రాజ్యాంగ అవతరణ వేడుకలు ఘనంగా

ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. అనంతరం కమిషనర్ గద్దె రాజు మాట్లాడారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత, భారతదేశ పౌరులందరూ విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ సతీష్, రెవెన్యూ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సుభ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు వైభవంగా

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

27 ఏళ్లకే ఉద్యానంలో డాక్టరేట్ సాధించిన మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

 

ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.
విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

‘‘కవిత’’ మీద కనికరం.. నాయకులకు ‘‘సంకటం’’!

-కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ పెద్దలకు కనిపించడం లేదా?

`కౌంటర్‌ అటాక్‌ ఎందుకు చేయడం లేదు?

`కేవలం కేసీఆర్‌ కూతురు కావడం ఇంకా వరమేనా?

`సాక్షాత్తు కేసీఆర్‌ నే కవిత టార్గెట్‌ చేస్తోంది?

`మిషన్‌ భగీరద మీద ఆరోపణలు చేస్తోంది?

`కాళేశ్వరం లో అవినీతి జరిగిందంటోంది?

`జిల్లాల పర్యటనలో బీఆర్‌ఎస్‌ నాయకులనే టార్గెట్‌ చేస్తోంది?

`నాయకులంతా అవినీతి పరులైతే పార్టీ బతికి బట్ట కడుతుందా?

`పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఒక్క మాట కూడా కవిత మాట్లాడడం లేదు?

`పార్టీకి పని చేస్తున్నవారిని టార్గెట్‌ చేస్తున్నారు?

`ఉద్యమ కాలం నుంచి పార్టీ కి సేవ చేస్తున్నవారిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు?

`జనం బాటలో ప్రభుత్వాన్ని పల్లెతు మాట అనడం లేదు?

`బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదు?

`కవిత కు బీఆర్‌ఎస్‌ అదినాయకత్వం భయపడుతోందా?

`కవిత ఆరోపణలు పార్టీకి తీరని నష్టమే?

`ఉపేక్షిస్తే మొదటికే మోసమే?లేవకుండా మునగడం ఖాయమే?

