జాతీయ ఉపాధి హామీ పథకం విలీన గ్రామాలకు అవకాశం కల్పించాలి
ఎంపీ కి వినతిపత్రం ఇచ్చిన మాజీ ఉపసర్పంచ్ ఉమ్మల్ల వనపర్తి నేటిదాత్రి .
జాతీయ ఉపాధి హామీ పథకం పథకం విలీన గ్రామాలు శ్రీనివాసపురం రాజనగరం నాగవరం నర్సింగాయపల్లి ఇతర గ్రామాలు వనపర్తి మున్సిపాలిటీలో విలీనమైనయని శ్రీనివాసపూర్ మాజీ ఉపసర్పంచ్ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాజీ కార్యదర్శి వనపర్తి లో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు ర వి ని కలిసి ఉమ్మల్ల రాములు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం విలీన గ్రామాల పేద ప్రజలకు అవకాశం కల్పించాలని ఎంపీని కోరారు గ్రామాల్లో పేద ప్రజలు రోజు కూలీలు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే విలీన గ్రామాల ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వర్తింపచేయాలని ఎంపీని కోరారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి విలీన గ్రామాల జాతీయ ఉపాధి హామీ పథకం గురించి పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని ఉమ్మల్ల రాములు పేర్కొన్నారు
గ్రామాలలో ప్రధాన సమస్యగా మారుతున్న మద్యం దుకణాలు అర్ధరాత్రి వరకు అదుబాటులో మద్యం
పరకాల,నేటిధాత్రి
మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలు రోజురోజుకు విస్తరిస్తూ సామాజిక సమస్యగా మారుతున్నాయి.అధికారిక మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ,వాటిని పక్కనబెట్టి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండటం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.నియమ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇళ్లలోనే మద్యం నిల్వచేసి విక్రయాలు నిర్వహిస్తూ సులభంగా డబ్బు సంపాదనకు పాల్పడుతున్నారు.ప్రత్యేకంగా సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి వరకు ఈ బెల్ట్ షాపులు రద్దీగా కొనసాగుతున్నాయి.గ్రామాల్లో పని ముగించుకున్న తరువాత చాలా మంది ఈ ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మారింది.యువత ఈ అలవాటుకు బానిసలవుతుండటంతో వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల్లో కలహాలు,ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి.కొందరు కుటుంబాలు అప్పుల బారిన పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.మహిళలు,వృద్ధులు ఈ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి శాంతి భంగం చెంది కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.దీంతో సాధారణ ప్రజలు,ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామ శాంతిభద్రతలకు ఈ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయి.ఇలా గల్లీ గల్లీకి విస్తరిస్తున్న బెల్ట్ షాపులు గ్రామ జీవన విధానాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయి.సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం క్షీణించడంతో పాటు,యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పరకాల మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించి, బెల్ట్ షాపుల పెరుగుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ ప్రజలు రైతులు రైతు కూలీలు ఈ సంవత్సరం వ్యవసాయం ఆశించినంతగా దిగుబడి రాకపోవడంతో గ్రామస్తులు పల్లెలు విడిచి హైదరాబాద్ లాంటి నగరాలకు పనుల కోసం వలస వెళ్లవలసిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు గత డిసెంబర్ నెలలో ప్రతి మిర్చి పనులు అయిపోవడంతోను ఏటువంటి కూలి పనులు దొరకక గ్రామ ప్రజలు 100 రోజుల ఉపాధి హామీ పనులు కోసం పై అధికారులను సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇదివరకే ఉన్న ఉపాధి హామీ పనుల పాత పాస్ పుస్తకాలు పనిచేయడం లేదు కొంతమంది మాత్రమే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. మిగతా వారికి లిస్టులో మీ పేరు లేదు అని కొత్త ఉపాధి పుస్తకాలు తీసుకొని పనిలోకి రావాలని సలహా ఇస్తున్నారు. దయచేసి ఈ విషయమై పై అధికారులు స్పందించి ఉపాధి హామీ కొత్త పుస్తకాలు మంజూరు చేసి మాకు ఉపాధిహమి పనులు కల్పించి ఆదుకోవాలని రైతులు రైతులు రైతుకూలీలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న. తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.
ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,
ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.
మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.
కుటుంబాల్లో గొడవలు
ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.
రూ.10 మిస్తీకి తెస్తున్నరు
ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది
అవగాహనతో అడ్డుకట్ట
గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు
యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.
రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కొత్త కోట మండలం రామన్ పాడు గ్రామములో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సర్పంచ్ అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించారు గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు ఆడుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించి టాస్ ఎగర వేసారు ఈ సందర్భంగా సర్పంచ్ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు మానసిక ప్రశాంతతనం ఏకాగ్రతను ఇస్తూ శారీరక దృఢత్వని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ యువకులు పాల్గొన్నారు
మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ పథకం” లో బాగంగా నర్సరీ చెట్ల పెంపకం ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ఉపసర్పంచ్ మంగళి దత్తు, వార్డు సభ్యులు వై నగేష్, చింతలగట్టు ప్రకాష్,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, మరియు గ్రామం పెద్దలు మంగలి మొగులయ్య, వీరన్న పాటిల్, ఎర్రోల కిష్టన్న, డప్పూర్ హరి, సి సుకుమార్,తలారి నర్సిమ్లు,మరియు మహిళలు పాల్గోని చెట్ల పెంపకం ఫారం నీ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు…
గ్రామానికి గొల్ల కురుమ సంఘం సభ్యులు సీసీ కెమెరా ను అందజేశారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన సంఘం సభ్యులు సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ కు సీసీ కెమెరా ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి దొంగతనాలు, గొడవలు జరిగిన సిసి కెమెరా ఆధారంగా పసిగట్టవచ్చన్నారు. అలాగే మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి సహాయ పడవలసిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
మల్లాపూర్ మండల ఉపసర్పంచ్ ఫోరంల ఎన్నికలు మల్లాపూర్ మండల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షులుగా గడ్డం సామారెడ్డి. ఉపాధ్యక్షులుగా బాలసాని ప్రణయ్. ప్రధాన కార్యదర్శి బాణావత్ శ్రీనివాస్, కోశాధికారి రొడ్డ హారిక రాజు, కార్యదర్శి వంగ పోతయ్య, కార్యదర్శి తోట రాజ్ కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగిందని ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గడ్డం సామారెడ్డి తెలిపారు.
◆-: తుమనపల్లి గ్రామన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన
◆-: లక్ష్యమని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ స్పష్టం చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం,తుమనపల్లి గ్రామంలో, వార్డు సభ్యులతో మాట్లడుతూ, ఈ కొత్త సంవత్సరంలో వార్డు వార్డు తిరుగుతూ ఆయా వార్డుల పరిధిలో ఉన్న పలు కీలక సమస్య పనులకు గడప గడపకు తిరిగి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పనులు పనులను పూర్తి చేస్తామని గ్రామంలో తను ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రత్యేక అభివృధి కార్యక్రమలు చేపట్టనున్నట్లు గ్రామ సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ పేర్కోన్నారు. అలాగే త్వరలో వచ్చే15వ ఆర్థిక సంఘం పంచాయతీ బడ్జెట్ నుండి ప్రత్యేక అభివృద్ధి పనులను గ్రామంలో ప్రారంభించ నున్నారు. గ్రామంలో పలు పనులను పరిశీలించి, నాణ్యతతో కూడిన పనులను చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శి వేగంగా పూర్తి చేయాలని అధికారిని ఆదేశించనున్నారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి ఆధునిక వసతులు కల్పించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ఉన్నత పాఠశాల, కొత్త భవనాలు, టాయిలెట్స్, క్రీడా ప్రాంగణాలు, అదనపు తరగతి గదులు మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు. గ్రామంలో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలుగులోకి కోసం ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో సేవలు అందించాలని చూస్తున్నారు. గ్రామంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పంచాయితీ భవనానికి పేయింటింగ్, అలాగే కబరస్థాన్ మరియు హిందూ శ్మశాన వాటిక నిర్మాణాలకు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కట్టుబడి ఉన్నానని గ్రామ సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ స్పష్టం చేశారు.
