జహీరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడు కనుమరుగైనాడు..

కనిపించని బాలుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ని మోమిన్ మొహల్లా ఈ బాలుడు నిన్న రాత్రి 8 గంటల నుండి (12/09/2025) కనిపించకుండా పోయాడు
పేరు: మొహమ్మద్ అర్బాజ్ వయస్సు: 17 సంవత్సరాలు దుస్తులు: నమాజ్ టోపీతో నల్లటి హొడ్డీ, నీలిరంగు జీన్స్. ఎవరికైనా ఈ బాలుడు కనబడితే వెంటనే ఈ సెల్ నెంబర్ కు సంప్రదించండి: 7842359943

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బహుజనుల రాజకీయాల ఐక్యతే…

బహుజనుల రాజకీయాల ఐక్యతే
అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడు…
పొన్నం బిక్షపతి గౌడ్ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గారు హాజరై మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ అందకారానికి దగ్గర చేస్తున్నాయని విద్య- వైద్యం- గూడు కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారి దొంగ నాటకాలను అరికట్టాలని 42% BC రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీనీ ఆదరించాలని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా కళాశ చిరంజీవి మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మురారి మనోజ్ గార్లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చు తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా EC మెంబర్ భూపాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి పుల్యాల భగత్ మరియు తదితరులు పాల్గొన్నారు

చిట్యాల పాఠశాలలో ఉపాధ్యాయులకి అవార్డు…

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం లోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో జూకల్ లక్ష్మీ విద్యానికేఆతన్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కవి రచయిత మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అంద జేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పాల్గొని ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందించడం అభినందనీయం అని అన్నారు , అనంతరం
మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి ,మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ , నూనె స్వామి , కసిరెడ్డి మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో ఉపాధ్యాయులకు వారు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని చేయూత పౌండర్ మ్యాదరి సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వేమునూరి ధనలక్ష్మీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా కంప్యూటర్ ప్రొజెక్టరులతో విద్యాను అందించే పాఠశాల మీ ఊరిలో ఉండడం గర్వకారణం అని కొనియాడారు
ఈ సందర్భంగా చేయూత పౌండేషన్ వారు ఇలాంటి విద్యాసంస్థలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం అభినందనియం అని అన్నారు.

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..
• రెస్క్యూ టీం గాలింపులో శవం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. నార్లపూర్ గ్రామానికి చెందిన బదన కంటి మహేష్ (25) అను వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుండి కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Man dies after going to graze cattle

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గ్రామంలో గల హైదర్ చెరువులో రిస్క్యూమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శనివారం సుమారు 12 గంటలకు మహేష్ శవం లభ్యమయింది. పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జహీరాబాద్ పంచాయతీ బిల్లుల ఆలస్యం సమస్య…

గ్రామపంచాయతీ బిల్లులు మంజూరులో ఆలస్యం ప్రజలతో ఇబ్బందులు పడుతున్న సెక్రటరీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ గ్రామపంచాయతీ బిల్లులు మంజూరులో ఆలస్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్రటరీలు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయినా బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల గ్రామపంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తయ్యాక తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం సెక్రటరీలు పలుమార్లు ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల గ్రామస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రజలతో ప్రతిరోజూ ఎదురెదురుగా నిలబడి ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని స్థానిక ప్రజలు, సెక్రటరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పోత్కపల్లి గంజాయి నిందితుడు అరెస్ట్.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్..

4.098 గ్రాముల ఎండు గంజాయి,కారు,మొబైల్ ఫోన్ స్వాదీనం..

ఓదెల(పెద్దపల్లిజిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను , స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ అనే 20 ఏళ్ల యువకుడు డ్రైవర్, టైల్స్ వర్క్ పై చేస్తూ డబ్బులు సరిపోక గంజాయి వ్యాపారం వైపు మళ్లాడని ఐ విచారణలో తేలింది. అతడి వద్ద నుంచి 4.098 కిలోల ఎండు గంజాయి, విలువ రూ. 2,04,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మొబైల్ క ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి స్నేహితులు బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని , త్వరలోనే అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోత్కపల్లి శివారులోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ -్య హాల్ ముందు వాహన తనిఖీలు జరుగుతుండగా ఎస్ఐ దీకొండ న్న రమేష్ ఒక కారు అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి ఆపగా
నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన మహేందర్, ఆకాష్ తో పరిచయం పెంచుకున్న అరుణ్, వీరితో కలిసి ఓడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాలలో విద్యార్థులు, ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఒక కిలో గంజాయిని ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి, స్థానికంగా యాభై వేల రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో తెలిసింది. గంజాయి పండించినా, తరలించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సీఐ సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఏసీపీ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ పి. కరుణాకర్ పర్యవేక్షణలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు వివరించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్..

