విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జె ఎన్ యు విద్యార్థి ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది.. అనంతరం ఎన్ ఈపి పై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెమినార్ కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్ అనంతరం వారు సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే లాగా ఉందని వారు అన్నారు.. అనంతరం ఈ యొక్క విధానాన్ని ఈ నిర్ణయాని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా అన్నారు ఈ యొక్క విద్యా విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.. ఏదైతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో దానిని నెరవేర్చాలని అన్నారు.. అనంతరం సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అని వారు అన్నారు మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం పైన నిధులు కేటాయిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. ఒక దిక్కు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు అని వారు అన్నారు ఈ సమస్యలను ఇలా ఉన్న ప్రభుత్వానికి పట్టడం లేదా అని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ 8వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని అని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో అత్య భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలని వారు అన్నారు దాంతోపాటు ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకునే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు పక్క భవనాలు నిర్మించాలని అని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అందులో చదువుకునే పేద విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అని వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల విద్యార్థులు అందరికీ ఏకం చేసి భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఎస్ఎఫ్ఐ కాలేజీ కమిటీ సభ్యులు వంశీ రాజేష్ రవితేజ శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..