నీలం కవిత మధు ముదిరాజ్‌కు కేతకిలో ప్రత్యేక పూజలు

నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవా సందర్భంగా కేతకిలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటిధాత్రి:

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో (ప్రస్తుతం కాంగ్రెస్) నాయకులు నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవాలు/శుభకార్యాల సందర్భంగా ప్రత్యేక పూజలు ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ సామాజిక కార్యకర్త గోపాల్ రవి సామాజిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి దక్షిణాదిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో. నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవా సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల మనిషి అన్న అంటే నేను ఉన్నాను అంటూ పేద
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై లక్ష్యంగా
అడుగు ముందుకు వేస్తూ ఉక్కుమనిషిగా
పేరు ప్రాక్యతలు పొందుతున్న
నీలం కవిత మధు ముదిరాజ్ ముద్దుబిడ్డ అని అన్నారు,

మద్దెల బాబు మృతిపై చల్లా ధర్మారెడ్డి సంతాపం

*మద్దెల బాబు మృతిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంతాపం*

*పరకాల,నేటిధాత్రి*

 

పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు మద్దెల బాబు(రాజయ్య)ఆకస్మిక మృతిపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.గుండెపోటుతో శుక్రవారం ఉదయం మద్దెల బాబు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన నాగారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మద్దెల బాబు పార్థివ దేహానికి పూలమాల వేసినివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మద్దెల బాబు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీవ్ర వేదన కలిగించింది.గ్రామ ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ఇది తీరని లోటు అని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

బెస్ట్ అవైలబల్ స్కూల్స్ దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి
ఈ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింది 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కల్పించుటకు గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు 1వ తరగతికి (41) సీట్లు 5వ తరగతికి (43) సీట్లు కేటాయించబడినవి. ఎస్సీ విద్యార్థిని/విద్యార్ధులు ఈనెల 15 నుండి వచ్చేనెల 6 లోపు దరఖాస్తు చేసుకొనగలరు. జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఈ. ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లిలో జిల్లాలో గల బెస్ట్ అవైలబల్ స్కూల్స్ 1. ఆదర్శ హై స్కూల్ ఇ/మీ గారెపల్లి కాటారం (డే & రెసిడెన్సియల్), 2. వివేకానంద హై స్కూల్ ఇ/మీ గారెపల్లి కాటారం (డే & రెసిడెన్సియల్), 3. సెయింట్ పీటర్ హై స్కూల్ ఇ/మీ భూపాలపల్లి (డే స్కాలర్) 4. సువిద్య హై స్కూల్ ఇ/మీ గారెపల్లి కాటారం (డి & రెసిడెన్సియల్). అర్హతలు: 1. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.1,50,000/- లు పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2,00,000/- లకు మించరాదు.1. పుట్టిన తేది ద్రువికరణ పత్రము (మున్సిపల్ కార్పోరేషన్/ మున్సిపల్ బోర్డు/తాసిల్దార్ గారి మీ-సేవా ద్వారా జారీ చేయబడినది ). 2. 1వ తరగతికి విద్యార్థులు తేది: 01.06.2020 నుండి 31.05.2021 మధ్య జన్మించి ఉండవలెను. 3.5వ తరగతికి విద్యార్ధులు లకు 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్ జతచేయవలను. 4. రేషన్ కార్డ్ / ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. 5. కుల ద్రువికరణ పత్రము, ఆదాయ ద్రువికరణ పత్రము నివాస ద్రువికరణ పత్రము (మీ-సేవా ద్వారా జారీ చేయబడిన. 6. (2) పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు. 7. పాఠశాల నుండి గత సంవత్సర మార్కుల జాబిత జిరాక్స్ కాపీ. ఆసక్తి గల ఎస్సీ విద్యార్థిని/విద్యార్థులు పారాలు జిల్లా కలెక్టర్ లో షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈనెల 15 తారీకు నుండి వచ్చేనెల 6 తారీకు లోపు దరఖాస్తులను ఇవ్వగలరు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఈ. ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు

స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి

ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి.