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రేణికుంట అజయ్ (సింగర్ & డాన్స్ మాస్టర్) తండ్రి రేణికుంట పోచయ్య గత కొన్ని రోజుల క్రితం మరణించగ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రేణికుంట హరీష్, దుర్గయ్య, నాయకులు పుడూరి మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, పురాణం రమేష్, దాసరి శంకరయ్య, దాసరి రమేష్, రేణికుంట శ్రావణ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రేణికుంట అజయ్ (సింగర్ & డాన్స్ మాస్టర్) తండ్రి రేణికుంట పోచయ్య గత కొన్ని రోజుల క్రితం మరణించగ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్.
ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు రేణికుంట హరీష్, దుర్గయ్య, నాయకులు పుడూరి మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, పురాణం రమేష్, దాసరి శంకరయ్య, దాసరి రమేష్, రేణికుంట శ్రావణ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ..

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19,20,21 హైదరాబాద్ లో “ఓం” కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ను మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆవిష్కరించారు కమిషనర్
మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మకత పూర్తిగా మారిందని ఇటువంటి ఎక్స్పోలకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ఫోటో గ్రాఫర్స్ కు దోహదపడుతాయని తెలిపారు
యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందగలరని సూచించారు. ఫోటోగ్రఫీ రంగం ఇప్పుడు రానున్న టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని ఎక్స్పోలో కెమెరాలు, లెన్స్లు,డ్రోన్లు ప్రింటింగ్ పరికరాలు లైటింగ్ సిస్టం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు స్టూడియో మోడల్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్ స్టూడియోలు ఆసక్తిగల యువత తప్పక పాల్గొని ప్రయోజనం పొందాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి , కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్ కోశాధికారి బద్రి సతీష్ గౌరవ సలహాదారులు నక్క తిరుపతి ఎం.వి సత్యనారాయణ జాడి ముకుందాం ఉపాధ్యక్షులు నక్క పవన్. ఆర్ సుజిత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్ ప్రచార కార్యదర్శి. కె హరి కృష్ణ
కార్యదర్శి. పసుల రవి. మంచిర్యాల జిల్లా మాజీ కోశాధికారి సిపతి రవి. మొగిలి సత్యనారాయణ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి..

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
లాభాలవాట 20 వేలు చెల్లించాలి
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల విజ్ఞప్తి.

సమస్యల పరిష్కారానికి మంత్రుల హామీ

ఈరోజు ప్రజాభవన్ లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలని, లాభాల వాటా 20, వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిని ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజాభవన్ కి వచ్చి ప్రజావాణి ఇంచార్జి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారితో కలిసి కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులను తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది.
సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు 1285 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూళ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఫలితంగా ఒక్కొక్క కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు 744/- రూపాయలు నెలకు 19 344 /-రూ పాయలవు నష్టపోతున్నారని మంత్రిగారికి తెలియజేశారు. ఇతర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టిపిసి, ఓఎన్జిసి , హెచ్ పి సి ఎల్ , ఐ ఒసిఎల్ , ఏపీఎండిసి స్టీల్ ఐటిసి సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జిఒ కు అదనంగా మూడు వేల నుండి 5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేసియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఒల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవో కు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, క్యాటగిరి ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.

వేతనాల పెంపుదల సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ:

కార్మికుల వినతి పై స్పందించిన ఉపముఖ్య మంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి యొక్క వేతనాలు పెంచేందుకు,లాభాల వాటా పెంచెందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికొసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

Singareni

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి జేఏసీ నాయకత్వం సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి ని కలిసి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు కనీస వేతనాలు జి.ఒల పై చర్చించడం జరిగింది.

