వరంగల్‌ మున్సిపల్ కమిషనర్‌ – రిలయన్స్ స్టోర్‌కు జరిమానా

శెభాష్ వరంగల్‌ మున్సిపల్ కమిషనర్ – రిలయన్స్ స్టోర్‌కు జరిమానా

కొన్ని రోజులుగా వాహనాలు రోడ్డు మీద పార్కింగ్. నగరంలోని అన్ని షాపింగ్ మాల్స్ ఇదే విధంగా అమలు చేయాలని కోరుతున్న ప్రజలు.

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ నగరంలో పౌరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పార్కింగ్ సమస్యపై మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ కఠిన చర్యలు తీసుకున్నారు.

పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ వద్ద గత కొన్ని రోజులుగా వాహనాలు రహదారిపై అస్తవ్యస్థంగా పార్క్ చేయడం వల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ స్టోర్ యాజమాన్యంపై జరిమానా విధించారు. జరిమానా చెల్లింపు వరకు స్టోర్‌లో క్రయవిక్రయాలు జరగకుండా బల్దియా సిబ్బంది స్టోర్ ద్వారాలను మూసివేశారు.

రోడ్డుపై పార్కింగ్ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన కమిషనర్ చర్యలను స్థానిక కాలనీ వాసులు అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన మున్సిపల్ అధికారుల నిర్ణయం నగరంలో శ్లాఘనీయమని పలువురు పేర్కొన్నారు.

బాలానగర్ లో 44వ జాతీయ రహదారిపై మురికి నీరు ప్రవాహం

మురుగు వాసనతో.. భరించలేకపోతున్నాము సారు.!

బాలానగర్ / నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని పాత గెస్ట్ హౌస్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మలవిసర్జన చేసిన నీరు రోడ్డుపై ప్రవహిస్తునడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతలుగా మారి ఇబ్బందులు పడుతుంటే.. కంపు వాసనతో భరించలేకపోతున్నామన్నారు. గత 6 నెలలుగా మురికి నీరు ప్రవహిస్తున్న ఎవరు మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై మలవిసర్జన నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, బాటసారులు మండల కేంద్ర ప్రజలు కోరారు.

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి

29 కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని -29. కార్మిక చట్టాలను అమలు పర్చాలని
ఎస్ జి ఎల్ బి కే ఎస్ ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర. ప్రధాన కార్యదర్శి. ఎం రాయమల్లు
రాష్ట్ర నాయకులు. చంద్రగిరి శంకర్
డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను
అనుసరిస్తూ. కార్మికులు అనేక ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29. కార్మిక చట్టాలను
నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమంలో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కార్మిక ఉద్యోగ సంఘాలు అనేక నిరసనలు భారత్ బందులు, టోకెన్ సమ్మెలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసినప్పటికీ కార్మికుల అభిష్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి. కార్మిక వ్యతిరేక
లేబర్ కోడ్స్ ను (21/11/25) రోజు నుండి అమలులోకి తెచ్చి. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి భారత రాజ్యాంగంలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పొందుపరచుకున్న కార్మిక చట్టాలను హిందుత్వ మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం. భారత కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నమని చెప్తూ మరోవైపు. లాభాల లొ నడుస్తున్న. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ. ఆదాని- అంబానీ-బడా పారిశ్రామిక వేత్తలకు అమ్మివేస్తూ . కార్మికులను కార్మిక కుటుంబలను రోడ్డుమీదికి నేటి వేస్తూ. అన్ని రంగాల ప్రజలను సంక్షోభములకు నెడుతు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి. భారత కార్మిక వర్గం ప్రశ్నించే హక్కు లేకుండా. ప్రశ్నించే కార్మికులను. ఎలాంటి సమాధానాలు లేకుండా. నేరుగా ఉద్యోగం నుండి తొలగించే విధంగా. బ్రిటిష్ వారిని మై మరిపించే విధంగా. కార్మిక చట్టాలను మారుస్తు. కార్మిక వ్యతిరేక. చట్టాలను అమల్పరుస్తూ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా.కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

సిరిసిల్లలో ప్రజలలో అవగాహన కోసం బీజేపీ కరపత్రాల పంపిణీ

ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన

– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు.
ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ
“ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం
ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

జారీ చేసిన వారు:
దుమాల శ్రీకాంత్
పట్టణ అధ్యక్షులు,
భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాసిరకం బీటీ రోడ్ పై ఆగ్రహం

నాసిరకం బీటీ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం.

* కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు.
ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు కలిసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు.భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. ఈ రోజున, 1949లో భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, రాజ్యాంగ విలువల పట్ల ప్రజలలో రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం గౌరవాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. ఈ చారిత్రాత్మక రోజును స్మరించుకోవడానికి, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య విలువలను గౌరవించడానికి మరియు విద్యార్థులు, పౌరులలో రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య విలువల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

మంగపేట అంబేద్కర్ సంఘం రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల కమిటీ (184/85) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం.

మంగపేట నేటిధాత్రి

 

తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల అధ్యక్షులు యెంపెల్లి వీరస్వామి
ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మరియు మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకుని సంవత్సరం పూర్తి అయినా సందర్బంగా మంగపేట మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించి, కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు అంబేద్కర్ సంఘం మంగపేట మండల వ్యవస్థాపకులు పగిడిడిపల్లి వెంకటేశ్వర్లు, విగ్రహ ధాత చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు,అంబేద్కర్ సంఘం గౌరవ సలహాదర్లు ఎర్రం స్వామి, పూజారి సురేందర్ బాబు,సీనియర్ నాయకులు గుళ్లగట్టు విజయరావు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు వెంకటస్వామి,అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్, జిల్లా నాయకులు ముత్యాలు,మహిళా నాయకురాలు కాటూరి సుగుణ ఏటూరునాగారం డివిజన్ అధ్యక్షులు బసరికాని హరికృష్ణ,మంగపేట మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం మంగపేట మండల కమిటీ నాయకులు, బసరికాని నాగార్జున దాసరి ఎల్లయ్య బూర్గుల సతీష్, జాడి సంబశివరావు, lp రవి, నరంహారావు, రామటెంకి మాణిక్యం కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బుజ్జి,యెంపెల్లి దేవందర్, తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు దుర్గం శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ శివయ్య,బోడ సతీష్, గోమాస్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

మంగపేట మండల స్థానిక ఎన్నికల డిమాండ్

మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరగడానికి మోక్షo ఎప్పుడో

ఎన్నికల కమిషన్ మంగపేట మండలం మీద చోరువా తీసుకొని స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి

మంగపేట నేటిధాత్రి

 

ములుగు జిల్లా మంగపేట మండలం 2013 ఎన్నికల నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినది కానీ ఇప్పుడు 25 /11/2025 నోటిఫికేషన్ ప్రకారం కోర్ట్ స్టే ఇవ్వలేదు కనుక మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరిపించాలి అని ఎస్సి బీసీ ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఎన్నికలు లేక సుమారు 20 సంవత్సరాలు లేనట్లేన ఈ సారి స్థానిక ఎన్నికలు జరగకుంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరిపిస్తే మంగపేట మండల ప్రజలు ప్రతి ఒక్కరు నోటకే ఓట్ వేస్తామని ప్రజలనుండి మాటలు వినుపిస్తున్నవి ఏదేమైనా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానికులు ఎవరైనా పరవాలేదు కాను స్థానిక ఎన్నికలు జరుగలి మంగపేట గిరిజనులు మంగపేట ఏజెన్సీ అని గురిజనేతలు మంగపేట మండలం నాన్ ఏజెన్సీ అనీ వివాదం తో 15 సంవత్సరాలు పూర్తి అయింది కానీ కోర్ట్ లో ఉన్న విషయాన్నీ ఇంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఈ విషయం పై స్వందించకపోవడం మంగపేట మండల ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మంగపేట మండలం విషయం పై స్వంధించి స్థానిక ఎన్నికలు జరిపించే విదంగా చోరువా తిసుకోవాలని గుగ్గిళ్ల సురేష్ మాదిగ విలేకర్ల సమావేశం లో మాట్లాడం జరిగింది సుప్రీం కోర్ట్ లో ఉన్నటువంటి కేసును త్వరగా ప్రభుత్వలు స్వందించి మంగపేట మండల కేంద్రంలో స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి ప్రజలు ఉద్యోగ పరంగా కానీ మండల అభివృద్ధి పరంగా కానీ ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు వెనుక పడడం జరుగుతుంది ఈ సారి స్థానిక ఎన్నికలు జరకుండా ఉంటే రాబోయే రోజులల్లో ఎమ్మెల్యే ఎన్నికలు గాని ఎంపి ఎన్నికలు గాని ఇంకా ఎ ఎన్నికలు కూడా జరగకూడదు గుగ్గిళ్ల సురేష్ మాదిగ మంగపేట ప్రజా నాయకులు మాట్లాడడం జరిగింది బీసీ మండల నాయకులు గాదె శ్రీనివాస్ చారి, దంతానపల్లి నరేందర్, పరికి శ్రీనివాస్, యాసం హరీష్, ఈసంపల్లి సురేందర్ మాదిగ తదితరులు పాలుగోన్నారు