`‘‘కవిత’’ వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రజలెవరు పట్టించుకోవడం లేదు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:                      చిన్నపిల్లాడు చీపురు పుల్లతో కొట్టిననాడే వద్దని చెప్పకపోతే రోకలి బండతో కొట్టే రోజు కూడా రావొచ్చు. ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత చేస్తున్నది కూడా అదే. ఆమె పదే పదే తలుపు చెక్కతో కొడుతుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు దెబ్బలు ఓర్చుకుంటున్నట్లే వుంది. బిఆర్‌ఎస్‌ నాయకులను కవిత అన్నన్ని మాటలు అంటుంటే ఎవరు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న సమాజం నుంచి కూడా ఉత్పన్నమయ్యే రోజు వస్తుంది.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. కాన్సర్‌ కణితికి వెంటనే చికిత్స చేయకపోతే ఒళ్లంతా పాకుతుంది. ప్రాణం హరిస్తుంది. ఇక్కడ పార్టీకూడా అంతే. ఎందుకంటే ఆమె టార్గెట్‌ చేస్తున్న నాయకులంతా ఎవరో చిన్నా చితకా నాయకులు కాదు. అడ్రస్‌ లేని వాళ్లు కాదు. ఉద్యమకారులు. తెలంగాణకోసం పోరాటం చేసిన వాళ్లు. పార్టీ కోసం ఇటుక రాళ్లై మోస్తున్నారు. భుజాలు నొప్పి పెట్టేలా పార్టీ జెండాలను మోసిన వారు. పార్టీ కోసం అనేక ఇబ్బందులు,సమస్యలు, కేసులు ఎదుర్కొన్నవారు. పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న వారు. పార్టీయే ప్రాణంగా రాజకీయాలు చేస్తున్న వారు. అన్నింటికన్నా ముఖ్యంగా కేసిఆర్‌ను దేవుడుగా కొలుస్తున్నవారు. అలాంటి నాయకులను ఏరి కోరి ఎంచుకొని కవిత విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. వారిని ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగతంగా మారిపై బురద జల్లుతున్నారు. కడుక్కోండి అని సవాలు చేస్తున్నారు. పెద్ద సారు కూతురు కదా! అని నాయకులు ఓపిక పడుతుంటే మరింత రెచ్చగొడుతున్నారు. వాళ్లు నిజంగానే నోరు తెరిస్తే కవిత రాజకీయం ఏమౌతుందో ఆమె రాజకీయం ఏమౌతుందో అర్దం కాదు. ఏ నాయకులకైనా సహనం కొంత వరకే వుంటుంది. అయినా కవిత పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటున్నారు. కాని నేరుగా కేసిఆర్‌పైనే అస్త్రాలు సంధిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే ఎవరైనా తర్వాత తండ్రి పెంపకం గురించి మాట్లాడుకుంటారు. కుటుంబం మీదనే నిందలేస్తారు. ఇప్పుడు కవిత చేసే విమర్శలు కూడా నేరుగా కేసిఆర్‌కే తగిలేలా చేస్తున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో..తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సమాజంలో రెచ్చగొట్టే వాళ్లు అనేక మంది వుంటారు. చిచ్చులు పెట్టే వారు వుంటారు. వారి మాటలు నమ్మితే మోసపోయేది మా మాటలు విన్నవాళ్లే అనేది కవితకుతెలియంది కాదు. ఒక వేళ కవిత ఇన్ని రకాల విమర్శలు చేసి, ఆరోపణలు చేసి పార్టీని భ్రష్టు పట్టించాలని చూస్తుంటే ఇంకా ఓపిక పడుతున్నారు. ఒక్కసారి వాళ్లుంతా నోరు తెరిచినా చివరికి అవి కూడా కేసిఆర్‌కే తగులుతాయి. ఆ విషయాన్ని ఆమె మర్చిపోతోంది. తాను కేవలం నాయకులను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నానన్న భ్రమల్లో వున్నట్లున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకుల ఓపిక నషించి కవితనపై కేసుల విషయం ప్రస్తావిస్తే, కవిత కడిగిన ముత్యం అని కేసిఆర్‌ చెప్పిన మాటకూడా అబద్దమని తేలుతుంది. అంతిమంగా తన తండ్రి, పార్టీ అద్యక్షుడు కేసిఆర్‌కే అప్రదిష్ట వస్తుంది. పార్టీ ఓడిపోయినా, కేసిఆర్‌ ఇమేజ్‌ను ఎవరూ చెరపలేకపోయారు. ప్రజల్లో కేసిఆర్‌కు వున్న ఆదరణ తగ్గించలేకపోయారు. కేసిఆర్‌ను ఇంకా తెలంగాణ సమాజం తెలంగాణ పిత అనే గౌరవిస్తోంది. కాని కవిత నాయకులను టార్గెట్‌ చేసి తన తండ్రిని దృతరాష్ట్రున్ని చేస్తోంది. పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు కేసిఆర్‌కు తగిలేలా చేస్తున్నారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో యాత్ర చేస్తూ కేసిఆర్‌ను విమర్శించారు. అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా వుంటూ తెలంగాణతో నీకేం సంబందం షర్మిలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మేం మేం విమర్శించుకుంటాం. తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవరు? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. కొట్టుకున్నా,తిట్టుకున్నా మేమంతా ఒక్కటే..మధ్యలోకి రావడానికి నువ్వెవరు? అని అన్నారు. అలాంటిది కవితనే ఇప్పుడు నేరుగా పార్టీ నాయకులను విమర్శిస్తూ పోతే అది కేసిఆర్‌కు నమర్దా కాదా? ఆయన పరువుకు భంగం వాటిల్లదా? పార్టీ వుంటే ఎంత? పోతే ఎంత? అన్నప్పుడే పార్టీ నాయకుడు కేసిఆర్‌ గ్రహిస్తే పరిస్దితి ఇంత దూరం వచ్చేదేమీ కాదేమో? తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ పాలనను, కాంగ్రెస్‌ పాలనను పోల్చుకుంటూ తింటే తిన్నారేమో? నీళ్లైంతే ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు. కాళేశ్వరం కట్టి, రైతులను బతికించారని అంటుంటే ఆ మాటలు కవితకు వినిపించడం లేదా? కేసిఆర్‌ దేవుడు అంటూ తెలంగాణ సమాజం చెప్పుకుంటున్న మాటలు కవిత చెవిని చేరడం లేదా? తెలంగాణ ఉద్యమానికి కేసిఆర్‌తో తొలి అడుగు వేసిన హరీష్‌రావు మొదటి నుంచి ఉద్యమంలో లేరని కవిత చెబితే జనం నమ్ముతారా? అసలు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కవిత వున్నారా? కవిత తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడొచ్చారన్నది చరిత్రలో లేదా? కవిత చెప్పే మాటలనే జనం నమ్ముతారనుకోవడం కవిత భ్రమ. ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కానటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం నిర్మాణం కోసం హరీష్‌రావు ప్రాజెక్టు వద్ద ఎన్ని నిద్రలు చేశారో కవితకుతెలియదా? ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పగలు పరిశీలించేందుకే వెళ్లని మంత్రులు దేశంలో అనేక మంది వున్నారు. కాని హరీష్‌ రావు ఒక్కరు మాత్రమే పగలు రాత్రి అనే తేడాలేకుండా పనులు పర్యవేక్షించారు. సమీక్షించారు. రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఒక యజ్ఞంలా కాళేశ్వరం నిర్మాణం కోసం కష్టపడ్డారు. ఆ కష్టాన్ని చూసి అప్పటి గవర్నర్‌ హరీష్‌రావును ఏకంగా కాళేశ్వరరావు అని కీర్తించారు. ఆఖరకు పిసి ఘోష్‌ కమిటీ కూడా కాళేశ్వరంలో అవినీతిని గుర్తించలేకపోయింది. కాని కవిత మాత్రం లేనిపోని రాద్దాంతం చేస్తోంది. తెలంగాణ సమాజమంతా కాళేశ్వరం వల్లనే తాము బతుకుతున్నామని చెబుతుంటే కవిత కాంగ్రెస్‌ కళ్లతో చూస్తోంది. కేవలం పార్టీ మీద ఆదిపత్యం కోసం ప్రయత్నం చేసి ఆఖరుకు బైటకు వెళ్లేదాకా తెచ్చుకున్నది. అయినా కవిత తన సొంత బలం మీద రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం పాలనలో వున్న కాంగ్రెస్‌ పార్టీ మీద మాట్లాడాలి. ఆరుగ్యారెంటీల మీద మాట్లాడాలి. ఆరు గ్యారెంటీ అమలు కోసం ఉద్యమాలు చేయాలి…కేటిఆర్‌, హరీష్‌రావులు క్షేత్రస్దాయిలో వుండాలని ఉచిత సలహాలు ఇస్తూనే, వారినే టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తూ పోతే కవితను చూడడానికే కాదు, కవిత మాటలు వినడానికి కూడా జనం ఆసక్తి చూపరు. అందుకే ఈ మధ్య కవిత జనం బాటకు జనాలు రావడం లేదు. పలిచినా ఎవరూ రావడం లేదని జాగృతి నాయకులు, నేరుగా కవితకే చెబుతున్న సంబాషణలు వైరల్‌ అయ్యాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం తెలంగాణలో సాగు లేదు. నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఊళ్లలో జనం లేరు. వలసలతో ఊరంగా వల్లకాడులా వుండేది. ఏ ఇంటిని చూసినా ఇళ్లకు తాళముండేది. వలసలు పోయిన ఇండ్ల ముందు పొక్కిలి వుండేది. ఊర్లలో నిర్మాణుష్యం తాండవించేది. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. మిషన్‌కాకతీయతో చెరువులు నిండడంతోనే సాగుమొదలైంది. కాలేశ్వరం నిర్మాణంతో తెలంగాణ కళకళలాడిరది. ఒకప్పుడు తిండికేడ్చిన తెలంగాణ రైతు దేశానికి అన్నం పెట్టేంత ఎదిగాడు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకుంటున్నాడు. సరిగ్గా పన్నెండేళ్ల కింద పగలు చూద్దామన్నా కరంటు లేదు. రాత్రి వెలుగు లేని రోజులు తెలంగాణ చూసింది. అలాంటిది ఆరు నెలల్లో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతూ మెరిసిపోయింది. అలాంటి ప్రగతిని ఈతరం తెలంగాణ చూస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. ప్రపంచంలో ఇంత శీఘ్రమైన ప్రగతి జపాన్‌లో కూడా జరగలేదు. అలాంటి బిఆర్‌ఎస్‌ పాలన అనుకున్నంత ప్రగతి జరగలేదని కవిత చెప్పడమంటే కళ్లుండి చూడలేని తనమే.. రాజకీయ కుళ్లును కంటి నిండా పెట్టుకోవడమే? కవిత సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం చేసి, ఎదిగితే ఎవరూ కాదనరు. ఎవరి అండా లేకుండా నాయకురాలిగా రాణిస్తే అందరూ సంతోషిస్తారు? కాని హరీష్‌రావు లాంటి నాయకుల మీద నిత్యం విషం చిమ్ముతూ పోతుంటే జనమే మెచ్చరు. బిఆర్‌ఎస్‌లో నాయకులు కార్యకర్తలందరూ కేసిఆర్‌కు కొడుకులు, కూతుళ్ల లాంటి వారే! కేసిఆర్‌ను కొలిచేది వాళ్లే. పార్టీని కాపాడుకునేదివాళ్లే..కేసిఆర్‌ను మళ్లీ గెలిపించుకునేది కూడా వాళ్లే. కవిత ఒక్కరి కళ్లకు వెలుగు కనిపించపోతే, తెలంగాణ చీకటైపోయినట్లు కాదు. తెలంగాణ రాజకీయాలకు కవితకు లేదు చోటు!!