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

తూర్పు తెలంగాణా జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు

సూర్యాపేట, నేటి ధాత్రి:

నుంచి స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పు తెలంగాణా ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానా యాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తమతమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు,గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి, అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపెతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్ధానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు. సదస్సులో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. జిల్లాలోని గ్రామాలను మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం రావడమే అసలైన లక్ష్యమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రతి గ్రామం, మున్సిపాలిటీని ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం ద్వారా గ్రామాలు బలోపేతం అవుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్థానికంగా ఆదాయం పెరిగేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు నిధులు అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్నులు కట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నగర మేయర్లు, ఛైర్పర్సన్ లు, ఎక్స్ ఎం.పి.టి.సి.లు, ఎక్స్ జడ్.పి.టి.సి లు సర్పంచులు, మునిసిపల్ కమీషనర్ లు, డిపిఓ లు, ఎంపిడిఓ లు, ఎన్జిఓస్, సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, నల్గొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,సూర్యాపేట జెడ్పీ సీ.ఈ.ఓ డి. శిరీష, నల్గొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డిఎంహెచ్వో వెంకటరమణ డీఎల్పీఓలు, ఎంపీఓలు, ఎంఈఓ లు గ్రామపంచాయతి కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు త్వరలో మెడికల్ బోర్డు

త్వరలో సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహణ

అన్ ఫిట్ కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికుల అన్ని సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పలు సమస్యలు సింగరేణిలో పెండింగ్లో ఉన్నాయన్నాయని,వాటి పరిష్కారానికి యాజమాన్యం ఇటీవల హామీ ఇచ్చినట్లు తెలిపారు.త్వరలో మెడికల్ బోర్డు ఏర్పాటవుతుందన్నారు. అండర్ గ్రౌండ్ అలవెన్సులను కట్ చేయవద్దని తాము చెప్పామన్నారు. ఆస్పత్రి బిల్లులకు అదనంగా వేతనం నుంచి కోత విధించరాదని పూర్తిగా మీనాయించాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు.పెండింగ్లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు ఉద్యోగాలు నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. వెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు, సిబిఎస్ విద్యా విధానం,
డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తారన్నారు. మారుపేరు సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆస్పత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. ఓవర్మెన్లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తున్నట్లు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికుల సొంత ఇంటి కల, అన్ఫిట్ అయిన మైనింగ్, ట్రేడ్స్ మెన్ లకు సూటబుల్ జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇతర కార్మిక సంఘాలు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా ఉన్న ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఆరోపించడం సరైంది కాదని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం బస్సు జాత నిర్వహించి ప్రతిపక్ష సంఘాల కంటే మేమే ప్రభుత్వంపై పోరాడమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కార్మిక సమస్యల పరిష్కారానికై అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శిలు జి శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి లైబ్రరీలో విద్యా వారోత్సవాలు

భూపాలపల్లి లైబ్రరీలో ఘనంగా విద్యా వారోత్సవాలు

మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకు వచ్చిందన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రంథాలయంలోని పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు, యువత పుస్తక పఠన అలవాట్లను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. స్థానిక గ్రంథాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపాలిటీ తరుపున తనవంతు సహాయం సహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని, అవి జ్ఞాన వికాసానికి ప్రధాన కేంద్రాలని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. పాఠకులు, యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం లైబ్రరీలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పుస్తకాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రంథాలయంలో బెస్ట్ పాఠకురాలును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి ముద్దమల్ల రాజేందర్, కౌన్సిలర్లు బొడ్డు అశోక్, రాధ, నాయకులు చల్లూరి సమ్మయ్య, చల్లూరి మధు, వివిధ సంఘాల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వర్షకొండలో ఘనంగా బడిబాట కార్యక్రమం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా నేడు జడ్పిహెచ్ఎస్ వర్షకొండ లో

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ పాఠశాల లోబడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గ్రామంలో ర్యాలీగా వాడవాడనా తిరుగుతూ బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేంద్ర అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ ఫోనుకంటి వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరైనా ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 2026 ఫలితాలను గూర్చి ఉపాధ్యాయుడు వివరించారు సమావేశంలో. అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎస్సి లో 2026 లో 542 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన బోబిలి .హాసిని,534 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన మద్దెనపల్లి వైష్ణవి లను గ్రామ సర్పంచి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం శాలువాలతో సత్కరించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ ని కూడా శాలువాతో సత్కరించారు. రానున్న విద్యా సంవత్సరంలో అధికంగా విద్యార్థులు నమోదు చేయిస్తామని ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మరియు ఇ వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయ భాస్కర్, శివ కృష్ణ, మమత, మాధురి, సుజాత, స్వామి, మహేష్, మల్లికార్జున్, నరేందర్ గారు పాల్గొన్నారు. వీరితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇంటర్ విద్య వారోత్సవాల్లో గ్రంథాలయ దినోత్సవం

