జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న..

మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T135658.497.wav?_=1

ముత్తారం :- నేటి ధాత్రి
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తుంటే మంథని నియోజక వర్గంలో ఎందుకు అమలు చేయడం లేదని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజక వర్గంలో దళిత బంధు యూనిట్లను విడుదల చేస్తుంటే మంథని నియోజక వర్గంలో
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.మంథని నియోజక వర్గంలో దళితులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంథని నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ప్రాంత దళితులందరికీ అంబేద్కర్ అభయాహస్తం ఇయ్యాలని కోరారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన..

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం..

*శ్రీకాళహస్తి శాసనసభ్యులతో కలసి శ్రీకాళహస్తి
నియోజకవర్గం లో పర్యటించిన తుడా చైర్మన్..

*ఎమ్మెల్యే నిధులు తుడా నిధులతో శ్రీకాళహస్తికి మహర్దశ..

*శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..

*అభివృద్ధి అజెండాగా తుడా పని చేస్తుంది..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 25:

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తూడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మొదటగా శుక్రవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్నారు.అక్కడ స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును అభివృద్ధి తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి. డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారుచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి చేరుకొని అక్కడి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తుడా నిధులతో ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని తుడా చైర్మన్ అధికారులకు ఆదేశించారు..జయ రామారావు వీధిలో పురాతన డ్రైనేజీ కాలువ ల ను ఆధునికరించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల ను డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా అధికారులను సన్మానించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో పట్టణాన్ని ఆకర్షణయంగా చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన జరినామాలు ఉంటాయని హెచ్చరించారుతుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ కాలువ ల అభివృద్ధికి ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తామని, గ్రీనరీ డెవలప్మెంట్ వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు.

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

పంచె కట్టుతో పత్తి చేనులో అరక పట్టి పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. తన స్వగ్రామం టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అరక పట్టి పత్తి చేనులో పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్, ఆత్మకమిటి చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, రావూరి సతీష్, భద్రం,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నేత శూన్యం

జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 25 వరకు జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నేత శూన్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో బీసీలకు నేతలుగా తలెత్తని అవకాశాలు – 2020 నుండి 2025 వరకు బీసీ నేతల సంఖ్య శూన్యం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 2025 వరకూ బీసీలకు రాజకీయ పట్ల ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో జెడ్పిటిసిలు, ఎంపీపీ పదవుల్లో బీసీలకు ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం ఆవేదన కలిగించే అంశంగా నిలిచింది. నియోజకవర్గంలో ఉన్న మొత్తం పదవుల్లో రెండు ఓసీలకు, మూడింటిని ఎస్సీలకు కేటాయించారు. అయితే, బీసీలకు మాత్రం ఒక్క నాయకత్వ పదవీ బాధ్యత కూడా లభించకపోవడం శోచనీయమని స్థానిక బీసీ సంఘాలు వాపోతున్నాయి. పది శాతం వర్గాలైన ఓసీలకు పదవులు ఇవ్వడం, 18 శాతం ఉన్న ఎస్సీలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటే, దాదాపు 52 శాతం ఉన్న బీసీలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వం లేకపోవడంతో బీసీ వర్గ సమస్యలు అధికారికంగా ప్రతిఫలించకపోతుండడం, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని పక్కన పెట్టడం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా విభజనలపై బీసీ సంఘాలు, యువత కఠినంగా స్పందిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో నాయకత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వైఫల్యాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిచో కాబోయే రోజుల్లో జనరల్ అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని సంకేతాన్ని తెలియజేశారు.

ప్రభుత్వ అధికారులు రోడ్ల మరమ్మత్తు.