త్వరలో జి.ఒ లు ఇస్తాం కార్మిక శాఖా మంత్రి హామి :
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచుతామని. రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన వేతనాలను పెంచిన అనంతరం సింగరేణిలో అదనంగా చెల్లించాల్సాన వేతనాల గురించి చర్చిస్తామని. మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అనుగుణంగా వేతనాలు అమలు చేస్తామని మిగతా సమస్యలైన ఈఎస్ఐ అమలు, పెయిడ్ హాలిడేస్ , 15 లక్షల నష్టపరిహారం కేటగిరి ఆదారంగా వేతనాలు చెల్లించడం తదితర అంశాలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
కనీస వేతనాలు సలహా మండల చైర్మన్ ఐన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ కార్మికులకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డులో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని జీవోలు వచ్చేంతవరకు ప్రభుత్వంపై జిఒశకుళ అదనంగా వేతనాలు పెట్టించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తానని, జేఏసీ పోరాటాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాల్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యంలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు.

Singareni

మంత్రులు, సి & ఎండి గార్లు కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై స్పందించిన హామీలు ఇచ్చినందుకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశరు. ఇచ్చిన హామీలను అమలు చేయని , పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు , యాకూబ్ షా వలి ,కరుణాకర్ ,యాకయ్య , బాబు ,మల్లెల రామనాథం ,రామ్ సింగ్, భూక్యా రమేష్ , వేల్పుల కుమారస్వామి, అరవింద్, మహేందర్, ఒదేలు, రాజశేఖర్ , అరవింద్ , స్వామి , క్రాంతి, శరత్, రఘు, సాజిద్, అనిల్ , విజయ్, మధుసూదన్ రెడ్డి , సమ్మన్న , తిరుపతమ్మ , లక్ష్మి సారయ్య, సక్రం , రాజేష్, క్రాంతి, రాజేందర్ , రవి , రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.

అభినందనలతో.

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండలం లోని చల్లగరిగ లో నిర్వహిస్తున్న సి సి పి ఎల్ 02 క్రీడాకారుల కు పవర్ స్టార్ టీం కి జెర్సీ మరియు లోయర్ స్పాన్సర్ చేసిన వాణివిద్యా నికేతన్ కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్,ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నిరంజన్ రెడ్డి.

మృతుడికుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

వనపర్తి నేటిధాత్రి .
పెద్ద గూడెం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి ఆకస్మికంగా మరణించారు ఈ విషయం తెలియడంతో మృతుని కుటుంబ సబ్యలను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు
మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాణిక్యం, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ కొండన్న, లక్ష్మీకాంతరెడ్డి, తిరుమలయ్య, శీను, చిరంజీవి, బి రాములు, బాలస్వామి, వంశీ, బాలకృష్ణ, వెంకటయ్య, ఏం రాములు, గ్రామ అధ్యక్షులు అశోక్, చోటు తదితరులు పాల్గొన్నారు

ఈ నెల 15న తహసీల్దార్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి.

ఈ నెల 15న తహసీల్దార్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి

రాం రాంచందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు

టేకుమట్ల మండలం కుందనపెల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ వి హెచ్ పి ఎస్ అనుబంధ సంఘాల సమావేశానికి ఎంఎస్పి టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ సమావేశ ముఖ్య అతిథులు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాం రాంచదర్ మాదిగ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ నెల 15వ తేదీన టేకుమట్ల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాలని డిమాండ్ చేశారు అదే విధంగా మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు, వృద్ధులు, వితంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దారులందరు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో మాడగుల వీరయ్య వృద్ధులు, వికలాంగులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు

వానతో ఇబ్బందులు అయినవోలు ఆసుపత్రిలో…

వానొస్తే ఐలోని ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేస్తుంది.
సరైన డ్రైనేజి వ్యవస్థ లేక గేట్ల వద్దే నిలిచి ఉంటున్న వర్షపు నీరు
ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు రోగుల పాట్లు
ఎక్కడా చోటు లేనట్టు ఆసుపత్రి ఆవరణంలోనే మిషన్ భగీరధ వాటర్ ట్యాంకు
ట్యాంకు నిర్వహణ లేక ఎక్కువైన నీరు ఆసుపత్రి స్లంపులోకి వెళ్తున్న వైనం
వర్షపు నీటి ప్రవాహనికి అడ్డంగా ఉన్న విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్
ప్రమాదం జరిగేలా ఉన్నా, పట్టించుకోని తహసీల్దార్ కార్యాలయం
ఆదాయం లేని చోటు అందుకేనా అటు వైపు చూడని రాజకీయ కనికట్టు