శుక్రవారం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం బడం పేట నూతన సర్పంచ్ దయానంద్ పాటిల్ను పలువురు ప్రముఖ నాయకులు ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆయన విజయవంతంగా కృషి చేయాలని నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులచే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నూతన పాలక వర్గంచే మండలంలోని గ్రామాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ నడికూడ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల,ఉప సర్పంచ్ ల వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది. నూతన సర్పంచులగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకతీతంగా ముందుకు సాగి గ్రామాలను అభివృద్ధి పరుస్తామని హామీలు ఇచ్చారు.ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయా గ్రామాల్లో జన సందోహం పండగ వాతావరణం ఏర్పడగా ఈ సమావేశంలో హామీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, సర్వాపురం గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,ధర్మారం గ్రామ సర్పంచ్ భాషిక ఎల్ల స్వామి, కంఠాత్మకూరు గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, రామకృష్ణాపూర్ సర్పంచ్ పెండ్లి లక్ష్మి,నర్సక్కపల్లె గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు, పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్,ముస్తాలపల్లి గ్రామ సర్పంచ్ మాకమల్ల వెంకటేష్, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,వరి కోలు గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,వెంకటేశ్వర్ల పల్లె గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పహల్గాం దాడి కేసు.. నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్ఐఏ
https://youtu.be/FNA9Z2jcGNY?si=-UHZrjOyg8jxN1q8
పహల్గాం దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ కాసేపట్లో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో అధికారులు ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేడు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు చార్జ్‌షీటును దాఖలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే (NIA Charge Sheet).ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే బాట్‌కోట్‌కు చెందిన పర్వెయిజ్ అహ్మద్ జోథార్, బషీర్ అహ్మద్ జోథార్‌లను అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా వారు ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. వీరికి సంబంధించి అనేక ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. పహల్గాం దాడిలో పాలుపంచుకున్న ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను నిందితులు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పర్వెయిజ్, బషీర్‌లు.. ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వారికి ఆహారం, నివాసంతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఉపా చట్టం సెక్షన్ 19 కింద ఎన్‌ఐఏ నిందితులను అరెస్టు చేసింది.
గణపురం మేజర్ గ్రామపంచాయతీ నూతన గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి శ్రీ కటుకూరి రాధిక శ్రీనివాస్ లను ఆదివారం రోజున గణపురం గ్రామ మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి, పూల కుండీ నీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపురం మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బోట్ల శ్రీనివాస్ పటేల్ మండల అధ్యక్షుడు పుప్పాల దీపక్ పటేల్, సంఘం సభ్యులు ఆవుల రవి కిరణ్ పటేల్, చెలుమల్ల డా.సంపత్ పటేల్, కోవ్వూరి శ్రీనివాస్ పటేల్,చెరుకు నర్సింగం పటేల్, సిరంగి రాజేశ్వరరావు పటేల్, సిరంగి సుదయ్య పటేల్ ,తోట రవి పటేల్, కొవ్వూరు మహేందర్ పటేల్, బోట్ల రాజు పటేల్, విడిదినేని శంకర్ పటేల్ తోట నవీన్ కుమార్ పటేల్, సుంకరి రమేష్ పటేల్ పత్తేం రాజు పటేల్ పత్తేం ప్రభాకర్ పటేల్ పత్తేం శివ పటేల్, పత్తేం రవి పటేల్ సిరంగి భద్రయ్య పటేల్ మిడిపెల్లి బాబురావు పటేల్ దేవ గణేష్ పటేల్ చింతనిప్పుల సంపత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బుద్ధారం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ విడిదినేని కవిత అశోక్ పటేల్ పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కలతప్పుతున్న బతుకమ్మ వేడుకలు..
గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మకు ప్రత్యేక శ్రద్ధ
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.అసమర్థత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వలన నిధులు లేని గ్రామాలు కలతప్పాయన్నారు.పారిశుధ్యం లోపించిన పల్లెలు అధోగతి పాలవుతునాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.సద్దుల బతుకమ్మ,సదరా పండుగల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణ సజావుగా జరిగేందుకు తమ వంతు సహాయంగా సహకరించాలని బిఆర్ఎస్ శ్రేణులకు,మాజీ ప్రజా ప్రతినిధులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సరిపడ నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించలేదని ఆరోపించారు.గ్రామాలలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో పంచాయితీ అధికారులు గ్రామాల్లోని ప్రజలతో చందాలు తీసుకొని పండగా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన గ్రామపంచాయతీల అధికారులు అప్పులు తెచ్చి గ్రామాలలో పారిశుధ్య పనులు చేస్తున్నారని మరికొన్ని గ్రామాల్లో డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య ట్రాక్టర్లను నడపడంలేదు.బ్లీచింగ్ పౌడర్,ఫాగింగ్ వీధిలైట్ల మరమ్మత్తులు పట్ల పట్టించుకునే వారేలేరని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.గ్రామ పంచాయితీలలో నిధులు లేక పారిశుధ్యం లోపించి కళతప్పడం ఒకవైపు ఐతే మరోవైపు బతుకమ్మ దసరా ఉత్సవాలకు చిల్లిగవ్వ లేకపోవడం సందండిత అధికారులు ఆందోళనకు గురవుతున్నారని పెద్ది పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపి బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా నిర్వహించినారని మాజీ ఎమ్మెల్యే పెద్ది తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కళతప్పుతున్న పల్లెల్లో,గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు,జెడ్పిటిసిలు, సర్పంచ్లు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పార్టీ నాయకత్వం.. బతుకమ్మ ఉత్సవాలలో తమవంతు సహాయంగా చురుగ్గా పాల్గొని ఏర్పాట్లు చేసి ఆడపడుచుల ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
ఏండ్లు గడిచిన ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకొని రాఘవరెడ్డిపేట గ్రామం
గ్రామ పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ రాకుండా రాజకీయంగా దగా చేస్తుండ్రు.
దూడపాక శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు ఈసారైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కు గ్రామాన్ని ఎన్నిక చెయ్యాలని దూడపాక శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోలేదని, ఏండ్లు గడిచిన ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం లేదని..? సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? రాజకీయంగా దగాకు గురవ్వడమేనా…? ఎన్నికల్లో పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు తేల్చాలనీ వారు అన్నారు
ఓట్లు వేసే యంత్రాలుగానే కాదు పరిపాలన వ్యవస్థలో భాగమై రాజకీయ పదవుల్లో సైతం అవకాశాలు రావాలని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తే, మేము పుట్టక ముందు నుంచి ఇప్పటివరకు తరతరాలుగా ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదంటే ఎంత అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనరల్ స్థానాలు వచ్చిన పోటీకి వచ్చే వారి కుల, ధన బలాలతో పోటీ పడే స్థాయిలో ఎస్సీ కులాల ప్రజలు లేరని, అందుకు ఈసారైనా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తేల్చే అధికారులు తక్షణమే స్పందించి ఎండ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా అణిచివేతలే ఎదురైతే అభివృద్ధిలో కూడా అన్యాయమే జరుగుతుందని, వచ్చే నిధుల కానీ, సంక్షేమ అవకాశాలు మా వర్గాల ప్రజలకు అందకుండా పోతున్నాయని, మనల్ని గుర్తించే పరిస్థితే కనబడటం లేదని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ ఆర్డీవో పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా మా గ్రామానికి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
