దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

గిరిజన యువతికి క్రికెట్ కిట్ అందజేత

గిరిజన యువతి కి క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీర స్నేహ గిరిజన యువతి కోచ్ బాడిశ ఆదినారాయణ పర్యవే క్షణలొ శిక్షణ పొంది భూపాలపల్లిలో జరిగిన ఉమ్మడి వరంగల్ అండర్ 17 క్రికెట్ సెలక్షన్ అయింది. కుంజ సూర్య స్నేహ అనే యువతికి క్రికెట్ కిట్ అందించారు.గ్రామాల్లోని గిరిజన యువతులు స్నేహని ఆదర్శంగా తీసుకుని మరికొందరు అమ్మాయిలు క్రికెట్ లో రానించి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదిగి ములుగు జిల్లా కి పుట్టిన గ్రామానికి పేరు తీసుకురావాలని సూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ..

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ

మంగపేట, నేటిధాత్రి

 

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునిగాల వెంకటేశ్వర్లు శ్రీలత దంపతుల సహకారం తో ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని పలువురు వృద్ధులు, ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యం గా భావించి తమకు తోచినటువంటి సహాయం అందిస్తున్నామని ట్రAరా అనేక కార్యక్రమాలు మరియు సహాయసహకారాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ , ప్రచార కార్యదర్శి గగ్గురి మహేష్ , సభ్యులు గుంటక చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్…

నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

కోహీర్,మండలం లోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి నిర్మాణం గోడలను గ్రామపంచాయతీ తీర్మానం చేసి కూల్చివేయడంపై వివాదం నెలకొంది. సజ్జాపూర్ గ్రామంలోని 21వ సర్వే నంబర్ లో పల్లె ప్రకృతి వనా నికి సమీపంలో ఇంటి నిర్మాణం చేయడంపై డిసెంబర్ 16న ఇంటి నిర్మాణం పనులు చేయరాదని పంచా యతీ కార్యదర్శి వికాస్ రాములుకు నోటీసులు జారీ చేశారు. రాములు ఆ నోటీసులను లెక్కచేయకుండా బేస్మెంట్ వరకు గోడలను నిర్మించాడు. దీంతో ఈ నెల 22న గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతనంగా ఎన్ను కోబడిన సర్పంచు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఎక్స్కవే టర్ సాయంతో ఆ గోడలను కూల్చివేశారు. ఈ క్రమంలో రాములు మాట్లాడుతూ కావాలనే సర్పంచు తనయుడు తన ఇంటి నిర్మాణం గోడలను కూల్చివేశా రని ఆరోపించాడు. మంగళవారం సాయంత్రం కోహీర్ తహసీల్దార్ సుప్రియ, జహీరాబాద్ సీఐ శివలింగం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించి గోడలను కూల్చివే

కూల్చివేత స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్, సీఐ

సిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహ సిల్దార్ సుప్రియ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలోనే ఇంటి నిర్మాణం పనులు చేశారని, అంతేకాకుండా పల్లె ప్రకృతి వనానికి అడ్డుగా నిర్మాణం చేయడం నిబంధన లకు విరుద్ధంగా ఉండడంతోనే నిబంధనల ప్రకారమే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం వారు గోడలను తీసివేశారని ఆమె పేర్కొన్నారు. తనకు న్యాయం చేకూర్చాలని రాములు పలువురు గ్రామస్తు లతో కలిసి మంగళవారం మాజీ మంత్రి హరీశ్ వును కలిశారు. కాగా ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని హరీశ్రావు ఎస్పీని కోరారు.

యువతకు వాలీ బాల్ క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య..

యువతకు వాలీ బాల్ క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య

యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ ఆధ్వర్యంలో అందజేత

మంగపేట నేటిధాత్రి

 

యువకులు చదువు తో పాటు క్రీడాలలో రాణించాలని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ కుంజ సూర్య అన్నారు.బుధవారం మంగపేట మండలం
బ్రాహ్మణపల్లి గ్రామం లో యూత్ కి మండల యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినా రాయణ ఆధ్వ ర్యంలో గ్రామాల్లోని యువకులు ప్రోత్సా హిస్తు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశ్యం తో యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ కుంజ సూర్య
ఇచ్చి వాలీబాల్ క్రికెట్ కిట్ బ్రాహ్మ ణపల్లి మాజీ సర్పంచ్ సున్నం ఆనందం తన చేతుల మీదుగా యువకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బాడిశ నరేష్,కోరం నర్సింగరావు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

మంగపేట అంబేద్కర్ సంఘం రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల కమిటీ (184/85) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం.

మంగపేట నేటిధాత్రి

 

తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల అధ్యక్షులు యెంపెల్లి వీరస్వామి
ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మరియు మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకుని సంవత్సరం పూర్తి అయినా సందర్బంగా మంగపేట మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించి, కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు అంబేద్కర్ సంఘం మంగపేట మండల వ్యవస్థాపకులు పగిడిడిపల్లి వెంకటేశ్వర్లు, విగ్రహ ధాత చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు,అంబేద్కర్ సంఘం గౌరవ సలహాదర్లు ఎర్రం స్వామి, పూజారి సురేందర్ బాబు,సీనియర్ నాయకులు గుళ్లగట్టు విజయరావు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు వెంకటస్వామి,అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్, జిల్లా నాయకులు ముత్యాలు,మహిళా నాయకురాలు కాటూరి సుగుణ ఏటూరునాగారం డివిజన్ అధ్యక్షులు బసరికాని హరికృష్ణ,మంగపేట మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం మంగపేట మండల కమిటీ నాయకులు, బసరికాని నాగార్జున దాసరి ఎల్లయ్య బూర్గుల సతీష్, జాడి సంబశివరావు, lp రవి, నరంహారావు, రామటెంకి మాణిక్యం కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బుజ్జి,యెంపెల్లి దేవందర్, తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు దుర్గం శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ శివయ్య,బోడ సతీష్, గోమాస్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version