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి నూతన డీసీసీ అధ్యక్షుడుని మర్యాద పూర్వకంగా కలిసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అసోసియేషన్ కమిటీ సభ్యులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నూతనంగా ఎన్నికైనా డీసీసీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు
ఈ కార్యక్రమంలో కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు
శిరూప అనిల్, ఉపాధ్యక్షుడు నాగపూర్ సమ్మయ్య గౌడ్ , ఆకుల శ్రీనివాస్ సెక్రెటరీ, రేకుల కుమార్, వెంకటాద్రి, మేనం తిరుపతి, చిర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుందని, కార్మికులకు నష్టం కలిగించే నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేకు హుస్సేన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడి తల సమ్మయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడుతూ..
అనేక సంవత్స రాలుగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను ఏర్పాటు చేయడం యావత్ కార్మిక లోకానికి తీరని నష్టమని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 25, 26న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బి ఎం ఎస్ తప్ప భారీ ప్రదర్శనలకు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ ల ప్రతులను దహనం చేశారు. నేడు కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 26 న జిల్లా కలెక్టర్, ముందు ఉదయం 10 :00 గంటలకు ధర్నా నిర్వహించి, సాయంత్రం 4 గంటల కు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 26న జరిగే ఆందోళన పోరాటాలలో కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు దేవరకొండ మధు, బాషనపల్లి కుమార్, బి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి…