ప్రజా పాలన ప్రగతి ప్రణా ళిక ఇంటర్ విద్య వారోత్స వాలు

శాయంపేట నేటిధాత్రి:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఇంటర్ విద్య వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గ్రంథా లయ దినోత్సవం ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వ హించడం జరిగింది. పుస్తక ప్రదర్శన మరియు పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరి గింది.

ఆధునికకాలంలో సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియో గించి డిజిటల్ లైబ్రరీ సౌకర్యం వినియోగం గురించి స్థానిక శాఖ గ్రంథాలయం గ్రంథ పాల కులు ఇంగిలి సుధాకర్ వివ రించడం జరిగింది. తదుపరి స్థానిక బ్రాంచ్ లైబ్రరీయన్ ఇంగిలి సుధాకర్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు, పుస్తక పఠన ప్రోత్సాహకులు గిద్దమారి సురేష్, కందగట్ల గోపాల్ ప్రిన్సిపాల్ కందగట్లకోటేష్ పాల్గొన్నారు.

ఆకుల జనార్దన్ సేవలకు ఘన నివాళి

సీపీఎం నేత ఆకుల జనార్దన్ సేవలు మరువలేనివి

ఘనంగా ఆకుల జనార్దన్ 18వ వర్ధంతి వేడుకలు

గీసుగొండ,నేటిధాత్రి:

నిత్యం ప్రజా సమస్యల లక్ష్యంగా పనిచేసిన సిపిఎం పార్టీ నేత దివంగత ఆకుల జనార్దన్ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల నేతలు అన్నారు.గీసుగొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో సీపీఎం నాయకుడు ఆకుల జనార్దన్ 18వ వర్ధంతిని నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆకుల జనార్దన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గీసుగొండ మండల మాజీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దాడి శివ, గంగాదేవిపల్లి సర్పంచ్ కూసం స్వరూప రమేష్, మాజీ సర్పంచ్ ఆకుల స్రవంతి, రుద్ర ప్రసాద్, కుటుంబ సభ్యులు, కుమార్తెలు, కోడలు తదితరులు పాల్గొన్నారు.

నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి: టీజేఎస్

*మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితున్ని అరెస్టు చేయాలి:

సీనియర్ అడ్వకేట్ టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్

నర్సంపేట, నేటిధాత్రి:

మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం నర్సంపేటలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, దేశభక్తి, దైవభక్తి, మహిళలపై గౌరవం గురించి బహిరంగ సభలు, ప్రెస్ మీట్‌లలో గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులకు బండి సాయి భగీరథ దుర్మార్గం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని మైనర్ బాలికలను వేధించే క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌరవం ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేతిలో అధికారం ఉన్నంతవరకు బాధిత బాలికకు న్యాయం జరగదని అన్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైన రోజు మైనర్ కాబట్టి ఇది సెక్షన్ 65(2) బీఎన్ఎస్, సెక్షన్ 6 పోక్సో చట్టం కింద నేరం అవుతుందని స్పష్టం చేశారు.బాధితురాలి ప్రస్తుత వయస్సు కాకుండా నేరం జరిగిన రోజు వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఈ కేసులో కోర్టు, రాష్ట్ర పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. సాధారణ ప్రజలపై ఇలాంటి కేసులు ఉంటే ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేసే ప్రభుత్వం బండి సాయి భగీరథ కేసులో మాత్రం అరెస్టు చేయడం లేదని ఆరోపించారు.బండి సంజయ్ కుమార్‌కు మహిళలపై గౌరవం ఉంటే తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈప్రెస్ మీట్‌లో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.

