ఆస్తి గొడవలో మహిళా న్యాయవాది దారుణ హత్య

మహిళా న్యాయవాది దారుణ హత్య

• పొలం వద్దే మెడ కోసి చంపిన సోదరుడు
* ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి
* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం
* ఎస్ ఐ, ఎమ్మార్వో లను సస్పెండ్ చెయ్యాలి
* హత్యను నిరసిస్తూ రోడ్డుపై న్యాయవాదులు ధర్నా..

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కనికరం లేకుండా సొంత చెల్లెలిని కత్తితో నరికి చంపిన ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం రేపింది.
కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్నకుమారి( 34) చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెకు, ఆమె సోదరుడు రాజుకి మధ్య ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద ఆస్తి పంచాయితీ జరుగుతుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు రాజు వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో మొయినాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

* పోలీసుస్టేషన్ ముందు చేవెళ్ల కోర్టు న్యావాదుల ధర్నా..

తోటి న్యాయవాది హత్యకు గురవ్వడంతో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులు బైకాట్ చేశారు. ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని న్యాయవాదులు ప్రశ్నించారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

* ఎస్ ఐ, ఎమ్మార్వో లను సస్పెండ్ చెయ్యాలి.

బుధవారం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్యకు
ఆస్థి వివాదమే కారణం కారణమయ్యింది. ఈ హత్యకు మొయినాబాద్ ఎమ్మార్వో, పోలీసులు కారణమని చేవెళ్ల కోర్టు న్యాయవాదులు ఆరోపించారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు.


రెవెన్యూ అధికారులు భూ సమస్యలు, ఆస్తి వివాదాలపై
అలసత్వం వహిస్తున్నారని, ప్రతి చిన్న సమస్యను కాలయాపన చేస్తూన్నారని, భూ హత్యలకు రెవెన్యూ
అధికారుల అలసత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో త్వరితగతిన సమస్యను పరిష్కరించి ఉంటే ఈరోజు ఒక నిండు ప్రాణం బలి కాకపోయుండేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అన్నారు.

3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.

 

ఇంటర్నెట్ డెస్క్: అసోం రాష్ట్రం గౌహతీ పంజాబరిలో ఓ కుటుంబం చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. పనిలో పెట్టుకుని ఏడేళ్లుగా నరకం చూపించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. అధికారులు ఇంటిని సోదా చేస్తున్న సమయంలో ఎక్కడా బాలిక కనిపించలేదు. అయితే, యజమానుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బెడ్ కాట్(మంచం)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంచం లోపల ఒక ఇరుకైన ర్యాక్‌లో బాలికను కుక్కి దాచినట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

బుధవారం రేగొండ మహాత్మా జ్యోతి భా పూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
సామాజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం సాధ్యమవు తాయని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వివక్షకు తావు లేకుండా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, తహసీల్దార్ శ్వేతా, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డిసిఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా..

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా

 

vదీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా రేపటికి వాయిదా పడింది.

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్‌‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగానికి ముందే సభను స్వీకర్ గురువారానికి వాయిదా వేశారు.
మూడుసార్లు వాయిదా

బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభ బుధవారంనాడు మూడు సార్లు వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభ కాగానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్‌సభ వాయిదా పడింది. దీంతో విపక్ష సభ్యులు పార్లమెంటు మెట్ల వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలో సమాధానం ఇస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గెయల్ చెప్పడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా.. 8 మంది ఎంపీలను సమావేశాల నుంచి బహిష్కరించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు వ్యతిరేకంగా విపక్ష సభ్యలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటలకు సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమై మోదీ ప్రసంగించాల్సి ఉండగా దీనికి ముందే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.

విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమం

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచే కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘చదువుకో తెలంగాణ – బాగా చదవండి’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, ప్రతిభను వెలికితీయడం దీని లక్ష్యం. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఉన్నత లక్ష్యాలతో రాణించాలని వక్తలు సూచించారు. గ్రామ సర్పంచ్ రాజ్కుమార్, ఉపసర్పంచ్ వాహబ్, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బి.డి.ఎం సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని 16 సార్లు పొడిచి..

తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని 16 సార్లు పొడిచి.. బాబోయ్ దారుణం..

 

కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి సమాచారం అందించాడు.