ప్రభుత్వ అధికారులు రోడ్ల మరమ్మత్తు ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది అని కాలనీ వాసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో రాంనగర్ – తాండూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రాంనగర్ నుండి తాండూర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మత్తులు జరగకపోవడంతో తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా బిరుజు ప్రాంతం వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమై పొడుచుకుపోయిన గుంతలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మార్గాన్ని ఉపయోగించే గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు రోజు రోజుకూ ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎన్నోసార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను గుర్తు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రాంనగర్ నుంచి తాండూర్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి జిల్లా ప్రజల రవాణా అవసరాలకు కీలకంగా ఉండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలనీవాసులు మహమ్మద్ ఇమ్రాన్ మదినం శివ జాకీర్ సిరాజ్ గోపాల్ అడ్వకేట్ గణేష్ రవి ఇస్మాయిల్ షేక్ ప్రేమ్చంద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త చాటుదాం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ ఆవరణలో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు చైతన్యమై మెజార్టీ స్థానాల్లో గెలవాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలని చెప్పేసి వారు తెలియజేశారు రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలు ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా oc మాత్రమే సీఎంలుగా ఉంటున్నారని వచ్చే 2028లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీనే ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు Dr. పెద్ద గొల్ల నారాయణ కొండాపూర్ నర్సింలు శంకర్ విశ్వనాథ్ యాదవ్ ధనరాజ్ గౌడ్ సంగన్న దత్తు సిద్దు నరసింహ గోపాల్ వేణు లక్షమన్ తదితరులు పాల్గొన్నారు అదే విదంగా వివిధ గ్రామాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఆక్రమణ ?

గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఆక్రమణ ?

*ప్రభుత్వ ఆస్తుల రక్షణ పట్టని అధికారులు..

పలమనేరు నేటి ధాత్రి

పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం రాయలపేట సమీపం,గంకొండ రెవెన్యూ గ్రామం తురకవాని కుంట చెరువు సర్వేనెం 18-2 నందు 7ఎకరాల 50 సెంట్ల ప్రక్కనే ఉన్న ఓ అక్రమార్కుడు రాత్రికి రాత్రే చెరువు భూమిని అర్థానికి పైగా ఆక్రమించడమే కాకుండా భారీవాహనాలను ఉపయోగించి బండలను సైతం చెరువులోకి తోసి పూడ్చివేశారు.

కోట్లాది రూపాయల విలువైన భూములపై అక్రమార్కుల కన్ను

ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.పైగా అధికారపార్టీ పెద్దలతో బాటు అధికారుల ఆశీస్సులు కూడా మెండుగా ఉండడంతో ప్రభుత్వ భూములు కనిపిస్తేచాలు ఇలా ఆక్రమించి తమ ఆధీనంలో పెట్టుబడులు, వాటికి నకిలీ రికార్డులు సృష్టించి,ఏమీ తెలియని అమాయకులకు లక్షలాది రూపాయలు తీసుకుని కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది..

రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల మొద్దునిద్ర

ప్రభుత్వ భూములు,చెరువు భూములు ఇలా అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.ఇంతజరుగుతున్నా ఈ అక్రమణలపై నోరు విప్పిన అధికారులపట్ల పలు అనుమానాలు కలుగుతున్నట్లు పలువురు గుసగుసలు ఆడుతున్నారు.ఇప్పటికైనా ఇటువంటి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి,కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

త్యాగానికి ప్రతీక మోహరం

త్యాగానికి ప్రతీక మోహరం

◆ జులెఫ్ఖర్,హుస్సేన్ భాషా పీర్లను దర్శించుకున్న

➡️ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఘాడి లో మోహరం వేడుకల్లో పాల్గొని జులెఫ్ఖర్ హుస్సేన్ భాషా పీర్లను దర్శించుకొని, దట్టి ని సమర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,మాజీ ఎంపీటీసీ. అశోక్ గారు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు. నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి.రాములు, ఖాజా,నాయిమ్ అహ్మద్, మొయిజ్,గౌసోద్దీన్,జనార్ధన్, వాసీమ్,జామీల్,సోహెల్,మరియు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

◆ పుస్తకాలను ఆవిష్కరించిన బీసీ నాయకులు .

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గము. తీన్మార్ మల్లన టీమ్,మరియు బీసీ నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన రాసిన ‘బీసీలకు పెనుముప్పు’ ‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల, ‘శాసనమండలిలో ప్రజా గొంతుక ‘అనే పుస్తకాలను శనివారం పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పుస్తకాలను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోట వల్ల విద్యా, ప్రభుత్వ రంగాల్లో బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని రిజర్వేషన్ వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాసిన పుస్తకంలో చాలా విషయాలు వాస్తవాలుగా ఉన్నాయని వారు రాసిన పుస్తకం ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉన్నా అన్నారు.అన్ని రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు వారు తమ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జీ నర్సింహ, హనుమంత్,బీసీ నాయకులు డా. పెద్దగొల్ల నారాయణ, బీసీ తాలూకా కోర్ కమిటీ సభ్యులు కె. నర్సింలుముదిరాజ్ . ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, బీసీ నాయకురాలు జ్యోతి పండాల్, పి. అశోక్, పి.శేఖర్,తాలూకా బీసీ కోర్ కమిటీ సభ్యులు విశ్వనాథ్ యాదవ్, యువ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఘన నివాళులు