పంట అవశేషాల నిర్వహణపై రైతులకు అవగాహన

పంట అవశేషాల నిర్వ హణ పై అవగాహన

పర్యావరణాన్ని,సారవంతం కాపాడండి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం హుస్సే న్ పల్లి గ్రామంలో రైతు ముంగి ట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంట అవ శేషాల నిర్వహణ, నేల సార సంరక్షణ, పర్యావరణ పరి రక్షణపై అవగాహన కల్పిం చారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ డా. బి. విద్యాధర్ ,మండల వ్యవ సాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న పంటల కోతల అనంతరం రైతులు పంట అవశేషాలను తగులబెట్ట కుండా, వాటిని నేలలో కలిపి భూమి సారాన్ని పెంచుకోవా లని సూచించారు.పంట అవ శేషాలను కాల్చడం వల్ల నేల లోని సేంద్రియ కార్బ న్ తగ్గిపో వడం, సూక్ష్మజీవుల నష్టం, పోషకాల హ్రాసం జరుగుతుం దని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి ముఖ్య పోష కాలు నష్టపోతాయని వివరిం చారు.పంట అవశేషాలను త్వరగా కుళ్లించేందుకు ఎస్ ఎస్ పి యూరియా పద్ధతి, పూసా డీకంపోజర్, ఎన్ సి ఓ ఎఫ్ ఘాజియాబాద్ వేస్ట్ డీకం పోజర్ మరియు ట్రైకోడెర్మా వంటి జీవ డీకంపోజర్ల విని యోగంపై రైతులకు ప్రయోగిక సూచన లు అందించారు.డా బి.సిద్ధార్థ్ నాయక్, టీచింగ్ అసోసియేట్ మాట్లాడుతూ రైతులు పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నివా రించి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించా లని కోరారు. ఏఈఓ జ్యోత్స్న కూడా రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సాంకేతిక సహాయంపై వివరిం చారు.ప్రజ్వల్ ఎన్‌జీఓ ఫీల్డ్ ఆఫీసర్ భానుమతి గ్రామ స్థాయిలో రైతులకు నిరంతర మార్గదర్శకత్వం అందిస్తు న్నట్లు తెలిపారు. గ్రామ సర్పం చ్ సుధాకర్ రావు రైతులు శాస్త్రవేత్తల సూచన లను ఆచరణలో పెట్టి గ్రామాన్ని ఆదర్శ వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చా రు.ఈ కార్యక్రమంలో రైతులు, వరంగల్ వ్యవసాయ కళాశా ల విద్యార్థులు నవ్య, శైలు పాల్గొన్నారు

నర్సంపేట డిగ్రీ కళాశాలలో జ్ఞానోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మన గ్రంథాలయం – జ్ఞానోత్సవం

పోటీ పరీక్షల సెల్‌కు రూ.50 వేల పుస్తకాలు, రీడింగ్ చైర్స్ అందజేసిన డాక్టర్ రవీందర్ చౌకిదార్

నర్సంపేట, నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేటలో ‘మన గ్రంథాలయం-జ్ఞానోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన, గ్రంథపాలకుడు ఆర్.గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మహబూబాబాద్ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.రవీందర్ చౌకిదార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌కు రూ.50 వేల విలువైన పుస్తకాలు, రీడింగ్ చైర్స్ అందజేసి విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహకారం అందించారు.

గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయగా విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థిని హర్షిని రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని బెస్ట్ రీడర్‌గా నిలిచిన బెత్తం అఖిలను సన్మానించారు.ప్రిన్సిపల్ మల్లం నవీన్ మాట్లాడుతూ గ్రంథాలయం విద్యార్థుల జ్ఞానానికి నిలయమని, పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పుస్తకాలతో స్నేహం అవసరమన్నారు.ముఖ్య అతిథి డాక్టర్ రవీందర్ చౌకిదార్ మాట్లాడుతూ పుస్తకాలు మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప మిత్రులని, చదివే అలవాటు ఉన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలని సూచించారు. భవిష్యత్తులో కళాశాల గ్రంథాలయ అభివృద్ధికి, పోటీ పరీక్షల పుస్తకాలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.
అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. కందాల సత్యనారాయణ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కోఆర్డినేటర్ ఎస్.కమలాకర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ లావణ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి

ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి.