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షేట్టిపేట,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్,మండలాల తహసిల్దార్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని,ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం,డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని,మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు

జైపూర్,నేటి ధాత్రి:

ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూర్ నియోజకవర్గంలోని మండలాల తహసిల్దార్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యాయుల ఎస్ జి టి అసోసియేషన్ ఏర్పాటు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T163026.335.wav?_=1

 

ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యాయుల ఎస్ జి టి అసోసియేషన్ ఏర్పాటు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలో పనిచేస్తున్న ఎస్ జి టి ఉపాధ్యాయుల సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ కోసం ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( పి టి ఏ) ను ఏర్పాటు చేయడం జరిగింది! గత చాలా సంవత్సరాల నుండి ఎస్ జి టి ఉపాధ్యాయులకు రావాల్సిన ఎమ్మెల్సీ ఓటు హక్కు గాని, పదోన్నతులు లేకుండా ఎస్ జి టి గా పదవి విరమణ చేయడం గాని , కేవలం ప్రాథమిక పాఠశాల లోనే విద్యార్థులు నిష్పత్తి ని పరిగణలోకి తీసుకోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యారంగ వ్యవస్థ కోసం శ్రమ దోపిడీ కి గురవుతున్న ఎస్ జి టి ల కోసం, తమ భవిష్యత్తు కోసం వాడుకుంటున్న వివిధ ఉపాధ్యాయ సంఘాలతో విసిగి తామే ప్రత్యేకంగా ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని అధ్యక్షులు శ్రీ అల్లాడి హరి ప్రసాద్ గారు అన్నారు! ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా అల్లాడి హరి ప్రసాద్ గారిని,ఉపాధ్యక్షులుగా శ్రేమతి సిహెచ్ వాణి , జి. విజయ లక్ష్మి ని, ప్రధాన కార్యదర్శి గా శ్రీ అల్లాడి కృష్ణ ప్రదీప్ ని, సంయుక్త కార్యదర్శి గా బి. గంగ మణి ని మరియు జి. రఘునాథ్ ని , కోశాధికారి గా జి. ప్రవీణ్ కుమార్ గారిని, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా సిహెచ్. గంగ్గయ్య, శ్రీ A. నరేష్, జి. విశాల్, టీ. వేణుగోపాల్, ఆర్. శివ కుమార్, జి. శ్రీధర్, బి. కల్పన,ను మరియు అడ్వైసర్ లుగా అరిసె శంకర్, వి. వేంకటేశ్వర్ రావు ను మండలం లోని ఎస్ జి టి ఉపాధ్యాయులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారని.

