ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు,…

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం…

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

టీటీడబ్ల్యఆర్ఎస్ పూర్వ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

 

 

 

వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version