శుక్రవారం.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదు…

 శుక్రవారం.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదు!

 

శుక్రవారం.. ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..

 సనాతన ధర్మంలో శుక్రవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున సంపద, శ్రేయస్సు, సంతోషాన్ని ప్రసాదించే లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు, ధనధాన్యాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు ఒక నాణెం ఉంచండి. తరువాత, మనస్పూర్తిగా ఆమెను పూజించి, మీ పాపాలకు క్షమాపణ కోరండి. మరుసటి రోజు, నాణెం చుట్టూ ఎర్రటి వస్త్రాన్ని కట్టి మీ వద్ద ఉంచుకోండి.

వేప చెట్టుకు నైవేద్యం

శుక్రవారం వేప చెట్టుకు నీరు నైవేద్యం పెట్టడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి ఆనందం, శ్రేయస్సు చేకూరుతాయి. ఇది గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందేందుకు కూడా సహాయపడుతుంది.

ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌..

ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

 

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

ప్రభుత్వ పాఠశాలల్లో(Govt Schools) చదివే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బుక్‌లెట్‌ అందిస్తున్నారు. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిని బట్టే ఉపాధ్యాయులు అవగాహన చేసుకునే వీలు ఏర్పడుతుంది. పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగంలో వస్తున్న సంస్కర ణలో భాగంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాలను సమూలంగా మార్పుచేశారు.
సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యాసంవత్సరంలో ఫార్మటివ్‌ అసెస్‌మెంట్‌ (యూనిట్‌) పరీక్షలు 4 జరుగుతాయి. క్వాటర్లీ, హాఫియర్లీ, ఫైనల్‌ ఎగ్జామ్‌ స్థానంలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ 1, 2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొత్త విధానంలో మొదటి, రెండోవ సెమిస్టర్లలో రెండు ఫార్మటివ్‌, ఒక సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు వంతున జరుగుతాయి. ఇప్పటికే రెండు ఫార్మటివ్‌ పరీక్షలు ముగియగా ప్రస్తుతం సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు జరుగుతున్నాయి.

 

జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం…

జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సీతారం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఎ జిల్లా మాజీ కార్యదర్శి మాణిక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా విద్యను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version