బెంగళూరు, ఫిబ్రవరి 04: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి.. హత్య గురించి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై కాలుపెట్టి నిలబడి ఉన్నాడు. నడ్డి రోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి జనం వణికిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రం బెలగావి ప్రాంతంలోని బసదోని గ్రామానికి చెందిన బసప్ప హోసమణి(51) పదేళ్ల క్రితం ఓ మహిళతో పారిపోయాడు. వారిద్దరూ కొల్హాపూర ప్రాంతంలో స్థిరపడ్డాడు. అయితే, తన తల్లిని లేపుకుపోవడంతో హోసమణిపై ఇరయ్య మఠపతి పగ పెంచుకున్నాడు. దాదాపు పదేళ్లుగా అదే పగతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే హోసమణి.. బసదోని గ్రామానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం బైక్ పై వెళ్తున్న అతడిని మఠపతి ఆపాడు. అనంతరం బైక్ పైనుంచి కింద పడేసి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్షణాల వ్యవధిలో 16 సార్లు పొడిచాడు.దీంతో బసప్ప అకడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలానే ఈ హఠాత్పరిణామంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇక తాను చేసిన హత్యపై నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చే సరికి.. మృతదేహంపై కాలు మోపి నిలబడి ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తల్లితో పారిపోయాడనే కసితో 10 ఏళ్లుగా ఎదురు చూసి.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే గండ్ర

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24, 25, 23 వార్డులు టీ – 2 క్వార్టర్స్, కారల్ మార్క్స్ కాలనీ, 6 ఇంక్లైన్ రోడ్డు రాజీవ్ నగర్ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వేముల జ్యోతి – శ్రీకాంత్, పొనకంటి మేఘన – శ్రీనివాస్, శిరుప స్వప్న – అనిల్ ల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, ముఖ్య నాయకులు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు 22వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ముంజాల రవీందర్ గౌడ్ కు చెందిన ఎన్నికల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చేర్యాలలో వంగ జయ ప్రచారంలో ముందంజ

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ జయ ప్రచారంలో ముందంజ

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 4 వ వార్డు అభ్యర్థి వంగ జయ ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు చేర్యాల మున్సిపాలిటీ లో 4 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల మనసు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రచారంలో పూర్మ ఆగం రెడ్డి ఆడెపు చంద్రయ్య అంబాల రాము రాగుల శ్రీనివాస్ రెడ్డి తాటికొండ సదానందం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి..

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి

# పదో తరగతి టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు పారితోషకం .

నల్లబెల్లి , నేటి ధాత్రి:

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థిక నష్టపోకుండా ఉండాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు . బుధవారం నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చదువుకో తెలంగాణ అనే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చదువులో ముందుండాలని సూచించారు . ఈ సందర్భంగా డిఎం వర ప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతిభవంతులైన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు . రాష్ట్రస్థాయిలో టాపర్ గా వచ్చిన విద్యార్థికి 5 లక్షలు , రెండో స్థానం విద్యార్థికి 3 లక్షల రూపాయల తో పాటు ప్రతి జిల్లా స్థాయి మొదటి స్థానం విద్యార్థులకు 2 రెండు లక్షల చొప్పున,119 నియోజకవర్గస్థాయి విద్యార్థులకు లక్ష రూపాయలు , రాష్ట్రంలోని 6 29 మండల స్థాయిలో ప్రధమ టాపర్లకు పదివేల చొప్పున నగదును శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్నా అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత , కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి ఏ . సునీత నందిగామ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ యాదండ్ల రాజు , నల్లబెల్లి డివో పి . శ్రీను , బీడీఈ చరణ్ రాజ్, విజయ్ రెడ్డి లు పాల్గొన్నారు

నూతన గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన గౌడ సంఘం క్యాలెండరు ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

నూతన గౌడ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పోశాల సురేష్ గౌడ్,జిల్లా ఇంచార్జ్ తాళ్లపెల్లి హరికృష్ణ గౌడ్, మండలం అధ్యక్షులు పోశాల అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు వరికోల్ గ్రామంలో ఎల్లమ్మ పండగ పురస్కరించుకొని నూతన గౌడ సంఘం క్యాలెండరు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం పెద్దమనిషి పోశాల సమ్మయ్య గౌడ్,గ్రామ అధ్యక్షులు పోశాల రమేష్ గౌడ్,గ్రామ ఎల్లమ్మ టెంపుల్ అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్,ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి రాజు గౌడ్,గ్రామ కమిటీ మెంబెర్స్ ఒల్లలా మల్లయ్య గౌడ్,పోశాల రాజు గౌడ్, తాళ్లపెల్లి రఘుపతి గౌడ్, తాళ్లపెల్లి సదానందం గౌడ్, ఓల్లాల కిరణ్ గౌడ్,పోశాల సంపత్ గౌడ్,నూతన గౌడ సంఘం అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావటం జరిగింది.వారితో పాటు రాష్ట్ర కమిటీ మెంబెర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ గౌడ్,కిరణ్ కుమార్ గౌడ్, రమేష్ గౌడ్,అంజి గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ అభివృద్ధే ప్రజల ఓటు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని టిటు క్వార్టర్స్ కారల్ మార్క్స్ కాలనీ 26 వార్డు అభ్యర్థి దుర్గం రాదా ఐలయ్య 7వార్డు అభ్యర్థి నూకల భూలక్ష్మి చంద్రమౌళి గెలుపుకై సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు

