కౌన్సిలర్ గా గెలిచిన ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షునికి ఘన సన్మానం…

కౌన్సిలర్ గా గెలిచిన ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షునికి ఘన సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 18 నేటి ధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి గౌరవాధ్యక్షులు మాసుల ప్రవీణ్ ను టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ సభ్యులు బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు మెట్ పల్లి అధ్యక్షుడు డా: బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , ఓంకారి శ్రీనివాస్,బొల్లం రాజు,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఆరెళ్లి నరేందర్ కి ఘన నివాళులు..

సీనియర్ జర్నలిస్ట్ ఆరెళ్లి నరేందర్ కి ఘన నివాళులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ ఆరెళ్లి నరేందర్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం జర్నలిజం రంగానికి తీరని లోటని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.
దశాబ్దాల పాటు జర్నలిజం రంగంలో సేవలందించిన నరేందర్ ప్రజా సమస్యలపై నిర్భయంగా కలం ఝళిపిస్తూ, నిజాయితీతో కూడిన పాత్రికేయుడిగా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, సమాజ హితమే ధ్యేయంగా జర్నలిజాన్ని వృత్తిగా కాక బాధ్యతగా నిర్వహించిన వ్యక్తిగా సమాజానికి నరేందర్ గుర్తుండిపోతారన్నారు.
నరేందర్ మృతి వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన అంత్యక్రియల్లో తెలంగాణ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత మదుసుదనాచారి పాల్గొని పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జర్నలిస్టు లోకానికి సంతోషకరంగా ఉందని తెలిపారు.
అంత్యక్రియల కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు, మిత్రులు పాల్గొని నరేందర్ జర్నలిజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరెళ్లి నరేందర్ గారు జర్నలిజం రంగానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వివాహ వేడుకలో పాల్గొన్న టిజిఐడిసి…

వివాహ వేడుకలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ బండ్లగూడ ఓ ఎస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాక్ పైసల్ కుమార్తె మరియు హెచ్ ఎఫ్ ఫంక్షన్ హాల్లో రియల్ ఎస్టేట్ ఆదిల్ కూతురి వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి వారితో పాటు కాంగ్రెస్ నాయకుడు అక్రమ్ హర్షద్ జమ తదితరులు ఉన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version