సంసారం సాగరం అన్నారు. సంద్రంలో ఈదాలంటే గజ ఈతగాళ్లకే తరం కాదు… మరి అప్పుడే ఈత నేర్చుకున్న వారిని ఆ సంద్రంలో పడేస్తే ఒడ్డుకు చేరగలరా..? బాలల పరిస్థితి అలాగే ఉంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి పేరుతో సంసారమనే సాగరంలో పడేస్తున్న తల్లిదండ్రుల తీరు ఎందరి జీవితాలకో బంధనంగా మారుతోంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కూతురుకు మూడుముళ్లు వేయిస్తే భారం తగ్గిపోతుందని కొందరు.. ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా అని పెళ్లీడు రాకున్నా పనైపోతుందని మరికొందరు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. సమాజం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా చదువును ఆపేసి బాల్య వివాహాలకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. బాల్య వివాహమంటే ముక్కుపచ్చలారని చిన్నారుల భవితకు సంకెళ్లు వేయడమే. ఇలాంటివి సమాచారం వస్తే తప్ప అధికారులు స్పందించి ఆపగలుగుతున్నారే తప్ప ఎవరికి వారు చైతన్యవంతులై వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ దిశగా అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
మారుమూల పల్లెల్లో అధికం
జిల్లాలోని మారు మూల పల్లెల్లో బాల్య వివాహాలకు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముక్యంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నారాయణ్ ఖేడ్, జహిరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలలో అధికారులకు, స్థానికులకు తెలియకుండా గూట్టు చప్పుడు కాకుండా ఇరు వైపులా పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని పక్కింటి వారికి కూడ తెలియకుండా వేరే ప్రాంతాలలో బాల్య వివాహాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఐసిడిఎస్ అధికారులకు సమాచారం తెలిసి పై అధికారులకు తెలిపితే పెళ్లి జరిపించిన ఇరు వర్గాల వారు సదరు వ్యక్తిపై పోట్లాటకు దిగుతున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు.
rising child marriages.
బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు..
బాల్య వివాహాల వల్ల చాలా అనర్దాలు కలుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు తరువాతే శరీర అవయవాలు పూర్తిస్థాయిలో ఎదుగుతాయి. ఈ వయసుకన్నా ముందు వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు బలహీనంగా వుంటారు. వివాహితులైన బాలికలు బీపీ, రక్తహీనతకు గురవుతారు. పిండం ఎదుగుదల సరిగా ఉండదు నెలలు నిండకముందే ప్రవించే అవకాశం వుంది. కొన్నిసార్లు గర్భస్రావం. జరిగే ప్రమాదం కూడా వుంది. శరీర ఎదుగుదల సంపూర్ణంగా లేకపోవడం వల్ల సాధారణ ప్రసవం జరగడం కష్టమవుతుంది. పురిటిలోనే బిడ్డ చనిపోవడానికి అవకాశాలున్నాయి.
వీరంతా నేరస్తులే..
బాల్య వివాహాల నిషేద చట్టం- 2006 ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు, మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరం బాల్య వివాహాన్ని జరిపించేందుకు ప్రయ త్నిస్తే ఇరుపక్షాలకు చెందిన తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లి సంఘాలు వ్యక్తులు, నాయకులను నేరస్తులుగా పరిగణిస్తారు. వీరందరికీ రెండేళ్ల జైలు శిక్షగాని, లక్ష రూపాయల జరిమానాగాని విధించే అవకాశముంది. బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ క్రైమ్ గా పరిగణి స్తారు.
బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తున్నాం
అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికల కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందుల గురించి వివరిస్తున్నాం. శరీరం ఎదగకుండా వివాహం చేసుకుంటే తరువాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్యలు ఎచురవుతాయో తెలుపుతునన్నాం. జీవన నైపుణ్యాలు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అంశాలపైనా చైతన్య పరుస్తున్నాం.
rising child marriages.
ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
బాల్య వివాహలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. చట్టం ప్రకారమే వివాహం చేయాలి. బాల్య వివాహాలు చేసుకున్న వారిలో రక్తహీనత లోపం, శిశుమరణాలు వంటి సమస్యలను చూస్తున్నాం. మరి కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కుంటుంబ నిర్వహణపై కౌమరదశలో పూర్తిగా అవగాహన ఉండదు. దీని కారణంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో తల్లి దండ్రులు బాధ్యతగా వ్యవరించడం మంచిది. బాల్య వివాహాలను అధికారులే కాదు.. స్థానిక ప్రజలు, బంధువులు అడ్డుకోవాలి.