విద్యార్థుల అవగాహన ర్యాలీ – ట్రాఫిక్ నియమాలు

ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి….

విస్డం విద్యార్థుల చే ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల పై అవగాహన ర్యాలీ ….

అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎస్సై సుధీర్ రావు

రాయికల్: నవంబర్ 26: నేటి ధాత్రి:

 

పట్టణానికి చెందిన విస్డం స్కూల్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు బుధవారం రోజు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, ప్రమాదాల మీద రాయికల్ మండల కేంద్రం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు
ట్రాఫిక్ సిగ్నల్స్,హెల్మెట్, సీట్ బెల్ట్, వాహనాల వేగం నియంత్రణ, జీబ్రా క్రాసింగ్,రోడ్డు మలుపులు, వంతెనలు వంటి సూచికల నమూనాలను తయారు చేసి కూడలి ల వద్ద ప్రదర్శించారు.రోడ్డు భద్రత, జాగ్రత్తలకు సంబందించిన నినాదాలను నినదిస్తూ ప్రజలను చైతన్య పరిచారు.విద్యార్థులు ట్రాఫిక్ పోలీస్, ద్విచక్ర వాహనాలు, కార్లు, మొబైల్,వంటి వేశధారణలు వేసి,అందరి చేత ట్రాఫిక్ నియమాల ప్రతిజ్ఞ చేయించారు.ఈ అవగాహన ఆ ర్యాలీని ప్రారంభించి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న రాయికల్ ఎస్ఐ సుధీర్ రావ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని, విద్యార్థి దశలోనే పిల్లలకు ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహించే విధంగా వారిని ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ కు పోలీస్ శాఖ యొక్క సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ ఈరోజుల్లో నిత్యం జరుగతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలో,దాని వలలో పడి యువత వేగవంతమైన బైకులు, కార్లు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా, వారిని బెదిరించి స్థోమతకు మించిన వాహనాలు కొనుగోలు చేయించి వాటిని అతివేగంగా నడిపి ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు,ఇంకొంత మంది ఎదుటివారి ప్రాణాలను తీస్తున్నారు. దానివలన ఎన్నో కుటుంబాలకు తీరని లోటు మిగులుతుందని అన్నారు. ఆక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి కాకుండా ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పిస్తూ,అతివేగంగా వాహనాలు నడిపే వారిమీద కఠిన చర్యలు తీసుకుని, లైసెన్స్ లేని యువతకు వాహనాలు ఇచ్చేవారి పై కేసులు నమోదు చేస్తే ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నివేదిత రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం లోని మల్గి మల్లన్నస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ సర్పంచ్ దంపతులు జట్గొండ మారుతి శిరీష ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో బుధవారం స్వామివారికి అభిషేకం హారతి పూజా కార్యక్రమ నిర్వహించినారు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలుచేసి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదనం చేశారు,