సిపిఐ నేతలు రమేష్ వెంకటయ్య

వనపర్తి నేటిధాత్రి

 

పశ్చిమ ఆసియా యుద్ధం జరుగడం వల్ల చమురు ధరలు పెరగడం తో రైతులకు నష్ట పోతున్నారని
రైతుల సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
బిజెపి కేంద్ర ప్రభుత్వం 14 పంటల ధరలను పెంచడం జరిగిందని
ఆహార పంటలు పప్పు దినుసులు, నూనె గింజలు వాణిజ్య పంటల ధరలను అరకొరగా ధరలు పెంచి మేము రైతులను రైతుల ఆదాయం పెంచినామని చెప్పు కుంటున్నారని వారు అన్నారు ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులు అమలు జరిగే వరకు ఉద్యమిం చాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో గోపాల్ లక్ష్మీనారాయణ నర్సింహ తదితరులు పాల్గొన్నారని రమేష్ తెలిపారు

ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి: ఎంసిపిఐ(యు)

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించాలి

మోడీ ప్రభుత్వ విధానాలతో ప్రజలపై పెరిగిన భారం

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట, నేటిధాత్రి:

కేంద్ర మోడీ ప్రభుత్వ వినాశనకర విధానాలతో ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.మంగళవారం నర్సంపేట పార్టీ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొదుపు చర్యలు పాటించాలని చెప్తూనే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. నల్లధనం వెలికి తీస్తామని, పేదలకు రూ.15 లక్షలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలుకుతూ ప్రపంచ అశాంతికి కారణమవుతున్నారని, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ధరల పెంపుతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి 70 శాతం మంది ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితికి చేరుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు, వంగల రాగసుధ, కొత్తకొండ రాజమౌళి, సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం, కలగొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సాంబలక్ష్మికి రమేష్ గౌడ్ నివాళులు

గంప సాంబలక్ష్మికి మోకుదెబ్బ రమేష్ గౌడ్ నివాళులు

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని గంప రాజేశ్వర్ గౌడ్ సతీమణి సాంబలక్ష్మి దశదిన ఖర్మ కార్యక్రమం గురువారం పద్మశాలి ఫంక్షన్ హల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై సాంబలక్ష్మి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం రమేష్ గౌడ్ సాంబలక్ష్మి భర్త రాజేశ్వర్ గౌడ్ కుమారులు రవీందర్ నాద్ గౌడ్, రఘునాద్ గౌడ్,కృష్ణమూర్తి గౌడ్ లను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి కొండి రాము గౌడ్,చెన్నారావుపేట మండలం మోకుదెబ్బ అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్,జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్,గౌడ్,నర్సంపేట మోకుదెబ్బ మండల అధ్యక్షులు జనగాం మల్లికార్జున్ గౌడ్,కృష్ణమూర్తి గౌడ్,తండ వెంకన్న గౌడ్,రవితేజ గౌడ్,గౌడ్,బొమ్మగాని శ్యాం కుమార్ గౌడ్,బోడిగే శ్రీ కాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

585 మార్కులతో మెరిసిన మరియా జీనత్

తెలంగాణ రాష్ట్ర ములో 10 వతరగతిలో 585 మార్కులు సాధించిన

పేద విద్యార్థిని సన్మానించిన
మాజీ మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ సతీష్

వనపర్తి నేటిధాత్రి

వనపర్తి జిల్లా కేంద్రనికి చెందిన పేద మైనార్టీ కుటుంబం
మొహమ్మద్ కూతురు మరియా జీనత్ 10 వ తరగతి పరిక్షలలో 585 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్ర ములో టాప్ ర్ గా అత్యధిక మార్కులు వచ్చిన సందర్భంగా వారి నివాసంలో విద్యార్ధి కి సన్మానము మాజి మున్సిపల్ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ చెప్పారు పేద మైనారిటీ కుటుంబానికి చెందిన విద్యార్థిని తెలంగాణ టాప్ లో నిలబడడం వనపర్తికి గర్వకారణమని అన్నారు పేద విద్యార్థులు10వతరగతి ఇంటర్ పాలిసెట్ లో విద్యార్థులవివరాలుమాదృష్టికి తీసుకురావాలని వారికి సన్మానం చేస్తామని సతీష్ తెలిపారు ఈకార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారని ఆయన చెప్పారు

మల్లక్కపేటలో ఎంపిడిఓ పర్యటన

మల్లక్కపేట గ్రామాన్ని సందర్శించిన ఇంచార్జ్ ఎంపిడిఓ రామకృష్ణ

పారిశుద్ధ్యం పాటించాలి, ఉపాధి హామీ పనులకు తప్పక హాజరుకావాలి

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామాన్ని శుక్రవారం ఇంచార్జ్ ఎంపిడిఓ రామకృష్ణ సందర్శించారు.గ్రామంలోని పలు కాలనీలు,ప్రధాన వీధులు,పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామ సమస్యలు,అభివృద్ధి పనులపై ఆరా తీశారు.గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల అమలు,ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల గురించి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఇంటి పరిసరాలు,రహదారులు,కాలనీలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని తెలిపారు.