నేటిధాత్రి ఐనవోలు :-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రంగా ఉన్న అయినవోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినవోలులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. అప్పటినుండి పేద ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల దృష్టిలో పెట్టుకొని గ్రామీణ పేదలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. దాంతో అయినవోలు మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి మెరుగైన చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావు సారథ్యంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు దాదాపు 100 మంది ఓ.పి.రోగులకు సేవలు అందిస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. మరి ఇంతలా గ్రామీణ పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ఆవరణ చిన్న వర్షానికే చెరువును తలపిస్తుంది. ఆసుపత్రిలోకి వెళ్లే రెండు మార్గాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలే జ్వరాలతో నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులు అడ్డుగా వర్షపు నీరులో నుంచి తడుస్తూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిలో నుండే వెళ్లే క్రమంలో వృద్ధులు కిందపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశము ఉందని అంతేకాకుండా జరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు మరియు మలేరియా డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగులకు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ విభాగంలో ఉంచి డాక్టర్ శ్రీనివాసరావు నుంచి చికిత్స అందిస్తున్నారు.మరి అలాంటి రోగులు కూడా ఈ వర్షం నేను నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాపించి మరిన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకనే..

అని ఆసుపత్రి నిర్మాణ సమయంలో ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కానీ, వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దాంతో చిన్న వర్షానికి ఆవరణలో వర్షపు నీరు ఎక్కడివి అక్కడే నిలిచి బురదమయం అయ్యి దుర్గంధం వెదజల్లుతుంది. గతంలో వర్షం నీరు వెళ్లేందుకు ఆసుపత్రి తూర్పు భాగంలో ప్రహరీకి ఒక గండి పెట్టగా వరద నీరు ఆ మార్గం గుండా బయటికి వెళ్ళేది. అయితే ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం, పక్కనే ఉన్న నిర్మాణాలు మరియు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇటీవల వేసిన సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడం చేత ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వరద నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ మార్గం గుండా వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేశారని, దాంతో నీరు బయటికి పోకుండా అలాగే నిలిచి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాలకుల స్వార్థం రోగులకు ప్రాణ సంకటం

గతంలో ఉన్న పాలకులు మండల కేంద్రంలో ఎక్కడా చోటు లేదు అన్నట్లుగా ఆసుపత్రి ఆవరణలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.అయితే నిర్మాణం అయితే చేపట్టారు గాని దాని నిర్వహణ సరిగా లేనందున వాటర్ ట్యాంక్ నిండి పోగా ఎక్కువైన నీరు ఆసుపత్రి మెడికల్ వేస్టేజ్ కోసం నిర్మించిన స్లంపులోకి వెళ్తుంది. అది కూడా పూర్తిగా నిండిపోయిన తర్వాత నీరు బయటికి ప్రవహించి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయి అసౌకర్యానికి కారణమవుతున్నది.

ఆసుపత్రిపై అధికార పాలక వర్గాల శీత కన్ను

నిత్యం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు నిలువ ఉండకుండా ఆవరణ అంతా మెయిన్ రోడ్డు లెవల్ మట్టి పోయించాల్సిన అవసరం ఉంది. వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ మట్టి పోయించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిండిన తర్వాత వచ్చే నీరు బయటికి వెళ్లేలా సరైన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో మరిన్ని గదులు నిర్మాణం చేపట్టి 30 పడకల ఆసుపత్రిగా అప్డేట్ అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు…

జహీరాబాద్: 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్టిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లను సంప్రదించవచ్చు.

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-13T133623.743.wav?_=1

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్..? “సీఎం” ఆదేశాలు బేకతార్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించండి. వరంగల్ మేయర్ నిధుల దుర్వినియోగంపై ఆరా తీయండి అని వేడుకుంటున్న వరంగల్ ప్రజలు

వరంగల్ మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై పూర్తి కథనం త్వరలో.. మీ”నేటిధాత్రి”లో..

“నేటిధాత్రి”, వరంగల్.

రాష్ట్రంలోని అధికారులు, నాయకులు వర్షాలు, వరదల విషయంలో అందరూ అందుబాటులో ఉండాలి అని ఒకపక్క సీఎం చెబుతుంటే, వరంగల్ మేయర్ మాత్రం స్టడీ టూర్ పేరుతో నగరాన్ని పట్టించుకోకుండా తన సొంత లాభం కోసం కార్పోరేటర్లని పట్టుకొని విహారయాత్రలకు వెళ్తుండటం వివాదాస్పదంగా మారింది.

మళ్లీ గెలవాలనే తాపత్రయంతో కార్పోరేటర్ లను మచ్చిక చేసుకోవడానికి కోసం స్టడీ టూర్ పేరుతో, ప్రజల సొమ్ముతో విహారయాత్ర?