రామడుగు అంబేద్కర్ యువజన సంఘం కొత్త కమిటీ ఎన్నిక

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండలం నూతన కమిటీ ఎన్నిక

రామడుగు, నేటిధాత్రి:

 

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్లానింగ్ కమిటి చైర్మన్ గజ్జల ఆనందరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల మహేందర్, రాష్ట్ర కార్యదర్శి, మీసాల సాయిలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ స్వరూపల సమక్షంలో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండల అధ్యక్షులుగా రేణికుంట అశోక్, ఉపాధ్యక్షులుగా జెట్టిపల్లి మురళి, జిల్లాల సురేష్, లింగంపల్లి రవి, మండల ప్రధాన కార్యదర్శిగా ఆరేపెల్లి ప్రశాంత్, కార్యదర్శులుగా గజ్జల సురేష్, మచ్చ మహేష్, పర్లపల్లి తిరుపతి, చిలుముల రమేష్, కోశాధికారి తడగొండ శేఖర్, ప్రచార కార్యదర్శులుగా రేణిగుంట శ్రావణ్, కత్తెరపాక రమేష్, బండపల్లి గోపి, తదితరులను నియమించారు.

సి‌ఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలంటూ కార్మికుల ధర్నా

సి ఎస్ సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలి

జీవో నెంబర్ 12 ను సవరించి కార్మికుల వెల్ఫేర్ నుండే సంక్షేమ పథకాలు అందించాలి

భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జేఏసీగా అనుబంధ సంఘాలతో జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈసందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశం మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మూడు వందల నలభై ఆరు కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లైములకు వెంటనే నిధులు విడుదల చేసి అరవై సంవత్సరాలు పైబడిన కార్మికునికి ఐదు వేల పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి 2009 నుండి రెన్యువల్ కానీ పన్నెండు లక్షలకు పైగా ఉన్నా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు. మీసేవలో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ అడ్డాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అమలు చేయని యెడల డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలని పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశంలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈధర్నా కార్యక్రమంలో బిఓసి అధ్యక్షులు గందె కొంరయ్య, గౌరవ అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, కన్నం సదానందం, గోదారి లక్ష్మణ్ పొన్నం సంపత్, పుట్ట మహేష్, అందే పుల్లయ్య, గామినేని సత్యం, బొంకూరి రాములు, ఆకునురి రమేష్, ఎల్లయ్య, మోసం తిరుపతి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Panchayat Elections

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం భరోసా

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన పనులు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు, వారికి ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు, రిజర్వాయర్లో తట్టెడు మట్టిని కూడా తీయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇరవై మూడున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నిన్ను కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

* ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం*

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత & అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద
76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించారు అనంతరం మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్న నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగని రాయడం జరిగింది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో మనిషిగా గుర్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు సమాన హక్కు కల్పించింది కుల మతాలకు అతీతంగా సమాజంలో ఉన్న మానవులంతా ఒకటేనని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆరోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకుండా ఉండి ఉంటే భారత దేశంలోని ప్రజలు ఈ విధంగా ఉండేవారు కాదన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ తదితరులు పాల్గొన్నారు

స్వతంత్ర అభ్యర్థిగా గీత పోటీ

సూర్యనాయక్ తండా గ్రామ ప్రజలకు సేవలు చేయడమే నా లక్ష్యం

ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: జర్పుల గీత

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండాకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెం డెంట్ గా పోటీ చేయునట్లు జర్పులగీత ప్రకటించారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. గ్రామ అభి వృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధా న్యతలు అని పేర్కొన్నారు గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. నిరంతర ప్రజా సేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయా లలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభి మానం, సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని అన్నారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరం

సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు పాటించాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండలం రజక్ పల్లి గ్రామంలో బుధవారం ఏఎన్ఎం అరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటిని త్రాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

చిట్యాల పోలీసుల చేత తిరిగొచ్చిన మొబైల్

పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.

చిట్యాల, నేటిదాత్రి

 

చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version