ఎన్నికల కోసం బిజెపి తపన

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తెచ్చే రైతుల పట్ల సమన్వయం పాటించి కొనుగోలు చేయాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వి ఎఫ్ జి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనసులు పొందాలని ఆయన అన్నారు. రైతులు దళారులు వద్ద మోసపోకుండా ప్రభుత్వ ఆమోదిత పొందిన కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించరలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ దామోదర్, ఏవో బన్నరజిత, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, డైరెక్టర్లు మార్తా మార్కండేయ, మంద రాజిరెడ్డి, లింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, సభ్యులు నాన బోయిన రాజారామ్, వెంగల్ దాస్ రమేష్, గుండాల శ్రీశైలం, గోనె ల నరహరి, తిరుపతి రెడ్డి, ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, పురుషోత్తం సురేష్, ఏఈఓ శ్రీకాంత్, సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది…

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి నినాదంతో వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తూ వ్యాపారాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని ఉద్దేశంతో మహిళ ఆర్థిక ప్రగతిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం, డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 2 వేల 671 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల 31 లక్షల 12 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు…

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు**
* మహాదేవపూర్  నేటి ధాత్రి *

మహదేవపూర్ మండలానికి చెందిన లారీ డ్రైవర్లతో మహాదేవపూర్ పోలీసు వారు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని ,అతి వేగంగా వాహనం నడపకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తగినంత నిద్ర తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించి వాహనం నడపాలని, నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోబడును అని మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ మరియు సాయి శశాంక్ ఎస్సై తెలిపారు.

బెగుళూరు గ్రామంలో ఆడపడుచులకు చీరల పంపిణీ..

బెగుళూరు గ్రామంలో ఆడపడుచులకు చీరల పంపిణీ

మహాదేవపూర్ ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో ఆడపడుచులకు మంగళవారం రోజున ఘనంగా చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి మంది మహిళలకు కోటి చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ” మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఆడపడుచులకు బెగుళూరు గ్రామంలో చీరల పంపిణీనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో మహిళా సంఘాల గ్రూపుల మహిళలకు, మహిళలకు చిరల పంపిణీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటకం అశోక్, మాజీ ఎంపీపీ రాణి బాయ్, ఓబిసి మండల అధ్యక్షులు పోల్ మొండి, మాజీ సర్పంచ్ ఆకుల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్య, బుర్రి శివరాజ్, చల్లూరి సదానందం, దోమల రాజేష్, ఆకుల శ్రీనివాస్, చిప్ప జయంత్, గయా సంతోష్, పేర్ని గట్టుస్వామి, ముత్యాల మల్ల గౌడ్, చల్ల రమేష్ రెడ్డి, బెంగళూరు గ్రామ సమైక్య సంఘ సభ్యులు సిసి నిర్మల, సిఏ కారు గౌరక్క, ముల్కల రాజమణి మరియు ప్రజల పాల్గొన్నారు.

కస్తూర్బా బాలికల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి.ABVP నాయకులు…