గ్రేటర్ వరంగల్ నగర సమస్యలు గాలికి వదిలేసి “ఇండోర్ స్టడీ టూర్ కు ఏర్పాట్లు”

గ్రేటర్ వరంగల్ నగరంలో రోడ్లు బాగాలేక, అనేక సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా, వరంగల్ మున్సిపల్ పాలకవర్గం ఇండోర్ స్టడీ టూర్ పై అడుగులు వేయడం నగరవాసులు, ప్రతిపక్షాల్లో చర్చనీయాంశమైంది.

సుమారు 55మంది కార్పొరేటర్లు, మేయర్‌తో పాటు అధికారులు 25మంది కలిసి స్టడీ టూర్ పేరుతో (విహారయాత్ర) వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతుండటంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

టూర్ ఖర్చు దాదాపు 50లక్షల రూపాయల పైవరకు వెళ్తుందని వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజల సొమ్ముతో ఖర్చు చేయడం సమంజసమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకపక్క నగర ప్రజలు వరదల నుండి తేరుకోక ముందే విహార యాత్రలు ఎందుకు? మరోవైపు రాబోయే ఐదు రోజులు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు.

మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వర్షాల సమయంలో అప్రమత్తంగా నాయకులు నగరాల్లో అందుబాటులో ఉండాలని చెప్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉండాల్సిన నాయకులు స్టడీ టూర్ పేరు మీద విహారయాత్రలా అని ఆగ్రహిస్తున్న ప్రజలు

మునిసిపల్ శాఖలో నిధులు లేవంటూనే, స్టడీ టూర్లు పెట్టి, విహార యాత్రలు చేస్తూ, ప్రజలు కడుతున్న పన్నులను విహారయాత్రలకు వినియోగిస్తోంది నగర మేయర్ అంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు

నగర మేయర్ మీకిది తగునా? నగర సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నిస్తున్న సామాన్యులు..

వరదలు వచ్చి, ఇప్పటికీ తేరుకొని నగరవాసులు. మరోసారి మేయర్ పదవి కోసమేనా ఈ టూర్? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటున్న ప్రతిపక్షాలు..

నగరంలో సమస్యలు అనేకం ఉన్నాయి.. ఇప్పుడు ఇంత భారీ బృందం, టూర్ పేరుతో ఇండోర్ వెళ్ళడం, వరంగల్ ప్రజల డబ్బు వృథా చేయడమేనంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

“నగరంలోనే పరిష్కరించాల్సిన అంశాలు పరిష్కరించలేకపోతూ, ఇండోర్ స్టడీ టూర్ అవసరమా?” అనే ప్రశ్న ముందుకు వచ్చింది.

పోయిన సారి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. 10 వేల ఫోనుకు 30,000 బిల్లు పెట్టింది అని విమర్శలు వచ్చాయి? ప్రజల సొమ్ముతో సెల్ ఫోన్లు కొనివ్వడం ఏంటి అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ సెల్ ఫోన్ల వెనుక పెద్ద ఎత్తున దండుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి

టూర్ ఖర్చులు, సెల్ ఫోన్ల ఖర్చులు.. నగర “మేయర్” ఈ ఖర్చులపై ప్రజలకు మీడియా ద్వారా సమాధానం ఇవ్వాలంటూ సామాన్యుల నుండి స్వరాలు వినిపిస్తున్నాయి.

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన…

బాల్యానికి… బంధ(న)o

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన

* అధికారుల దృష్టికి వస్తున్నవి కొన్నే..

* చిన్న వయసులో పెళ్లి వల్ల సమస్యలు

* గ్రామీణ ప్రాంతంలో ఆగని దురాచారం

* ఆడపిల్లలపై తల్లిదండ్రుల వత్తిళ్లు

* కంప్యూటర్ యుగంలోనూ సమాజం వెనక్కి

* చట్టాలు ఉన్నా మారని తల్లిదండ్రుల ఆలోచనలు

సంసారం సాగరం అన్నారు. సంద్రంలో ఈదాలంటే గజ ఈతగాళ్లకే తరం కాదు… మరి అప్పుడే ఈత నేర్చుకున్న వారిని ఆ సంద్రంలో పడేస్తే ఒడ్డుకు చేరగలరా..? బాలల పరిస్థితి అలాగే ఉంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి పేరుతో సంసారమనే సాగరంలో పడేస్తున్న తల్లిదండ్రుల తీరు ఎందరి జీవితాలకో బంధనంగా మారుతోంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కూతురుకు మూడుముళ్లు వేయిస్తే భారం తగ్గిపోతుందని కొందరు.. ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా అని పెళ్లీడు రాకున్నా పనైపోతుందని మరికొందరు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. సమాజం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా చదువును ఆపేసి బాల్య వివాహాలకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. బాల్య వివాహమంటే ముక్కుపచ్చలారని చిన్నారుల భవితకు సంకెళ్లు వేయడమే. ఇలాంటివి సమాచారం వస్తే తప్ప అధికారులు స్పందించి ఆపగలుగుతున్నారే తప్ప ఎవరికి వారు చైతన్యవంతులై వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ దిశగా అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.