◆:- ఒక్క ప్రత్యేక అధికారి కూడా గ్రామాలలో తిరగని వైనం
◆:- పంచాయతీ కార్యదర్శిలపై ఆర్థిక భారం
◆:- నిధులు, బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శిల పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల జగదేవపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి సొంత డబ్బులతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టిన గ్రామంలో విష జ్వరాలు విజృంభించడం ఇద్దరు అకాల మరణం చెందడం వల్ల పారిశుధ్య లోపం కారణమని చివరికి కార్యదర్శిని అధికారులు సస్పెన్షన్ చేశారు.
Panchayat Funds
1. చెత్త సేకరణ ట్రాక్టర్లతో తిప్పలు…..
పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ చాలా ముఖ్యం. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ తో పాటు వాటి మరమ్మతులు చేపట్టడానికి కార్యదర్శులు సొంతంగా వారానికి రూ. వేయి రూపాయల నుంచి రెండు వేల వరకు వెచ్చిస్తున్నారు. వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ పనులు తాగునీటి వసతి బోర్ల మరమ్మతులు పైప్ లైన్ లీకేజీలు తదితర పనులకు నెలకు పదివేల పైగానే ఖర్చు అవుతున్నాయి. కార్యదర్శులు ఆర్థిక భారంతో సతమతమవు తున్నారు. మొన్న ముగిసిన వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు కూడా అదనంగా భారం పడిందని కార్యదర్శులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటును కూడా అంతంత మాత్రమే. చేపట్టారు.
2. నిధులు రాక… గ్రామాల అభివృద్ధి గాలికి…
గ్రామాల్లో ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 15 ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్ సి నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా, వాణిజ్య పనులను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన తర్వాత విడుదల చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిపిల విద్యుత్ బిల్లులు చెక్కులు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నప్పటికీ జమ కావడం లేదు. ఆర్థిక భారం భరించలేక పలువురు కార్యదర్శులు వసూలైన పన్నుల డబ్బులను ఖర్చులను నిమిత్తం వినియోగిస్తూ బిల్లులు పెట్టుకుంటున్నారు. అందుబాటులో
3. బతుకమ్మకు ఏర్పాట్లు ఏట్లా…
బతుకమ్మ దసరా పండుగకు ఇక మిగిలింది పది రోజులే గ్రామాల్లో బతుకమ్మ కుంటల మరమత్తు పనులు విద్యుత్ దీపాలు అలంకరణ వంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ లో డబ్బులు లేకపోవడం ఇప్పటికే అదనంగా కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకొని వివిధ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ బతుకమ్మ దసరా ఉత్సవాలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని కార్యదర్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతున్నారు.
4. గ్రామాల్లో తిరగలేక పోతున్నాం….
ప్రజల నుండి వచ్చే సమస్యలను తీర్చలేక సొంత డబ్బుల తో, మరియు అప్పులు తెచ్చి చేస్తున్నాం. అతివృష్టి వలన కలిగిన వానలతో డ్రైడే నిర్వహించి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూస్తున్నాం. టాక్టర్ల ద్వారా పిచ్చి మొక్కలను, నీటి నిల్వలను శు భ్రం చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఈ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించగలని కోరుతున్నారు.