శంకర్ పల్లి, నేటిధాత్రి:
రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి సతీమణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరియు మాజీ ఎంపీపీ శ్రీమతి పడాల యాదమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించబడిన సందర్భంగా, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్వర్గీయ యాదమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన పడాల వెంకట్ స్వామి మరియు కుమారుడు ప్రభాకర్ ని పరామర్శిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఫిషర్ మెన్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, తోల్కట్ట సత్యనారాయణ, బలవంత రెడ్డి, ముడిమ్యాల గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి..

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు సందర్బంగా జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ నాగభూషణం హైదరాబాద్ లో వారి నివాసం లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన జువ్వాడి నర్సింగరావు ఈ కార్యక్రమంలో
మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ ఎల్లలజలపతి రెడ్డి రాష్ట్ర పద్మశాలి సంఘము ఉపాధ్యక్షులు కేసుల సురేందర్ కౌన్సిలర్లు మర్రి సహాదేవ్, పిప్పర రాజేష్ బీసీ సంక్షేమ శాఖ మెట్ పల్లి ఇంచార్జి తుమ్మనాపెళ్ళి రాజు లు తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి.

రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి

రామన్నపేట అఖిలపక్ష నాయకులు

రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా

 

 

 

 

రామన్నపేట నియోజకవర్గం ఏర్పడాలని మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన సమితి రెండవ సమావేశానికి రెబ్బసు రాములు అధ్యక్షతన వహించగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ
రామన్నపేట నియోజకవర్గం 1952లో ఏర్పడినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గంలో వలిగొండ
మోత్కూరు ఆత్మకూరు గుండాల మండలాలు ఉండేవి
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకుల్లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినారు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు రామన్నపేట మండల కేంద్రంలో నాడు అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి రామన్నపేట నియోజకవర్గం గొప్ప నాయకులు అభివృద్ధి పథంలో నడిపినారు రామన్నపేట నియోజకవర్గం 2009లో మన ప్రాంత నాయకులు ఢిల్లీ వరకు పోరాటం చేసిన మన పోరాటం ఒక పీడకల లాగా మనకు మెలిగింది మన మండలంలో వివిధ పార్టీలకు సంబంధించిన గొప్ప పోరాట యోధులు గొప్ప లీడర్లు ఉన్నారు ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసిన దురదృష్టం మనల్ని వెంటాడుతూ నియోజకవర్గం మన నుండి విడిపోయి నకిరేకల్ లో కలిసినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గం కాస్త మండలం గా మారినది ఆ తర్వాత 100 పడకలు కావలసిన హాస్పిటల్ రికార్డుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా బోర్డులో మాత్రం ఏరియా హాస్పిటల్ గా కొనసాగుతున్నది రామన్నపేట మండలానికి రావలసిన రెవిన్యూ డివిజన్ డీఎస్పీ ఆఫీసు వివిధ రకాల ఆఫీసులు ఇతర ప్రాంతాలకు తరలిపోయినవి మన నాయకులు పోరాటం చేసిన అదృష్టం మనకు కలిసి రాలేదు
కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నియోజకవర్గ పునర్విభజన కార్యక్రమం దేశవ్యాప్తంగా కులకన సర్వే జరుగుతున్నది దీనికి అవకాశం 2026 డిసెంబర్ వరకు ఒక నివేదిక పంపాలని చిన్న అవకాశం ఉన్నది యాదాద్రి జిల్లాలో రామన్నపేట నియోజకవర్గం చేసే అవకాశం ఉన్నది కావున ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత వాసులుగా నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు కావాల్సినన్ని సౌకర్యాలు ఉన్నవి మన ప్రాంతవాసుల మందరం కలిసికట్టుగా పోరాటం చేసి రామన్నపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలిసి రామన్నపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ముందుకు సాగుదాం అని తెలిపినారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్ బిజెపి రాష్ట్ర నాయకులు కన్నెకంటి వెంకటాచారి
బీజేవైఎం నాయకులు లక్ష్మణ్ టిపిసిసి రాష్ట్ర నాయకులు వనం చంద్రశేఖర్
రామన్నపేట పట్టణ అధ్యక్షులు
జమీరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ గొలుసుల ప్రసాద్
కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య
టిడిపి మండల అధ్యక్షులు
ఎండి ఫజల్ టిడిపి నాయకులు పోష బోయిన. మల్లేశం రామన్నపేట పట్టణ టిడిపి అధ్యక్షులు రాములు
డీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల. నరేందర్ మండల అధ్యక్షులు బందేల .అశోక్ డి.ఎస్.పి నాయకులు మల్లేశం శేఖర్
కిరణ్ కుమార్ సిపిఐ జిల్లా కౌన్సిల్ ఎర్ర రమేష్ గౌడ్.
సిపిఐ నాయకులు శ్రీరామోజు నరసింహాచారి సిపిఎం నాయకులు ఎస్.కె మన్సూర్
రామన్నపేట మాజీ ఉపసర్పంచ్
తెలంగాణ ఉద్యమ నాయకులు గంగాపురం యాదయ్య
ప్రజా పోరాటాల సమితి మండల అధ్యక్షుడు వరి కప్పల గోపాల్ ,ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షులు
నోముల శంకర్ తదితరులు పాల్గొన్నారు