మారుమూల పల్లెల్లో అధికం

జిల్లాలోని మారు మూల పల్లెల్లో బాల్య వివాహాలకు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముక్యంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నారాయణ్ ఖేడ్, జహిరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలలో అధికారులకు, స్థానికులకు తెలియకుండా గూట్టు చప్పుడు కాకుండా ఇరు వైపులా పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని పక్కింటి వారికి కూడ తెలియకుండా వేరే ప్రాంతాలలో బాల్య వివాహాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఐసిడిఎస్ అధికారులకు సమాచారం తెలిసి పై అధికారులకు తెలిపితే పెళ్లి జరిపించిన ఇరు వర్గాల వారు సదరు వ్యక్తిపై పోట్లాటకు దిగుతున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు.

rising child marriages.

బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు..

బాల్య వివాహాల వల్ల చాలా అనర్దాలు కలుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు తరువాతే శరీర అవయవాలు పూర్తిస్థాయిలో ఎదుగుతాయి. ఈ వయసుకన్నా ముందు వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు బలహీనంగా వుంటారు. వివాహితులైన బాలికలు బీపీ, రక్తహీనతకు గురవుతారు. పిండం ఎదుగుదల సరిగా ఉండదు నెలలు నిండకముందే ప్రవించే అవకాశం వుంది. కొన్నిసార్లు గర్భస్రావం. జరిగే ప్రమాదం కూడా వుంది. శరీర ఎదుగుదల సంపూర్ణంగా లేకపోవడం వల్ల సాధారణ ప్రసవం జరగడం కష్టమవుతుంది. పురిటిలోనే బిడ్డ చనిపోవడానికి అవకాశాలున్నాయి.

వీరంతా నేరస్తులే..

బాల్య వివాహాల నిషేద చట్టం- 2006 ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు, మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరం బాల్య వివాహాన్ని జరిపించేందుకు ప్రయ త్నిస్తే ఇరుపక్షాలకు చెందిన తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లి సంఘాలు వ్యక్తులు, నాయకులను నేరస్తులుగా పరిగణిస్తారు. వీరందరికీ రెండేళ్ల జైలు శిక్షగాని, లక్ష రూపాయల జరిమానాగాని విధించే అవకాశముంది. బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ క్రైమ్ గా పరిగణి స్తారు.

బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తున్నాం

అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికల కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందుల గురించి వివరిస్తున్నాం. శరీరం ఎదగకుండా వివాహం చేసుకుంటే తరువాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్యలు ఎచురవుతాయో తెలుపుతునన్నాం. జీవన నైపుణ్యాలు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అంశాలపైనా చైతన్య పరుస్తున్నాం.

rising child marriages.

ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

బాల్య వివాహలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. చట్టం ప్రకారమే వివాహం చేయాలి. బాల్య వివాహాలు చేసుకున్న వారిలో రక్తహీనత లోపం, శిశుమరణాలు వంటి సమస్యలను చూస్తున్నాం. మరి కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కుంటుంబ నిర్వహణపై కౌమరదశలో పూర్తిగా అవగాహన ఉండదు. దీని కారణంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో తల్లి దండ్రులు బాధ్యతగా వ్యవరించడం మంచిది. బాల్య వివాహాలను అధికారులే కాదు.. స్థానిక ప్రజలు, బంధువులు అడ్డుకోవాలి.

◆:- ఝరసంగం మండల వైద్యాధికారి రమ్య

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా ‘మీ సేవ’ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎస్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు.

ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమ తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో (ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.

సేవను ఎలా పొందాలంటే…

◆:- పాత సర్టిఫికెట్ నంబర్ తెలిస్తే: మీ సేవ కౌంటర్లో ఆ నంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్ పొందవచ్చు.

◆:- నంబర్ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్సైట్ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.

error: Content is protected !!
Exit mobile version