గతంలో మారుమూల గ్రామాలకు వేసిన బీటీ రోడ్లు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. పాదైన ఈ రోడ్లకు మరమ్మతులైన చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఆ రోడ్లు ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. అయితే ప్రభుత్వం కొద్ది రోడ్లకు గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నది. ఝరాసంగం మండలంలోని ఝరాసంగం నుంచి సిద్ధాపూర్ నరంపల్లి గ్రామాల మీరు గా న్యాబ్ మండలంలోని మిర్నపూర్ గ్రామం వరకు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుకు న్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై సిమెంట్ పోయి కంకర రోడ్డుగా మారింది. రోడ్డుపై గుంతలు పడడంతో చిన్నపాటి వర్షానికి అవి నిండి ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగిన సంఘట నలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడం లేదు. మరోవైపు సిద్దాపూర్ నుంచి దుర్మాపూర్ వైపు ఉన్న బీటీ రోడ్డుపై గుంతలు పడడంతో ప్రమాదంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్రా లకు చెందిన భక్తులు నిత్యం ఈ రోడ్డు కుండానే ఝరాసంగంలోని కేతకి సంగ మేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిపోతుం టారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు కూడా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. అయినా మర మ్మతులు చేపట్ట కోవడం పట్ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. బర్దీపూర్ నుండి చిలే పల్లి, చిలేపల్లి తండా వైపు ఉన్న బీటీ రోడ్డు దారుణంగా తయారైంది.ఝరాసంగం నుండి బొపాన్ పల్లి,జీర్లపల్లి మీదుగా ముని పల్లి మండలంలోని పెద్ద చెల్మెడ గ్రామం వైపు ఉన్న బీటీ రోడ్డు కూడా గుంతలు పడి గుం తలమయంగా మారింది. బొపాన్ పల్లి నుండి ప్యాలవరం, దేవరంపల్లి వైపుగల బీటి రోడ్డు కూడా ధ్వంసమైంది. ఝరాసంగం నుండి మేదపల్లి, ఈదులపల్లి మీదుగా కోహీర్ మండ లంలోని దిగ్వాల్ వైపు గల బీటీ రోడ్డు అడుగ డుగున గుంతలు పడి ప్రమాదంగా నూరింది. బిడకన్నె నుంచి రాయిపల్లి మధ్య, జాతీయ రహదారి వరకున్న బీటీపై రోడ్డుపై గుంతలు ” పడడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజ లు ఇక్కట్లు పడుతున్నారు. బిడకన్నె నుంచి ” కుప్పానగర్ గ్రామం వైపు ఉన్న మెటల్ – రోడ్డుపై కంకర తేలి గుంతలు పడ్డాయి. ఇక్క ది వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కోహీర్ మందలంలోని కవేలి చౌరస్తా నుండి చిలేమామిడి జీర్ణపల్లి, ఏడాకు లపల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్లు ఛిద్రమై 1 ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతు న్నారు. జాతీయ రహదారి నుంచి ంచి కోహీర్ మండలంలోని దిగ్వాల్,రాజనెల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమై అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.ఈ రోడ్డుపై వాహనాల మాట అటు ఉంచితే కనీసం నడిచి వెళ్లాలన్నా అనువుగా లేదనిఇ ఆయా గ్రామా ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాడైన రోడ్లలకు వెంటనే మర మృతుల పనులు చేపట్టాలని జహీరాబాద్ – నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు.. అధికారులు నిర్లక్ష్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల గిన్నియర్ పల్లి గ్రామంలో వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి కొరత నెలకొంది. బోర్లు పనిచేయకపోయినా, భగీరథ నీటి సరఫరా నెలలో కనీసం రెండుసార్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులే కారణమని అధికారులు చెబుతున్నారని, సమస్యపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
మండలంలోని కౌకొండ గ్రామంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నడికూడ మండలంలోని కౌకొండ గ్రామాలకు వెళ్లే రోడ్డును బీటీ రోడ్డు వేసేందుకు ఇరువైపులా కంకర వేసి రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు ప్రారంభించకపోగా మధ్యలోనే వదిలేశారు. అయితే రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు రోడ్డుపై నిల్వడంతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,దీంతో కౌకొండ గ్రామస్తులు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు రోడ్డుపై వరినట్లు వేస్తూ నిరసన తెలిపారు.బిజెపి, డి.ఎస్.పి,బి ఎస్ పి, నాయకులు చుక్క రత్నాకర్, మేకల నరేష్,ఇనుగాల దిలీప్, చుక్క సూర్యం, మేకల విష్ణు, గోల్కొండ చంటి,రోడ్డును త్వరగా పూర్తి చేయాలని పలు పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.