చెత్తను రోడ్లపై వేయకుండా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.అలాగే ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పనులకు గ్రామ ప్రజలు తప్పనిసరిగా హాజరై ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.గ్రామ అభివృద్ధితో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు,డ్రైనేజీ,రహదారులు, విద్యుత్,పారిశుద్ధ్యం తదితర సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.ఇటీవల నిర్వహిస్తున్న సెన్సెస్ కార్యక్రమంపై కూడా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన ఆయన ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి అధికారులకు సహకరించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు జనగణన వివరాలు కీలకమని తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు,గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు,పంచాయతీ కార్యదర్శి సుమలత,కారోబార్ అనందరావు,గ్రామస్థులు పాల్గొన్నారు.

నీట్ పేపర్ లీక్‌పై యువజన కాంగ్రెస్ ఆందోళన

నీట్ పేపర్ లీక్ పై యువజన కాంగ్రెస్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

నీట్ పేపర్ లీక్ ఫై జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని యువజన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ మాట్లాడుతూ
“గత 10 సంవత్సరాల్లో వరుసగా(89సార్లు )జరుగుతున్న పేపర్ లీక్‌లు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని …
విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలు, యువత భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని…
దేశంలో చదువుకునే విద్యార్థులకు భద్రత ఇవ్వలేని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

ఎన్ టిఏ స్వయంగా పేపర్ లీక్ జరిగినట్లు అంగీకరించి పరీక్షను రద్దు చేయడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చ అని అన్నారు….
పేపర్ లీక్ మాఫియాకు అండగా నిలుస్తున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచుల మహేశ్, రేగొండ మండల అధ్యక్షులు కోయిలా క్రాంతి చిట్యాల మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు సాదు నాగరాజు టేకుమట్ల మండల అధ్యక్షులు కొలుగూరి అనిల్ మొగుళ్ళపల్లి మండల ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు, బోయినీ మధుకర్,బొమ్మ కిరణ్, పున్నం ప్రవీణ్,కీర్తి రాజు, మేకల శివ,మహేశ్ , గట్టు కుమార్,నాగరాజు, నరేందర్ రెడ్డి, సుమన్, రాజకుమార్, సురేష్, శ్రీను, హరీష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు

సికెఎంలో ఘనంగా గ్రంథాలయ జ్ఞానోత్సవం

సికెఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం”

వరంగల్, నేటిధాత్రి.

సి.కె.యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం మరియు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయపాల్ రెడ్డి, బిల్లాల శివుడు రచించిన పుస్తకాలను ఆవిష్కరించి వారిని ఘనంగా సన్మానించారు. అలాగే ఉత్తమ గ్రంథాలయ వినియోగదారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

గ్రంథాలయ సేవల విశిష్టతను తెలియజేసే విధంగా ప్రత్యేక బ్యానర్, పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పోటీ పరీక్షల కోసం కూడా గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలు, ఈ-వనరులు విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

అమెరికాకు చెందిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్‌జీఓ ద్వారా గ్రంథాలయానికి రూ.10 వేల విలువైన పుస్తకాలను అందించేందుకు మేనేజర్ గొల్లపల్లి రత్నాకర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రంథపాలకులు ఎస్. అనిల్ కుమార్‌ను ప్రిన్సిపాల్ అభినందించారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ కె.ఎల్.వి. వరప్రసాద్ రావు, డాక్టర్ బి. విజయపాల్ రెడ్డి, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ సతీష్ కుమార్, అయేషా, ఎస్. వెంకటేశ్వర్లు, బిల్లాల శివుడు, ఏ. హరిబాబు, స్రవంతి, సుమన్, అంజయ్య, రాజేష్, నాగరాజు, కళాశాల సూపరింటెండెంట్ జి. శ్రీనివాస్, గ్యానేశ్వర్, పాషా, జమున, సరిత, సురేష్, రామరాజు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version