నిధులు మావి.. గొప్పలు మీవా..?

నిధులు మావి.. గొప్పలు మీవా..?

మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు…

బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు.

 

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులతో 14వ వార్డులో పనులు జరిగితే వాటిని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, నిధులు మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 

 

 

 

 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించారని, ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు తీసుకురాకున్నా సరే నిధులు తీసుకొచ్చానని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. మంత్రికి మునిసిపాలిటీపై అవగాహన లేదని, ఏ నిధులు ఎక్కడ వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని ఇక మంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని ఎద్దేవా చేశారు. 14వ వార్డు సీనియర్ నాయకులు గడ్డం రాజు మాట్లాడారు.

 

 

 

సిసి రోడ్డు, డ్రైనేజీ, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ పనులు పూర్తయి రెండు నెలల క్రితమే ఓపెన్ చేశామని మళ్లీ శంకుస్థాపనల చేయడం చూస్తే నవ్వొస్తుంది అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు, మంత్రి వివేక్ పద్ధతులు మార్చుకొని మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేలా చొరవ తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రారంభించిన పనులను మళ్లీ ప్రారంభించడం విడ్డూరమని అన్నారు.

 

 

 

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,గడ్డం రాజు,పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,జిలకర మహేష్, అలుగుల సత్తయ్య, ఎల్లబెల్లి మూర్తి, కొండ కుమార్, యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,గాజుల చంద్రకిరణ్,వేనంక శ్రీనివాస్,నందిపేట సదానందం, పైతారి ఓదెలు, కల్వల సతీష్,శివ,మణి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు

ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి.

◆ జాడలేని వానలు…

◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు…

◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు కష్టమవుతోంది మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సాగక రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు.

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి.

20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది.

దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతోఈసారి ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు.

ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు.

వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి.

కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక సంగారెడ్డి పట్టణంలోని కూలీల అడ్డమీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారజిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పత్తి పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగ పత్తి మినుములు, పెసర్లు, కందులు, పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయ బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు.

ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్క ఎండిపోయింది సారూ.

రెండెకరాల పొలం ఉంది అందులో రూ. 20వేల అప్పు చేసి పత్తి కందులు పంట వేశాను.

తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది.

దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా ఇక్కడ కూడా పనిదొరకడం లేదు ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు బొరేగౌ మొహమ్మద్ నవాబ్

రెండెకరాల పత్తి పోయినట్టే

నాకు రెండెకరాల పొలం ఉంది అందులో రెండు బోర్లున్నాయి వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి పత్తి పంట సాగుచేశాను.

వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి పంట ఎండిపోతోంది అడ్డమీద పనికొచ్చినా పనిచెప్పేవారే లేరురైతు మాచునూర్ ఖలీల్.

పనులు చూపించాలి

మళ్లీ కరువు మొదలైంది పంటలుఎండిపోయాయి ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి.

బుక్కెడు కూడు కోసం అడ్డమీద పడిగాపులే వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి.  మేదపల్లి పరమేశ్వర్ పటేల్

పోషణ భారమైంది.

నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పత్తి పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి.

బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు.

కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు ప్రభుత్వమే పనులు చూపించి తుమ్మనపల్లి మొహమ్మద్ రోషన్.