న్యాయదేవత దుఃఖిస్తోంది: సీఎం మమతా బెనర్జీ…

న్యాయదేవత దుఃఖిస్తోంది: సీఎం మమతా బెనర్జీ

 

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తలుపుల వెనుక న్యాయ దేవత దుఃఖిస్తోంది’ అని అన్నారు. సుప్రీంకోర్టులో అయినా తమకు న్యాయం జరగాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు మమత.
పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ, మోస్తారీ బాను, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించిన సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల సంఘాన్ని ‘వాట్సాప్ కమిషన్’గా అభివర్ణించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు చూపించినా ఎస్ఐఆర్ అధికారులు అంగీకరించడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు.ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న అసోంలో కాకుండా.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్‌ను చేపడుతున్నారంటూ ఈసీ తీరుపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న అసోంలో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం లేదని ప్రశ్నించారామె. బీఎల్ఓలపై ఒత్తిడి తెచ్చి ఓట్లను తొలగిస్తున్నారని.. ఈ అంశంపై ఈసీకి ఆరుసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బెంగాల్‌లో వంద మంది చనిపోయారన్నారు. సుప్రీంకోర్టులో అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు సీఎం. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల హక్కులను కాపాడండి’ అని సీజేఐకి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మమత అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

నెక్కొండ మండలంలో వైద్య శిబిరం…

నెక్కొండ మండలంలో వైద్య శిబిరం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల వైద్యాధికారి డా. సుమన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 115 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేపట్టగా, 11 మందికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా గ్రామంలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించి, ‘ఫ్రైడే డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేశారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులు అయిన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యుడు డా. రాహుల్, హెల్త్ అసిస్టెంట్లు రవిచంద్ర రెడ్డి, నాగలక్ష్మి, ఆశ కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామ సెక్టార్ మీటింగ్ ఓడితల లక్ష్మీ అంగన్వాడి టీచర్ కేంద్రంలో సమావేశము ఏర్పాటు చేసుకొవడం జరిగింది, జయప్రద సూపర్వైజర్ ఎజెండా అంశాలు, సమయపాలన, పిల్లల బరువు, ఎత్తు, పోషకాహార పంపిణీ, బాల్యవివాహాలు, గృహ సందర్శన, పిల్లల టీకాల గూర్చి రివ్యూ చేయడమైనది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి భగవాన్ , ఉపసర్పంచ్ కాంపల్లి శ్రీకాంత్ హాజరై పిల్లలకు బాలమృతం ,ఎగ్స్ పంపిణీ చేయడం జరిగింది. స్కూల్ హెచ్ఎం మహేందర్ మాట్లాడుతూ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రైమరీ స్కూల్స్ పంపించినట్లయితే నేటి బాలలే రేపటి పౌరులుగా అన్ని రంగాలలో ముందంజలో ఉంచుతామని అందుకు ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లకుండా సహాయ సహకారాలు అందించాలని కోరి ఉన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ స్కూల్స్ ఎటువంటి సహాయ, సహకారాలుఅవసరం ఉన్న అందిస్తామని తెలిపినారు.25.మంది అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కరు సుమలత హాజరైనారు.

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరలో భక్తజన సందోహం…

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరలో భక్తజన సందోహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద బుధవారం జరిగిన ఉర్సు జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా హాజరై జాతర వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. భక్తుల రాకతో దర్గా పరిసరాల్లో సందడి నెలకొంది.

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్న నేపద్యంలో ఒకటో వార్డులో సిపిఐ పార్టీ అభ్యర్థి కౌడగాని సాంబయ్య జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఒకటో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తారక రామ కాలనీ, అల్లూరి సీత రామ రాజు నగర్ ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా సీ. పి. ఐ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు ఒకటో వార్డ్ అభ్యర్ధి గా సీ.పి. ఐ& బి. ఆర్.ఎస్ లు బల పరచారని తెలిపారు. కంకి కొడవలి గుర్తు కు ఓటు వేసి
బారి విజయం అందించాలని కోరారు.

కేంద్ర బృందం పరిశీలించింది..

కేంద్ర బృందం పరిశీలించింది.
మరమత్తులు ఎప్పుడు?

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత వర్షాలకు దెబ్బతిన్న నందిగామ 765 డీజీ రోడ్డు పై వంతెన, నిజాంపేట మల్కచెరువు మత్తడి రహదారి నేటికి పునర్నిర్మాణానికి నోచుకోలేదు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసినా, శాశ్వత పరిష్కారం లభించలేదు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని పరిశీలించిన పనులు ప్రారంభం కాకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు. నిజాంపేట – నస్కల్ గ్రామాల మధ్య ప్రయాణం నరకప్రాయంగా మారిందని, వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలంటున్నారు.

గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం…

*గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం చెయ్యలేదా లేక అడ్వా్టేజింగ్ చేసుకోలేదా కాంగ్రెస్ మంత్రి చెప్పాలే ***

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

 

బుధవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 16వరకు తెలంగాణ తెలంగాణ నిజాం పరిపాలన ఉన్నాది అప్పుడు జాతర చేస్తే నిజాం పాలకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు మేడారం జాతర అప్పటి పరిస్థులకు అనుకూలంగా జాతర జరిగేది కానీ తెలంగాణ కు స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం లు 1996 వరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు లేకపోవడం వలన ప్రభుత్వం దృష్టికి మైదాన ప్రాంత నాయకులు 1952 నుండి ములుగు ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులు ఉండడం వలన గుర్తించపడలేదు కానీ 1996 లో ఉప ఎన్నికల్లో చర్ప భోజరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మేడారం జాతర ఆదివాసీ కుల దైవం అని చెప్పి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది తర్వాత పోదేం వీరయ్య ఈ ప్రాంతవాసుల వలన మేడారం జాతర అభివృద్ధి అయ్యింది ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నాది కానీ మేడారం జాతర కు వచ్చిన నిధులను 75% ములుగు లో ఖర్చు పెడుతున్నారు 25%నిధులు మాత్రమే మేడారం జాతర లో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాని అన్నారు అదేవిదంగా మంత్రి మాటలు కాంగ్రెస్ నాయకులు మేడారం జాతర ను అభివృద్ధి చెయ్యనట్టు మాట్లాడుతూ అడ్వా్టేజింగ్ కోసం తపన పడుతున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు అదేవిదంగా గత ప్రభుత్వలు అభివృద్ధి చెయ్యలేదా లేక గతం లో ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యే లు అడ్వా్టేజింగ్ చేసుకోలేదా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రి చెప్పాలని అన్నారు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి 3 సంత్సరాల వయస్సు లోనే ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వార్గాల వారికీ రాజ్యాధికారం కోసం పోరాటం చేసింది ఎంత నిజమో మేడారం జాతర అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం కూడ అంతే నిజం అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు గత ప్రభుత్వం ఎప్పుడు మేడారం జాతర నిర్వహించలేదు కానీ ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పోరాటం చేసింది కాబట్టి నేడు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయ్యింది కాబట్టి మేడారం జాతర విజయవంతం చేసిందా అన్నారు అదేవిదంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేడారం జాతర తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందా లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేశారో చెప్పాలని అన్నారు ఇప్పటికైనా తడ్వాయి మంగపేట ఏటూరునాగారం కన్నాయిగూడెం మండలం లో ఉన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ ఏజెన్సీ ప్రాంతం ను ఎడారి గా మార్చడానికి ప్రయత్నం చెయ్యకండి అన్నారు అలాగే ఈ ప్రాంత నాయకులకు జెండాలు మొయ్యడం మీద ఉన్నా అభిమానం ఏటూరునాగారం బస్సు డిపో రెవిన్యూ డివిజన్ పైన లేక పోవడం బాధాకరం అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం మండలం లోని ప్రజలు మేధావులు పత్రిక మిత్రులు అలోచించి అర్ధం చేసుకోండి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పైన ప్రేమ అభిమానం ఉంటే ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఎందుకు ఆమోదం ఎందుకు పొందడం లేదో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులను నిలతీయ్యాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు

3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి…

3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ 16వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల మంజుల ని గెలిపించాలంటు ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 10 ఏళ్లుగా నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేశాం.
రాబోయే సంవత్సరాల్లో కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని మాట ఇస్తున్నాం.అందుకే మీ అందరి ఆశీర్వాదం అవసరం. భూమి పట్టాల విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పా, ప్రైవేట్ పట్టా భూముల విషయంలో, పట్టాదారులను ఒప్పించి ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి, ఎమ్మార్వో ద్వారా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా పనిచేసినం,త్వరలోనే వాళ్ళని ఒప్పించి మీకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
3వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేస్తున్న పిల్లలమర్రి శారద నారాయణ ని 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జ్యోతుల మంజుల ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు…

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కిలి దేవికుంట (1వ వార్డు) బిఆర్ఎస్ అభ్యర్థి కోనాపురం ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. “అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి” నినాదంతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో మహిళలు, వార్డు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి ‘కారు’ గుర్తుపై భారీ మెజార్టీతో గెలుస్తామని, ఎక్కిలి దేవి కుంటను నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: తలారి సతీష్

కోహిర్ పట్టణంలోని 2వ వార్డు భీమ్ నగర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సతీష్, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన ఆయన, కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తూ పథకాలు అందరికీ అందుతున్నాయని, వార్డు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలను కోరారు.

error: Content is protected !!
Exit mobile version