కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై తాజాగా.. మరోసారి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నోటీసులకు తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని స్పష్టం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ పార్టీ మారి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో.. ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగిసేలోపు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.