స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version