా..

భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్‌దేనని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరి పట్టణంలో స్థానిక సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. పటేల్, పట్వారి వ్యవస్థలకు చరమ గీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పేరు మీద పేదలకు కిలో రూ. 2లకే బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకమని పేర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్ పూజ్యుడు చిరస్మరణీయుడని అభివర్ణించారు. రాజకీయ పార్టీలు.. సేవా కార్యక్రమాలు చేయడం అనేది టీడీపీ ఆవిర్భావం తర్వాతనే వచ్చాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version