పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత
నిజాంపేట: నేటి ధాత్రి
నార్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని భాస్కర్ తన మొబైల్ ను మార్గమధ్యంలో నాలుగు నెలల క్రితం పోగొట్టుకున్నాడు. బాధితుడు నిజాంపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా సీఈఐఆర్ అనే వెబ్ సైట్ లో నమోదు చేసి ట్రాక్ చేసి బాధితుడికి మొబైల్ ను స్థానిక ఎస్ఐ రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొబైల్ పోగొట్టుకున్నట్లయితే..అధైర్య పడకుండా సీఈ ఐఆర్ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నట్లయితే మొబైల్ ను పొందవచ్చన్నారు.
