ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి….
విస్డం విద్యార్థుల చే ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల పై అవగాహన ర్యాలీ ….
అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎస్సై సుధీర్ రావు
రాయికల్: నవంబర్ 26: నేటి ధాత్రి:
పట్టణానికి చెందిన విస్డం స్కూల్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు బుధవారం రోజు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, ప్రమాదాల మీద రాయికల్ మండల కేంద్రం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు
ట్రాఫిక్ సిగ్నల్స్,హెల్మెట్, సీట్ బెల్ట్, వాహనాల వేగం నియంత్రణ, జీబ్రా క్రాసింగ్,రోడ్డు మలుపులు, వంతెనలు వంటి సూచికల నమూనాలను తయారు చేసి కూడలి ల వద్ద ప్రదర్శించారు.రోడ్డు భద్రత, జాగ్రత్తలకు సంబందించిన నినాదాలను నినదిస్తూ ప్రజలను చైతన్య పరిచారు.విద్యార్థులు ట్రాఫిక్ పోలీస్, ద్విచక్ర వాహనాలు, కార్లు, మొబైల్,వంటి వేశధారణలు వేసి,అందరి చేత ట్రాఫిక్ నియమాల ప్రతిజ్ఞ చేయించారు.ఈ అవగాహన ఆ ర్యాలీని ప్రారంభించి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న రాయికల్ ఎస్ఐ సుధీర్ రావ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని, విద్యార్థి దశలోనే పిల్లలకు ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహించే విధంగా వారిని ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ కు పోలీస్ శాఖ యొక్క సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ ఈరోజుల్లో నిత్యం జరుగతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలో,దాని వలలో పడి యువత వేగవంతమైన బైకులు, కార్లు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా, వారిని బెదిరించి స్థోమతకు మించిన వాహనాలు కొనుగోలు చేయించి వాటిని అతివేగంగా నడిపి ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు,ఇంకొంత మంది ఎదుటివారి ప్రాణాలను తీస్తున్నారు. దానివలన ఎన్నో కుటుంబాలకు తీరని లోటు మిగులుతుందని అన్నారు. ఆక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి కాకుండా ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పిస్తూ,అతివేగంగా వాహనాలు నడిపే వారిమీద కఠిన చర్యలు తీసుకుని, లైసెన్స్ లేని యువతకు వాహనాలు ఇచ్చేవారి పై కేసులు నమోదు చేస్తే ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నివేదిత రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
