మంచిర్యాల లో సెప్టెంబర్ 15 న వందే భారత్ రైలు ప్రారంభం
మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా వందే భారత్ రైలు ప్రారంభించడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ 20101 నాగ్ పూర్ – సికింద్రాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని,అధికారులు, ప్రజలు హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.