మానె రామకృష్ణ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

మానె రామకృష్ణ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్

నేటిధాత్రి:

 

చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశాల్లో బాగంగా నిన్న రాత్రి కుదునూరు గ్రామంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసారు ఈ గ్రామ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాచలం డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు మానె రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అవుతున్న ఇంతవరకు మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు మహిళలకు 2500 ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు గ్యాస్ ఇవ్వలేదు పెన్షన్లు 4000 ఇవ్వలేదు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీర కోదండ రామయ్య డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ మండల యూత్ అద్యక్షులు అంబోజీ సతీష్ పార్టీ సీనియర్ నాయకులు నేతాని రాము అయినవోలు జగదీష్ పంజా రాజు తడికల బుల్లేబ్బాయి ఎడ్ల రాందాస్ కుంజా చంటి కుంజా కమల సిద్ధి సంతోష్ విజయ్ మేడి నరసింహారావు మరియు బిఆర్ఎస్ సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం

◆ ఏడాది గడవకుండానే రోడ్ కు మరమ్మ త్తులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుంచి ఝరాసంగం మండలం కప్పాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డు ఏడాది గడవకుండానే పాడవటం పై బిఎస్పి జిల్లా ఇంచార్జి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ్మ ఇలాకాలో సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణం పాటించకపోవడంపై బీఎస్పీ ఇంచార్జి మోహన్ ఎద్దేవా చేశారు.. పాడైన రోడ్డు ను, ప్యాచ్ వేసేందుకు చేపట్టిన పనులను గురువారం అయన పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధికారులు రోడ్డు నిర్మాణ సమయం లో నిర్లక్షంగా వ్యవహరించడం వల్లనే మూన్నాలకే రోడ్డు పై తారు లేచిపోయి గుంతల మాయంగా మారిపోయిందని, దీంతో ప్రయాణికుల, వాహన దారుల కష్టాలు పునరావృతం అయ్యయన్నారు. రోడ్ లు, భావనలు నిర్మాణ క్రమంలోనే సంబంధిత ఇంజనీర్ లు తగిన విధులు నిబద్దతతో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికైనా అధికారులు, తారు, సీసీ రోడ్డు లు, భవనాలను ఎస్టిమేషన్ లకు తగ్గట్లు నిర్మించి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. రోడ్ లు, భవనాల నిర్మాణం లో మరోసారి నిర్లక్ష్యం వహిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు పిర్యాదు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరానున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం వర్షంలో చెర్ల రాయిపల్లి లోని వంతెన నిర్మాణాన్ని కొనసాగించిన అంశం, పలు గ్రామాల్లో నాసిరకం ఇసుకతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నిబంధనల మేరకు అధికారులు నడుచుకోకపోతే ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు…

అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు..

నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు..

కాకా వారసత్వాన్ని కొనసాగిస్తా… ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా

కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

 

 

నియోజకవర్గంలో దందాలకు తావు లేదని, కాకా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా రామకృష్ణాపూర్ పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకట స్వామికి పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఏరియా ఆసుపత్రి సమీపంలో ఘన స్వాగతం పలికి, భారీ గజమాలతో సత్కరించారు.

ఏరియా ఆసుపత్రి సమీపంలో సింగరేణి కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఏరియా ఆసుపత్రి నుండి రాజీవ్ చౌక్, భగత్ సింగ్ నగర్ ,సూపర్ బజార్ చౌరస్తా,రామాలయం చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.రామకృష్ణాపూర్ నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేసానని, అందుకే ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించారని గుర్తుచేశారు.

ఇకముందు కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తానని అన్నారు.

ఇసుక దందా బంద్ కు కట్టుబడి ఉన్నానని, మైనింగ్ మంత్రిగా అది నా బాధ్యత అని అన్నారు.

రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తెలిపారని చెప్పారు.

ఇసుక రాయల్ ట్యాక్స్ తో అధిక నిధులతో అభివ్రుద్ది చేస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, 500 లకే గ్యాస్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Labor and Mines Minister Vivek Venkataswamy

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని,ప్రభుత్వం అర్హులైన వారికి సన్న బియ్యం కూడా ఇస్తుందని గుర్తు చేశారు.ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని,మీకోసమే పని చేస్తానని భరోసా ఇస్తున్నానని అన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నేతలు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మహంకాళి శ్రీనివాస్, శ్యామ్ గౌడ్,గోపతి బానేష్,యువ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version