శివలింగం పూజలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అభిమానులు..

శివలింగం పూజలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అభిమానులు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీరాటాకీస్ లో శివలింగం పూజలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు ఈసందర్భంగా
అభిమాన నటుడు నందమూరి బాలయ్యా నటించిన అఖండ 2 తాండవం సినిమా విడుదల సందర్భంగా రంగా టాకీస్ లో శివలింగ పూజలు చేశారు అనంతరం కేక్ కట్ చేశారు. రాజకీయంగా ముందుకెళ్లాలని సేవాభావం తో హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లో కేన్సర్ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని వారు కోరారు! ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ వనపర్తి జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులు గిరి, సెక్రటరీ బాలరాజు ,మోహన్ అశ్విని రమేష్ ,పి విశ్వనాథం,వెంకటేష్ తెలుగుదేశం నేత హోటల్ బల్ రాం రవి ఎస్ బాలయ్య నాగరాజాచారి,కిట్టు స్వామి కాశన్న, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

పోగొట్టుకున్న 6 గంటల్లోపు గుర్తించి బాధితుడికి అప్పచెప్పిన ఎస్ఐ హేమలత.

పోగొట్టుకున్న 6 గంటల్లోపు గుర్తించి బాధితుడికి అప్పచెప్పిన ఎస్ఐ హేమలత.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన గాజే రవీందర్ తన రియల్ మీ నార్జో మొబైల్ ని శుక్రవారం రోజున ఉదయం తన చేను నుండి తన ఇంటికి వస్తున్న క్రమంలో మార్గం మధ్యలో ఎక్కడో పోయిందని చిట్యాల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ని సి ఇ ఆర్ ఐ పోర్టల్ లో పొందుపరికి 6 గంటల లోపు అట్టి మొబైల్ ని గుర్తించగా చిట్యాల సెకండ్ ఎస్ఐ బాధితుడికి అప్పజెప్పింది
పోగొట్టుకున్న మొబైల్ ని అతి తక్కువ సమయంలో గుర్తించి తిరిగి ఇప్పించినందుకు చిట్యాల పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన బాధితుడు.

చిట్యాల పోలీసుల చేత తిరిగొచ్చిన మొబైల్

పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.

చిట్యాల, నేటిదాత్రి

 

చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version