“సర్వే నం.26లో అక్రమ కట్టడాలపై సిపిఐ ఆగ్రహం…

సర్వే నంబర్ 26లో అక్రమ కట్టడాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని సీతారాంపూర్ పరిదిలోని సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ పరంపోగు భూమిలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగలపారక సంస్థ పరిధిలో ఉన్న సీతారాంపూర్ లోని సర్వే నెంబర్ 26లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పరంపోగు భూమిలో భవనాలు నిర్మించారని వీటికి ఇంటి నెంబర్లు మున్సిపల్ అధికారులు ఎలా ఇచ్చారన్నారు. పరం పోగు స్థలములో బహుళ అంతస్తులు, లగ్జరీ డూప్లెక్స్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించి అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలను ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను బై నెంబర్లు వేసి ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేసి అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరంపోగు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ స్థలంలో ఇంటి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను, కరెంటు మీటర్ ఇచ్చిన విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మౌనం చూస్తుంటే ఇందులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు నిర్మించి అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంటనే అరెస్టు చెయ్యాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సర్వేనెంబర్ 26లో ఉన్న భవనాలన్నింటినీ స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదల తోటి ఇండ్లను ఆక్రమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ ఈభూమిని పరిశీలించిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…

సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….

HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు..
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…

దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు…
ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…

ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version