కస్తూర్బా బాలికల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి.ABVP నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం కస్తూర్బా బాలికల హాస్టల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని. ABVP. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేస్తూ నిరసనవ్యక్తం. చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజ్యం కార్తీక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పలు సమస్యలపై హాస్టల్ ప్రిన్సిపల్.కి పలు సమస్యలు విన్నవించగాదురుసుగా మాట్లాడిందనిఈరోజు ఏబీవీపీ .నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూఅదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా ప్రిన్సిపాల్ కిసమస్య ఉందని చెప్పినప్పటికీ కూడా నాకెందుకు చెప్తున్నారు అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు అదేవిధంగా ఏబీవీపీ నాయకులు వెళ్లి సమస్య ఏంటి మేడం అని అడిగితే మీరు నిజంగా ఏబీవీపీ నాయకులు మీ దగ్గర కార్డు ఉందా లేదా లెటర్ ఉందా అంటూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిందనీ విద్యార్థి నాయకులు అన్నారు. అదేవిధంగా హాస్టల్ లోపల బాలికలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ అదేవిధంగా డిఓగారిని ఈరోజు వారిని కలిసి తెలియజేశారు లేనిపక్షంలో ఇదే హాస్టల్.ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో. ABVP .హాస్టల్ జిల్లా కన్వీనర్ పూజ్యం.కార్తీక్. నాయకులు ధనుష్ చరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

 

గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదు..

ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం…

గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి…

వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది..

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆస్పత్రికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్ సత్య శారద దేవి

వర్ధన్నపేట( నేటిధాత్రి)
పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు సుమారు రూ. 28 కోట్ల నిధులతో నిర్మించబడనున్న ఈ ఆసుపత్రికి భూమిపూజను గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ
గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, వంద పడకల ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజల కళ అని, అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఉప్పరపల్లి వద్ద వంద పడకల ఆసుపత్రి పనులను చేపడుతున్నామని, వీలైనంత త్వరగా ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని డయాలసిస్ పేషెంట్లు వైద్యం కోసం ఎంజీఎం వెళ్లాల్సి వస్తుందని, వర్ధన్నపేట నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని, డయాలసిస్ సెంటర్ మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహలకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. త్వరలోనే మున్సిఫ్ కోర్టు ప్రారంభమవుతుందని, కోర్టు ఏర్పాటు అయితే ఈ ప్రాంత ప్రజలకు హనుమకొండకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, క్రీడారంగ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, త్వరలోనే నియోజకవర్గానికి స్టేడియం మంజూరు అవుతుందన్నారు. ఇటీవలే వరంగల్ జిల్లా కలెక్టర్ జల సంరక్షణలో అవార్డును అందుకున్నారని, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహిళా కలెక్టర్ అయిన అనునిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగ్గా పనిచేస్తున్నారని, వరంగల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు….

“వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం.
ఈ ఆసుపత్రి ద్వారా అత్యవసర సేవలు, ప్రసూతి సేవలు, శస్త్రచికిత్సలు, పిల్లల వైద్య సేవలు వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంబులెన్స్ సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు త్వరితగతిన చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తాము.
వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాం” అని అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ.
వర్ధన్నపేట నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ఎంజీఎం ఆస్పత్రిపై భారం తగ్గుతుందని, 1-2 సంవత్సరాలు ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రస్తుతం 300, 400 ఓపి పేషెంట్లు వస్తున్నారని, భవిష్యత్తులో ఒపీ పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మెడికల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, వరంగల్ జిల్లా DM&HO సాంబ శివరావు, DCH రామ్మూర్తి, సూపర్డెంట్ నరసింహ స్వామి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన…

లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్య తిరేక విధానాలు మానుకో వాలి

శాయంపేట నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రం లో ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు మారేపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోరాటాలు నిర్వహిం చి త్యాగాలు చేసి సాధించు కున్న కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్పొరేట్లకు, భూస్వాములకు ఊడిగా ఊసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు పోతున్నదని విమర్శించారు. అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా, ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు దెబ్బతీసే నాలుగు లేబర్ చట్టాలను వెనక్కి తీసు కోవాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు కూడా కార్మికులకు నానా విధాలుగా కష్టాలు ఎదురవుతున్నాయి. వేత నాలు నిర్ణయించే అంశాన్ని యజమాన్యాలకు వదిలేయడం ఎంతవరకు సంబంధం సబమని ప్రశ్నించారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు వినాశనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపె నీలలో పనిచేస్తున్న, గతంలో 8గంటలు మాత్రమే పనిచేసేది. ఈ చట్టాల ద్వారా 12గంటలు చేయాలి. యాజమాన్యానికి నచ్చితే పని చేయించుకుంటా రు, నచ్చకపోతే వారిని తీసేస్తా రు. యాజమాన్యానికి స్వేచ్ఛ ను కలిగించిన నరేంద్రమోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కితీసుకోక పోతే కేంద్రప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు

error: Content is protected !!
Exit mobile version